Latest Updates
-
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
డయాబెటిక్ రోగికి పాదాల జాగ్రత్తలు!

- మీ పాదాలను గోరు వెచ్చని నీళ్ళలో పది నిమిషాలు ఉంచండి.
- పాదాల చర్మం గట్టి పడిన చోట అంటే పగుళ్ళు లేదా ఆనల వద్ద నిదానంగా ఫ్యూమిస్ రాయి పెట్టి రుద్దాలి. ఆ తరువాత సబ్బు పెట్టి మీ పాదాలను కడగాలి.
- పాదాలను బాగా తడి లేకుండా ప్రత్యేకించి కాళ్ళ వేళ్ళ మధ్య, గుడ్డపెట్టి తుడిచి, లూబ్రికెంట్ క్రీము కాలి మడమలకు రాయాలి.
- వెలుతురు లేనిచోట నడవరాదు.
-అతి చల్లదనం గాని, వేడి గాని కాళ్ళకి తగలకుండా జాగ్రత్తపడాలి. (మోటర్ బైక్ సైలెన్సర్ లు కాలికి అంటుకొన్నా బొబ్బలు వస్తాయి. కావున బైక్ వెనకాల కూర్చున్నపుడు జాగ్రత్తగా కూర్చోవాలి.
- మీ పాదాలు రాత్రి బాగా చల్లబడితే మేజోళ్ళు ధరించాలి. ఈ మేజోళ్ళు కాటన్ లేదా ఉలెన్ వి గా వుండాలి.
- సరైన కొలతగల ప్యూర్ కాటన్ మేజోళ్ళు, లెదర్ బూట్లు ఎప్పుడూ ధరించాలి. బూట్లు బాగా టైట్ గా ఉండరాదు. బూట్లు సైజు సరిగా ఉండేట్లు చూసుకొని వాడాలి. ముందు నొక్కిపట్టి ఉండేవి కాని, నహై హీల్సు కాని వాడరాదు.
-రోజూ సాక్సు మరియు బూట్లు సరిగ్గా చూసుకొని వేసుకోవాలి. వాటిలో చిన్న చిన్న రాళ్ళు గాని, పుల్లలు గాని ఉంటే గాయపరచవచ్చు.
- మీ కాళ్ళు రంగు మారటం గాని తిమ్మిరిగాని, లేదా సూదులతో పొడిచినట్లుగాని ఉంటే మీ డాక్టర్ గారిని సంప్రదించండి.
- షుగర్ ని అదుపులో ఉంచుకుంటే మీ పాదాలకు వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు. కావున మీ డాక్టర్ గారి సలహాలు పాటించండి.
- ఇంటిలోపల కూడా చెప్పులతో నడవాలి. ఎంతుచేతనంటే స్పర్శ రలేకపోవటం వలన కాలికి దెబ్బతగిలి అది పెద్ద పుండుగా అవటానికి అవకాశం ఉంటుంది.
- వీధులలో చెప్పులు లేకుండా నడువకూడదు. గుళ్ళలో కూడా చెప్పులు లేకుండా నడుచునపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- తడిగా ఉండే చెప్పులను వాడకూడదు. దీనివలన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
- కాళ్ళ ఆనలను మీరే స్వయంగా బ్లేడు పెట్టి కోసుకోకూడదు.
- ఆనలను తొలగించే ప్లాస్టర్లు వాడకూడదు.
- వేడి నీళ్ళ కాపడం లేదా ఎలక్ట్రిక్ హీటింగ్ షేడ్సు మీ కాళ్ళకు పెట్టుకోకూడదు.
- ముఖ్యంగా స్మాకింగ్ చేయవద్దు. దీనివలన కాళ్ళకి రక్తప్రసరణ తగ్గుతుంది. స్పర్శ కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ కారణాల వలన షుగర్ వ్యాధి గ్రస్తులు కాళ్ళు మరియు వేళ్ళను గాంగ్రిన్ వలన తీసివేయటం జరుగుతుంది.
- కాలి వేళ్ళ గోళ్ళు తీయుటకు, కత్తెర, బ్లేడు, నైల్ కట్టర్ చాకులు వాడకూడదు. నైల్ ఫైలర్లు వాడాలి.
- నేలమీద పడుకో కూడదు. ఎందుకంటే పురుగులు గాని లేదా ఎలుకలు గాని గాయం చేయుటకు అవకాశం ఉంది.
- కూర్చునేటపుడు బాసిపట్లు వేసి కూర్చోరండి. ఎందుకంటే, నరముల మీద మరియు రక్తనాళములమీద ఒత్తిడి పెరుగుతుంది.
- కాలివేళ్ళ మధ్య పుండుగాని పగులు గాని లేనపుడు ఎటువంటి ఆయింట్ మెంట్ రాయరాదు. కాలి వేళ్ళ మధ్య శుభ్రపరచి తడి ఆరిన పిమ్మట నాన్ మెడికేటెడ్ పౌడర్ చల్లండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications