Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
షుగర్ వ్యాధి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?

డయాబెటీస్ లో టైప్ 2 డయాబెటీస్ 90 శాతంగా వుంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తీసుకునే అవసరం వున్నది, లేదా గర్భవతులకు వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ రెండూ చేరి 10 శాతంగా వుంటుంది. టైప్ 2 డయాబెటీస్ ను ప్రధమంలో వ్యాయామం, ఆహార మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ చర్యలవలన బ్లడ్ షుగర్ తగ్గకపోతే మెట్ ఫార్మిన్ లేదా ఇన్సులిన్ అవసరమవుతాయి. ఇన్సులిన్ వారిలో క్రమం తప్పకుండా షుగర్ లెవెల్స్ పరీక్షించాల్సిన అవసరం వుంటుంది.
డయాబెటీస్ రోగుల సంఖ్య గత 50 సంవత్సరాలలో అధిక బరువు సమస్యతో సమానంగా వుంటోంది. 2010 సంవత్సరం నాటికి సుమారుగా 285 మిలియన్ల జనాభా ఈ వ్యాధిన పడ్డారు1985 వరకు 30 మిలియన్లమంది మాత్రమే వుండేవారు. షుగర్ వ్యాధి దీర్ఘ కాలం వుంటే, గుండె పోట్లు, డయాబెటిక్ రెటినోపతితో దృష్టి మందగించటం, కిడ్నీ విఫలమై డయాల్సిస్ చేయాల్సి రావటం, అవయవాలలో రక్త ప్రసరణ సరిగా లేక వాటిని తొలగించే పరిస్ధితి ఏర్పడటం వంటివి వుంటాయి. వీరికి హైపర్ గ్లైసీమియా అంటే లోషగర్ వంటి పరిస్ధితికూడా ఏర్పడుతుంది.
షుగర్ వ్యాధి రావటమనేది శరీరంలోని మెటబాలిక్ డిజార్డర్ కు నిదర్శనంగా చెపుతారు. టైప్ 2 డయాబెటీస్ రావటానికి తాజాగా ఏర్పడుతున్న సమస్యలైన ...అధిక బరువు, శారీరక శ్రమ లేకుండుట, సరైన ఆహారం తినకుండుట, ఒత్తిడి, నగర జీవనం వంటివిగా నిపుణులు చెపుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు కారణంగా పురుషులలో 64 శాతం మహిళలలో 77 శాతం షుగర్ వ్యాధి వస్తోంది. షుగర్ తో తీపి చేసిన కూల్ డ్రింక్ లు, ఇతర తీపి పదార్ధాలు, ఆహారాలలో కొవ్వు ప్రధాన కారణాలుగా చెపుతున్నారు.
టైప్ 2 డయాబెటీస్ లో వంశానుగత మనేది తక్కువగా మాత్రమే ప్రభావం చూపుతోంది. 2011 నాటివరకు సుమారు 36 పైగా జీన్స్ మాత్రమే టైప్ 2 డయాబెటీస్ కు కారణమని పరిశోధకులు చెపుతున్నారు. ఈ జీన్స్ అన్నీ కలిపి 10 శాతం మాత్రమే వంశానుగతంగా డయాబెటీస్ వ్యాధి తెప్పిస్తున్నాయని వెల్లడైంది. , చిన్న వయసు వారిలో జీన్స్ కారణంగా వచ్చే డయాబెటీస్ 1 నుండి 5 శాతం మాత్రమేగా వెల్లడైంది.
డయాబెటీస్ వ్యాధి రావటానికి అనేక మందులు, ఆరోగ్య సమస్యలు కూడా దోహదం చేస్తున్నాయి. గ్లూకోకార్టికాయిడ్స్, ధయాటైడ్స్, బేటా అడ్రెనర్జిక్ ఎగోనిస్ట్, ఆల్ఫా ఇంటర్ ఫెరాన్ వండి మెడిసిన్ లు గతంలో గర్భవతులైనపుడు వుండే డయాబెటీస్ కారణంగా వారి పిల్లలకు తర్వాతి భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతోంది. ఆరోగ్య సమస్యలంటే, క్రషింగ్ సిండ్రోమ్, హైపర్ ధైరాయిడిజం, ఫోక్రోమోసిటోమా, ఇతరంగా కొన్ని కేన్సర్స్ కారణంగాను, టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా వుండటం వలన కూడా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి కలుగుతోందని డయాబెటీస్ నిపుణులు తెలుపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications