For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేప తింటే .....షుగర్ వ్యాధి మాయం!

By B N Sharma
|

స్పెయిన్ దేశస్ధులు డయాబెటీస్ రాకుండా రోజుకో చేపను తింటారట. ఇలా తినే వీరిలో డయాబెటీస్ మచ్చుకైనా కనపడటం లేదంటారు ఈ అంశంపై రీసెర్చి చేసిన వాలెన్షియా మెనర్సిడస్ సోటోస్ ప్రీటో యూనివర్శిటీ పరిశోధకులు. పరిశోధకులు 55 నుండి 80 సంవత్సరాల వయసున్న గుండెజబ్బు రోగులను షుమారు వేయి మంది పురుషులు, మహిళలను పరిశోధించారు. వీరిలో వున్న డయాబెటీస్ సైతం వీరు తినే చేప ఆహారానికి తగ్గుముఖం పట్టిందని తేలినట్లు చెపుతున్నారు.

Sea Foods Cure Diabetes!

రెడ్ మాంసాన్ని అధికంగా తినటం, బ్లడ్ ప్రెజర్ పెంచి గుండె సంబంధిత రిస్కు కలిగిస్తుందని, దానితోపాటే డయాబెటీస్, కేన్సర్ వంటివి కూడా వచ్చి జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించినట్లు న్యూట్రిషియన్ హస్పిటలేరియా అనే జర్నల్ ప్రచురించింది. వీరు గుండె సంబంధంగా చేసిన రోజుకో చేప ఆహారం పరిశోధనలో, దాని అదనపు ప్రయోజనంగా డయాబెటీస్ సైతం తగ్గుముఖం పట్టిందని వెల్లడైంది. చేప ఆహారంలో వుండే ఒమేగా 3 ఇన్సులిన్ సెన్సిటివిటీ ని పెంచుతోందని దీని కారణంగా డయాబెటీస్ కూడా తగ్గుముఖం పడుతోందని తేలింది.

సాధారణంగా డయాబెటీక్ రోగులలో రెండు రకాల గుండెజబ్బులు వస్తాయి. వాటిలో ఒకటి కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే ఈ వ్యాధిలో గుండెకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో రక్తం గట్టిపడిపోతుంది. దీనితో రక్తనాళాలు సన్నపడి గుండెపోటు వస్తుంది. రెండవది, గుండె విఫలత. ఇది మొదటి దానికంటే తీవ్రమైనది. గుండె రక్తాన్ని సరిగా బయటకు పంప్ చేయలేదు. అలాగని గుండె పని చేయటంలేదనరాదు. కాలక్రమేణా లక్షణాలు మరింత ముదిరిపోతాయి. దీని లక్షణాలు ఎలా వుంటాయంటే...ఛాతీలో అసౌకర్యం అనిపించడం, చేతులు, వీపు, నోటి దవడ లేదా పొట్ట భాగాలనుండి నొప్పి రావడం వుంటుంది. శ్వాస సరిగా ఆడదు, చెమట పట్టటం, వికారం అనిపించడం వుంటుంది. మహిళలకు ఈ లక్షణాలు తక్కువగా చూపుతాయి. ఈ రకమైన గుండె జబ్బుకు చేప ఆహారం ఎంతో మంచిది.

డయాబెటిక్ రోగులలో గుండె జబ్బు అరికట్టటానికి సంవత్సరానికి ఒక సారి తప్పక గుండెను పరీక్షింపజేయాలి. కొల్లెస్టరాల్, రక్తపోటు వంటివి చెక్ చేయాలి. అవసరపడితే ఇతర పరీక్షలు కూడా చేయించాలి. డయాబెటీస్, గుండె జబ్బులు రెండూ కూడా షుగర్, రక్తపోటులను అరికడుతూ, రెగ్యులర్ వ్యాయామాలు, ఆహార నియంత్రణల ద్వారా డయాబెటీస్ నియంత్రించవచ్చు.

English summary

Sea Foods Cure Diabetes! | షుగర్ రోగులకు చేప చేసే మేలు?

Eating red meat in excess is tied to higher cardio risk, higher blood pressure, diabetes and a moderate decrease in life expectancy mainly due to cancer or heart disease, the journal Nutricion Hospitalaria reports. The increase of Omega-3 in the cells of the skeletal muscles improves insulin sensitivity, a factor associated with the lowered risk of diabetes.
Story first published: Monday, July 23, 2012, 12:55 [IST]
Desktop Bottom Promotion