Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
డయాబెటీస్ ను వెనక్కు మళ్ళించడం ఎలా?

ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామాలు చేయడం, మంచి ఆహారాలు తీసుకోవడం, టైప్ 2 డయాబెటీస్ రోగులకు మేలు చేస్తుంది. వారు త్వరగా అలసిపోరు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరిలో ప్రధానంగా శారీరక బరువు తగ్గటం అనేది ఎంతో మేలు చేస్తుంది. అది డయాబెటీస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కొంతమంది తాము డయాబెటీస్ వ్యాధికి మందులు వేయటం లేదని కూడా చెపుతారు. అయినప్పటికి అప్పుడపుడు వీరు తమ బ్లడ్ షుగర్ స్ధాయిలు పరిశీలించుకోవడం చేయాలి. డయాబెటిస్ వెనక్కు మళ్ళినంత మాత్రాన వెంటనే అది నివారించబడిందని భావించరాదు.
మీ ఆరోగ్య నిపుణులు చెపితే తప్ప మందులను వాడటం నిలిపి వేయకండి. టైప్ 2 డయాబెటీస్ వ్యాధికి సాధారణ కారణం అధిక బరువుకు సంబంధించినదిగా ఉంటుంది. బాగా రిఫైన్ చేయబడిన కార్బోహైడ్రేట్ ఆహారాలు, శాట్యురేటెడ్ మరియు ట్రాన్స్ కొవ్వులు, పీచు తక్కువగా ఉండే ఆహారాలు, విటమిన్లు, మినరల్స్ లేని ఆహారాలు ఈ వ్యాధిని మరింత పెంచుతాయి. రక్తంలో ఇన్సులిన్ స్ధాయిలు తిన్న పిండిపదార్ధాలను కరిగించటానికి పెరుగుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని బరువు పెరుగుతారు.
ఇన్సులిన్ స్ధాయి అధికంగా ఉండటం, శరీరం బరువు పెరగటం శరీర కణాలు ఇన్సులిన్ తీసుకోకుండా చేస్తాయి. ఇన్సులిన్ అధికమైతే కూడా బరువు పెరుగుతుంది. కణాలు ఎపుడైతే ఇన్సులిన్ తీసుకోవో, అపుడు శరీరంలో షుగర్ స్ధాయి పెరిగిపోతుంది. ప్రత్యేకించి భోజనం తర్వాత పెరుగుతుంది. పెరుగుతున్న బ్లడ్ షుగర్ స్ధాయి ననుసరించి పాన్ క్రియాస్ గ్రంధి అధిక ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. షుగర్ అధికమైతే, అలసట, మరియు అధిక ఇన్సులిన్ స్ధాయిలు ఆకలి భావన పుట్టిస్తాయి. ఆకలి వేస్తే అధికంగా తినటం చేస్తారు. శ్రమ తగ్గుతుంది.
అధికంగా తినటం, శ్రమించకపోవడం మరియు అధిక ఇన్సులిన్ స్ధాయిలు అన్ని కలసి మరింత బరువు పెరిగేలా చేయటం, ఇన్సులిన్ చాలకపోవటం జరుగుతుంది. అధిక ఇన్సులిన్ ఉత్పత్తి కొరకు పాన్ క్రియాస్ గ్రంధిపై అధిక భారం పడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బేటా సెల్స్ కు నష్టం వాటిల్లుతుంది. ఇక ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గగానే షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. షుగర్ స్ధాయి పెరిగితే, అదే డయాబెటీస్. మీకు దాహం, మూత్రం అధికంగా రావటం, లక్షణాలు ఏర్పడతాయి.
ఈ సైకిల్ ను తప్పించి ఇన్సులిన్ తయారు చేసే బేటా కణాలకు బలం ఇవ్వాలంటే, మీరు డయాబెటిక్ ఆహారం తినాలి. ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేయాలి. ఎపుడైతే, శరీర కణాలకు తగినంత వ్యాయామం, మరియు డయాబెటీస్ కు అనుకూల ఆహారం వంటివి దొరుకుతాయో అపుడు మీ డయాబెటీస్ వ్యాధి కూడా వెనక్కు తగ్గి మెల్లగా మందులు లేకుండా కూడా చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications