Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
డయాబెటీస్ తో సెక్స్ సామర్ధ్యం డవున్!

పురుషులలో డయాబెటీస్ ఉన్న వారిలో 33 శాతం మంది అంగం స్తంభించక బాధ పడుతూంటారు.
ఎపుడైతే, అంగం స్తంభించటంలేదో అపుడు పురుషులు తమకు డయాబెటీస్ సమస్య వస్తోందని కూడా గ్రహించవచ్చు. అయితే, వీరు మంచి ఆహారం, వ్యాయామం, తగిన మందులు, మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్లు వంటివి ఆచరించి తమ లైంగిక జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు. లైంగిక సమస్యలు వెనుకబడటంతో పురుషుడు, మరోమారు తన అంగస్తంభన కలిగి రతికార్యాన్ని నిర్వహించవచ్చు.
డయాబెటీస్ కల మహిళలలో కొంతమందికి వజింటిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో మహిళ జననాంగం తీవ్రమంటకు గురవుతుంది. ఇది చాలా తరచుగా వస్తుంది. దీనికితోడు బాక్టీరియా కారణంగా కూడా ఆమెకు ఇన్ ఫెక్షన్లు వస్తాయి. మహిళలో లేదా పురుషుడిలో ఈ రకమైన పరిస్ధితి రతిలో నొప్పి అధికం చేస్తుంది. జననాంగాలు దురద పెట్టటం, మంట పెట్టటం వుంటాయి. డయాబెటీస్ వున్న మహిళలలో సిస్టిటిస్ తరచుగా వచ్చే సమస్య. అంతేకాక, పురుషులలో అంగ స్తంభన ఎలా సమస్య అవుతుందో, మహిళలలో వారి క్లిటోరియస్ భాగంలో స్పందన చచ్చిపోతుంది. డయాబెటీస్ ప్రభావం ఉన్న మహిళలో క్లిటోరియస్ స్పర్శించినప్పటికి ఏ రకమైన స్పందన ఉండదు. అది నిర్వీర్యం అయిపోతుంది.
డయాబెటీస్ వ్యాధి ఉన్నవారు రతి చేసేటపుడు హైపో గ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. వీరికి రాత్రి వేళ కూడా ఈ హైపో ...అంటే లో షుగర్ పరిస్ధితి ఏర్పడుతుంది. సెక్స్ లో కదలికలు వ్యాయామంలో వలే అధికంగా ఉండటం చేత వీరికి ఈ పరిస్ధితి వస్తుంది. రతిలో కనుక మిమ్మల్ని అర్ధం చేసుకొనగల భాగస్వామి ఉంటే, అది మీకు బాగానే సహకరిస్తుంది. కాని చివరకు దానిని ఎలా నిర్వహించాలి అనేది మీకు సంబంధించినదే.
మీరు కనుక ఒక కొత్త సంబంధంలో ఉంటే, మీరు కొత్త పార్టనర్ కు ఈ విషయం వివరించలేకపోవచ్చు. డయాబెటీస్ కప్పి పుచ్చుకోటానికి ఎంతో అవస్ధ పడవలసి వస్తుంది. అయితే, ఈ పరిస్ధితి వెంటనే కాకపోయినా, నిదానంగా అయినా తెలుస్తుంది కాబట్టి మీరు తెలుపటమే మంచిది. తెలుసుకున్న భాగస్వామి మీతో అతి జాగ్రత్తగా రతి ఆనందిస్తూంటే, ఆనందం ఇద్దరికి అధికమే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications