Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అధిక సమయం కూర్చునే మహిళలకు డయాబెటీస్!

నిరంతరం కూర్చుని పనులు చేసుకునే మహిళల రక్త నమూనాలు పరిశోధకులు పరీక్షించారని, ఇటువంటివారికి డయాబెటీస్ త్వరగా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయని పరిశోధకులు వెల్లడించినట్లు డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది. అయితే, తాము చేసిన ఈ పరిశోధన లోని అంశాలను పురుషులకు వర్తించి పరీక్షలు చేసినేప్పటికి వారిలో ఏ రకమైన షుగర్ వ్యాధి జాడ కనపడలేదట.
దీనికి కారణం నిశ్చలంగా వున్నపుడు జరిగే శరీర మార్పులు మహిళలలో అధికంగా వుండి కణాలపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు. లీసెస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు తమ పరిశోధనలో షుమారు 505 మంది పురుషులను, స్త్రీలను 59 సంవత్సరాల పై బడిన వారిని పరిశోధించారు. వారంలో ఎన్ని గంటలు వారు కూర్చున్నారన్నది లెక్కించారు.
అధికంగా కూర్చుని వుండే మహిళలు ఏదో ఒకటి స్నాక్స్ లేదా చిరుతిండి వంటివి కూడా తింటున్నారని, అయితే పురుషులు ఒక సారి కదలటం మొదలుపెడితే ఎంతో ఎనర్జీని ఖర్చు చేసేలా శారీరక శ్రమ చేస్తారని కనుక ఈ పరిస్ధితి పురుషులలో లేదని పరిశోధకులు తెలిపారు. షుగర్ వంటి మొండి వ్యాధిని అరికట్టాలంటే, మహిళలు తక్కువ సమయం కూర్చోవాలని ఎపుడూ ఏదో ఒక పని చేసుకుంటూ శరీరాన్ని కదిలించాలని వీరు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications