Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
షుగర్ ఆయుర్దాయం పెంచుతుందా...?

ఒక వేళ వ్యాయామం వంటివి చేయటం కుదరనిపక్షంలో ఎంత ఇన్సులిన్ తీసుకోవాలి? వంటి విషయాలన్నీ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ తప్పక తెల్సుకుని ఉంటారు.అలానే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్, ఎంత ఆహారం అవసరం? ఎంత వ్యాయామం అవసరం? వాడే మందులు ఏ మోతాదులో వేసుకోవాలి? వంటి అంశాల నిష్పత్తిని సక్రమంగా పాటించాలి. అలా పాటించినపుడే, డయాబెటీస్ లో బ్లడ్ గ్లూకోజ్ ను టైట్ కంట్రోల్ లో ఉంచగలుగుతాము. ఏం తింటే షుగర్ పెరుగుతుంది? ఆకలి తీరాలి, కానీ షుగర్ పెరగకూడదు.
ఈ పద్ధతిలో తినాలంటే ఏ ఏ ఆహారాలు తినాలి? ఏ ఏ ఆహారాలు అధికంగా తీసుకోవచ్చు? ఏ ఏ ఆహారాలు పరిమితంగా తీసుకోవచ్చు? ఏవి పూర్తిగా విసర్జించాలి వంటి విషయాలు రెండు రకాల డయాబెటీస్ రోగులకు వివరంగా స్పష్టంగా తెలుసుకుని తీరాలి. ఒక సారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఒక డోస్ మందులు వ్రాయించుకుని ఆర్నెలలు అదే మందులు వాడుకుంటూ, మందులు వాడుతున్నా కనుక హేపీగా అన్నీ తినివేయవచ్చని భావించే రోగులు కూడా ఉంటారు. వీరికి ట్రీట్ మెంట్ వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. డయాబెటాలజిస్ట్ ను లేదా మీ ఫిజీషియన్ ను షుగర్ వ్యాధి విషయంలో వారు కలవమన్నపుడల్లా కలవాలి. ఎందుకంటే, మీరేం తింటున్నారు? మీరు మందులు ఏ డోస్ లో వాడుతున్నారు? ఆ మందులు పనిచేస్తున్నాయా లేక వాటిని మార్చాలా? మందులు ఖచ్చితంగా డాక్టర్ సూచించిన సమయానికి వేసుకుంటున్నారా ? లేదా? మీ మందులు, మీ ఆహారం, మీ వ్యాయమం మీ బ్లడ్ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతున్నాయా లేదా అన్నది ఒక్క విజిట్ లో అవగాహన చేసుకునే అవకాశం లేదు.
కనుక పిరియాడికల్ గా డాక్టర్ ను సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకొని, పరీక్షలన్నీ చేయించుకుని, పాత రికార్డులతో పోల్చి చూసి, మరలా మందులు వ్రాయించుకోవాలి. డాక్టర్ ఆ మందులను ఏ డోస్ లో ఎంతకాలం వాడి ఆ తర్వాత రమ్మంటే అన్ని రోజుల తర్వాత మీ పాత ఫైల్ అంతా తీసుకుని వెళ్ళాలి. ఇంత పకడ్బందీగా బ్లడ్ గ్లూకోజ్ ను కంట్రోల్ చేసుకుంటే, షుగర్ అనే వ్యాధి మీకు అణుమాత్రం హాని చేయదు. అంతో ఇంతో మేలు చేసి మీ ఆయుర్దాయం పెంచి తీరుతుంది. టైప్ 2 డయాబెటీస్ లో ముఖ్యంగా గమనించవలసింది అధిక బరువును తగ్గించుకోవటం, తక్కువగా తినటం, ఎక్కువగా శారీరక శ్రమ చేయటం, వీరు విధిగా చేయాలి. అపుడే వీరి బ్లడ్ గ్లూకోజ్ టైట్ కంట్రోల్ లో ఉంటుంది. అటు వ్యాయామం ఇటు ఆహార నియంత్రణ మాత్రమే సరిపోవు, డాక్టర్ సూచించిన మందులు కూడా క్రమం తప్పకుండా ఓ పద్దతి ప్రకారం వాడాలి.
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ను టైట్ కంట్రోల్ లో ఉంచుకోవటం మంచిదే కానీ, చిన్న పిల్లలు, ముసలివారు విషయంలో ఈ విధానం ఆమోదయోగ్యం కాదు. పిల్లలకు 13 సంవత్సరాల వయసు వచ్చేంతవరకూ రక్తంలో గ్లూకోజ్ సరిపడాలేకపోతే బ్రెయిన్ డెవలప్ కాదు. ముసలివయసు వారిలో రెగ్యులర్ గా హైపోగ్లైసీమియాకు వారు గురైతే, పక్షవాతం, గుండెపోటువంటి సమస్యలు వచ్చే అవకాశం వుంది. కనుక పెద్ద వయసు వారిలో బ్లడ్ గ్లూకోజ్ టైట్ కంట్రోల్ పనికి రాదు. షుగర్ ఉన్నా పది పదిహేనేళ్ళు అదనంగా జీవించాలన్న ఆలోచనే ఉన్నవారంతా, మీ బ్లడ్ గ్లూకోజ్ ను ఖచ్చితంగా టైట్ కంట్రోల్ లో ఉంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications