Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డిప్రెషన్ కు గురిచేసే వ్యాధి నిర్లక్ష్యం!

డయాబెటీస్ మరియు కోపం
డయాబెటీస్ రోగులకు కోపం సాధారణంగాను సహజంగాను వుంటుంది. డయాబెటీస్ వ్యాధి నిర్ధారణ అయినవారు అది వారికి ఎందుకు వచ్చిందనే అంశంపై తీవ్ర మధన పడుతూంటారు. స్నేహితులలోను, ఇతర బంధువులలోను ఆ పరిస్ధితి వున్నదా? అనేదిపరిశీలిస్తారు. డయాబెటీస్ రోగ నిర్ధారణ సరిగా కాకుంటే అది వారికి కోపం తెప్పిస్తుంది. చివరకు రోగ నివారణ పద్ధతులను ఆచరించటంలో నిర్లక్ష్యం చేస్తారు.
డయాబెటీస్ మరియు తిరస్కారం
కొంతమంది తమకు డయాబెటీస్ అని తెలియగానే అసలు దానిని పట్టించుకోకుండా, ఏ రకమైన జాగ్రత్తలూ తీసుకోకుండా పూర్తిగా తిరస్కరిస్తారు. ఈ రకమైన తిరస్కారం ప్రమాదకరమైంది. తమకు ఏదో జరిగిందనేది వారు ఒప్పుకోరు. వ్యాధి వచ్చినప్పటికి తమకు ఏమీ లేదని చెపుతూ సమయం గడిపేస్తారు.
డయాబెటీస్ మరియు భయం
డయాబెటీస్ నిర్ధారణలో కొంతమందికి భయం కలుగుతుంది. ప్రస్తుతంలోని సమస్య, భవిష్యత్తులో తమ ఆరోగ్యం ఏమైపోతుందోనన్న భయం వీరిలో చోటు చేసుకుంటుంది. డయాబెటీస్ వ్యాధికి నిరంతర రోగ నివారణా విధానం ఆచరించాలి. భయం అనేది సహజమైనప్పటికి అది మీ రోగ నివారణా పద్ధతులు ఆచరించటంలో అడ్డంకి కారాదు. అడ్డంకిగా వుంటే అది మరింత తీవ్ర సమస్యగా మారుతుంది.
డయాబెటీస్ మరియు డిప్రెషన్
డిప్రెషన్ అనేది డయాబెటీస్ రోగ నిర్ధారణ తర్వాత కలిగే తీవ్రమైన సమస్యం. ఈ స్ధితిలో రోగి చాలా విచారంగా వుంటాడు. అతని జీవన విధానం సరిగా ఆచరించబడక, నాణ్యత లోపిస్తుంది. ఒక వారం పైగా ఈ విధంగా ప్రవర్తిస్తే, డిప్రెషన్ వ్యాధికి కూడా వీరు లోనయినట్లే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications