Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
హైపర్, హైపో గ్లైసీమియాలకు లోను కాకుండా....!

సాధారణంగా షుగర్ వ్యాధివారికి వచ్చే సమస్యలన్ని అధికంగా వారి నిర్లక్ష్యం వలననే వస్తూంటాయి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచటానికి, బ్లడ్ గ్లూకోజ్ ను నార్మల్ గా ఉండేలా చూసుకోవటానికి, షుగర్ వ్యాధి కారణంగా హైపర్, హైపోగ్లైసీమియాలకు, వాటివలన కీటో ఎసిడోసిస్ వంటి ప్రమాదకరమైన పరిస్ధితులకు చేరకుండా ఉండటానికి, షుగర్ వ్యాధి కారణంగా కళ్ళకు ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాకుండా వుండేందుకు, షుగర్ కారణంగా, కిడ్నీలు డామేజ్ అయ్యే తీవ్ర పరిణామం రాకుండా ఉండేందుకు, గుండెకు సంబంధించిన ఏ వ్యాధి బాధలూ సంభవించకుండా ముందు జాగ్రత్త పడేందుకు, పక్షవాతం వంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండాలంటే, సెక్స్ బలహీనతకు లోనై సంసార జీవితాన్ని దుఖ సాగరంలో ముంచెత్తకుండా ఉండేందుకూ, న్యూరోపతీ అన్న పరిస్ధితిని ఎదుర్కొనకుండా ఉండేందుకు, కాలి పుండ్లు మానక కొన్ని పరిస్ధితులలో సర్జరీ ద్వారా గాయమై మానక ఉన్న భాగాన్ని తొలగించే దుష్పరిణామాలు ఏర్పడకుండా ఉండాలన్నా, వ్యాధి నియంత్రణలో లేనికారణంగా, తరచు కంటిచూపు పవర్ మారి గ్లాసెస్ తరచు మార్చే పరిస్ధితి ఎదురుకాకుండా ఉండాలన్నా, పూర్తిగా నేత్ర దష్టిపోయే ఇతర సమస్యలు రాకుండా ఉండాలన్నా, మీరు చేయవలసిందల్లా, బ మీ బ్లడ్ షుగర్ ను ఖచ్చితంగా నార్మల్ స్ధాయిలలో మెయింటెయిన్ చేయాలి.
ఇందుకు మూడు మార్గాలున్నాయి. ఈ మూడు మార్గాలను సూచించేది, మీ వైద్యులే.
1. క్రమం తప్పకుండా నెలకొకమారు లేదా రెండు వారాలకి ఒకమారు బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష చేసుకుంటూ వైద్యుని సూచనలమేర క్రమం తప్పకుండా నిత్యం మందులు వైద్యులు సూచించిన డోస్ లో వాడటం.
వైద్యుల సూచన మేరకు ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ చక్కని ఆహార నియంత్రణ పాటించటం.
మీ పరిస్ధితి అనుగుణంగా డాక్టర్ సూచించిన వ్యాయామాన్ని క్రమం తప్పకుండా విధిగా చేయటం.
2. చికిత్స, ఆహారం, వ్యాయామం అనే ఈ మూడు పద్ధతుల్లో దేనిని వదలక, దేనినీ నిర్లక్ష్యం చేయక మందులు వేసుకున్నాను కదా ఇక వ్యాయామం ఎందుకని గానీ, వ్యాయామం చేశాను కదా మందు వేసుకోకపోతే ఏమవుతుందని కానీ, ఆహారం కాస్త ఎక్కువ అయితే పోయేదేముంది, కాస్త మందు డోస్ పెంచి వేసుకుంటే సరిపోతుంది అనే నిర్లక్ష్య ధోరణిలో కానీ ఈ మూడింటిలో దేనికీ నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సూచన మేరకు ఏదీ మోదతాదు మించకుండా మీ బ్లడ్ షుగర్ ను ఖచ్చితంగా నియంత్రించుకోవచ్చు.
3. బ్లడ్ షుగర్ నియంత్రణకు నేటి రోజులలో ఎన్నో రకాల పరికరాలు వచ్చేస్తున్నాయి. వీటి సహాయంతో ఇంటివద్దే మీ అంతట మీరు బ్లడ్ లోని గ్లూకోజు నియంత్రణలను పరిశీలించుకుంటూ ఎప్పటికపుడు ఆహార జాగ్రత్తలు, వ్యాయామాలు చేయవచ్చు. షుగర్ వ్యాధి జీవన విధానం సరిగా ఆచరించకపోవటం వలన కూడా వస్తుంది. కనుక షుగర్ వ్యాధి రోగులు, చెడు అలవాట్లకు బానిసలు కారాదు. ఆల్కహాల్, పొగతాగటం వంటి చెడు అలవాట్లను వదిలివేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications