Latest Updates
-
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే!
షుగర్ వ్యాధి రీడింగులు ఎలా వుండాలి?

ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ రీడింగ్ 90 - 130 మధ్య ఉండాలి. పోస్ట్ ప్రాండియల్... అంటే ఉదయం టిఫిన్ తీసుకున్న తర్వాత రెండు గంటల అనంతరం బ్లడ్ గ్లూకోజ్ ....180 కన్నా తకన్కువగా ఉండాలి. మీ రక్తపోటు 130/80 ఉండాలి. ఎల్ డిఎల్ కొలెస్టరాల్ రీడింగ్ 100 కన్నా తక్కువగా ఉండాలి. ట్రిగ్లిసెరైడ్స్ రీడింగ్ 150 కన్నా దిగువన ఉండాలి. హెచ్ డి ఎల్ కొలెస్టరాల్ రీడింగ్ 40 కన్నా అధికంగా ఉండాలి.
ఇవన్నీ, ఓ డయాబిటీస్ పేషెంట్ లో నార్మల్ గా ఉండవలసిన రీడింగ్ లు. ముఖ్యంగా వీటిని మీరు గుర్తుంచుకుంటే, మీ బ్లడ్ గ్లూకోజ్ పరిస్ధితి, మీ రక్తపోటు పరిస్ధితి, కొలెస్టరాల్, ట్రిగ్లిసెరైడ్స్ పరిస్ధితి మీకు మీరుగా ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో తెల్సుకునే వీలుంటుంది.
రెగ్యులర్ బ్లడ్ గ్లూకోజ్ చెకింగ్ ఎవరికి అవసరం ఉంటుంది? రెగ్యులర్ సమయాలలో బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ చేసుకోవలసిన అవసరం ఎవరికుంటుందో ముందుగా చూద్దాం.
- ఇన్స్ లిన్ తీసుకుంటున్నవారు.
- డయాబెటీస్ కోసం నిత్యం మందులు వేసుకుంటున్నవారు
- మహిళల్లో ప్రెగ్నన్సీ సమయంలో డయాబెటీస్ వస్తే,
- బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కాక చికిత్సలను మార్చుకుంటూ ఇబ్బందిపడే సమయంలో
- తరచు బ్లడ్ గ్లూకోజ్ బాగా తగ్గిపోతున్న పరిస్ధితిలో
- తరచుగా బ్లడ్ గ్లూకోజ్ బాగా పెరుగుతున్న సందర్భంలో
- ఎటువంటి వార్నింగ్ సిగ్నల్స్ లేకుండానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బాగా పడిపోతున్నపుడు.
ఈ పరిస్ధితుల్లో విధిగా డాక్టర్ సూచన మేరకు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవటం సాధ్యంకాని సందర్భాలలోనే యూరిన్ చెక్ చేసుకోవాలి. యూరిన్ చెకింగ్ ను ఖచ్చితం అని భావించకూడదు. రెగ్యులర్ బ్లడ్ గ్లూకోజ్ చెకప్ కు అవకాశం లేనివారు లేబరేటరీలు, టెస్టింగ్ సెంటర్స్ అందుబాటులో లేనివారు, యూరిన్ షుగర్ ఆధారంగా తమ బ్లడ్ షుగర్ పరిస్ధితిని అంచనావేసుకోవలసి వస్తుంది. ఇందుకు డయాస్టిక్స్ రూపంలో స్టిక్స్ మెడికల్ స్టోర్ లలో దొరుకుతాయి. వాటి సాయంతో యూరిన్ షుగర్ చెక్ చేసుకోవచ్చు.
ఇలానే మార్కెట్ లో లభించే టెస్టింగ్ స్టిక్స్ సాయంతో యూరిన్ లో కీటోన్స్ కు కూడా చెక్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ ను నూటికి నూరు శాతం టైట్ గా కంట్రోల్ చేసుకోల్గిన డయాబెటిక్ రోగులు నిజంగా అక్షరాలా అదృష్టవంతులు. ఎందుకంటే డయాబిటీస్ బాధితులు ఈ విధంగా బ్లడ్ గ్లూకోజ్ ను గట్టిగా నియంత్రణ చేసుకోవడంలో సఫలం అయితే, డయాబెటీస్ కారణంగా ఎదురవుతాయని భావించే ఎలాంటి దుష్పరిణామాలు వీరికి ఎదురు కావు. ఎదురు కాకపోగా వారి ఆయుర్దాయం పెరుగుతుంది. అక్షరాలా మరో పది పదిహేను సంవత్సరాలు అదనంగా జీవించగలుగుతారు. కారణం, ఆహారం విషయంలో, వ్యాయామం విషయంలో ఇతరులతో పోలిస్తే వీరు చాలా చాలా శ్రద్ధగా ఉంటారు కనుక.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications