Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మవ్యాధులతో బయటపడే డయాబెటీస్!

డయాబెటీస్ కారణంగా ఏర్పడే ఏ చర్మ సమస్య అయినా ముందు దశ లోనే గుర్తిస్తే, త్వరితంగా దానికి చికిత్స చేసి ఆ సమస్య నుండి రోగిని బయటపడవేసే అవకాశం ఉంది. కనుక షుగర్ బాధితులు, స్కిన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న వివరాలు మీకు తెలియజేస్తున్నాం.
- బ్లడ్ గ్లూకోజ్ అంటే రక్తంలో షుగర్ అధికంగా వున్న వారిలో స్కిన్ ఇన్ ఫెక్షన్స్ రావటానికి అవకాశాలు ఎక్కువ.
- మీ చర్మం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చర్మానికి చర్మం కలుసుకుని ఉండే చోట్ల, రాసుకుంటూ ఉండే ప్రదేశాలలో, ఎక్కువ పరిశుభ్రతను పాటించాలి. చంకలు, గజ్జలు, కాలి వేళ్ళ నడుమ, ఇలాంటి ప్రదేశాలలో పరిశుభ్రత ఎంతయినా అవసరం.
- ఎపుడూ బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేయకండి. గోరువచ్చని నీరు, లేదా చన్నీళ్ళు అత్యంత శ్రేయస్కరం గా తెలుసుకోండి.
- మీది పొడి చర్మం అయితే, మాయిశ్చరైజర్స్ వాడండి. అలాగే, డోవ్ వంటి మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడవచ్చు. షుగర్ బాధితులు బేబీ సోప్స్ వాడటం వారి చర్మానికి ఎంతో మంచిదిగా చెప్పవచ్చు.
- చర్మం పైన ఏ గాయమైనా, అశ్రద్ధ చేయకుండా వెంటనే దానికి అవసరం అయిన చికత్స చేయండి.
-పలురకాల బాక్టీరియల్, ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ షుగర్ రోగులను వేధించే అవకాశాలున్నాయి.
- కళ్ళపై కురుపులు రావటం, వంటిపై గడ్డలు లేవటం, చర్మంపై వెంట్రుకల మొదళ్ళలో ఇన్ ఫెక్షన్ చేరటం జరుగుతుంది.
- గోళ్ళు చుట్టూ చర్మంపై ఇన్ ఫెక్షన్ చేరే అవకాశాలు ఎక్కువ.
- చేతి వేళ్ళ మధ్య, కాలివేళ్ళ మధ్య, పెదవుల చివరలలో, గజ్జల్లో, చంకల్లో, జననాంగాల దగ్గర, మహిళలలో స్తనాల క్రింద భాగంలో, ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. అశ్రద్ధ చేయకుండా వీటికి వెను వెంటనే తగు చికిత్స తీసుకోవాలి.
- చర్మం మీద బ్రౌన్ కలర్ మచ్చలు వస్తాయి. ముఖ్యంగా కాళ్ళ మీద వస్తూంటాయి. ఈ మచ్చలు దురద పెట్టవు. పుండ్లుగా మారవు. బాధించవు. దీనినే డయాబెటిక్ డెర్మోపతి అని వైద్య పరిభాషలో అంటారు. దీనికి చికిత్స అవసరం లేదు. ఇది భయపడాల్సిన సమస్య అంతకన్నా కాదు.
ఇవే కాక మరెన్నో చర్మ సంబంధిత సమస్యలు కూడా డయాబెటీస్ రోగులు పొందే అవకాశాలున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications