For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సులిన్ అధికం అయితే హాని కలుగుతుందా?

By B N Sharma
|

Insulin
ఇన్సులిన్ అధికం అయితే అది మీలో కొవ్వు ఏర్పరుస్తుంది. గుండె జబ్బులు కలిగిస్తుంది. రక్తపోటు పెంచుతుంది, మంచి కొవ్వులను చెడు కొవ్వులుగా మారుస్తుంది. మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. ఇంత హాని కలిగించే కారణం ఏమిటనేది పరిశీలిస్తే, ఇన్సులిన్ షుగర్ ను ఎనర్జీగా మారుస్తుంది.
కొవ్వును పక్కన పెట్టేసి అది కరగకుండా షుగర్ ని వినియోగించి శక్తినందించటంతో కొవ్వు పేరుకుపోతుంది.

ఇన్సులిన్ వేరే హార్మోన్ తో కలిసి కిడ్నీలు సోడియంను తిరిగి పీల్చేలా చేస్తుంది. సోడియం నీరు నిలుపుతుంది. దీనితో రక్తం ప్రసరణ అధికమవుతుంది. ఫలితంగా రక్తపోటు వస్తుంది. ఇన్సులిన్ లివర్ కణాలను దెబ్బతీస్తుంది. చెడు కొలెస్టరాల్ ఎల్ డిఎల్ స్ధాయి పెంచుతుంది. ట్రిగ్లీసెరైడ్స్ సంఖ్య పెంచుతుంది. రక్తనాళాలపై ఇన్సులిన్ ప్రభావం ఎలా వుంటుందంటే, ఇన్సులిన్ కొవ్వులను, రక్తపోటును పెంచడంతో ఇది రక్తనాళాల గోడల లోపలి వైపు కొవ్వు డిపాజిట్లను పెంచుతుంది. క్రమేణా అడ్డంకులుగా మారి రక్తనాళాలలో రక్తప్రవాహాన్ని ఈ అడ్డంకులు అడ్డగిస్తాయి. ఫలితంగా గుండె పోట్లు వస్తాయి.

కేలరీలు అధికంగా వుండే ఫాస్ట్ ఫుడ్స్ తింటే, ఇన్సులిన్ అధికంగా వుండే ఆహారాలు తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ అధికంగా వుండి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకుగాను చాలామంది ఆహారం తీసుకోవటం తగ్గిస్తారు. వ్యాయామాలు చేస్తారు. ఒకప్పుడు వ్యక్తులు పేదవారుగా వుండి ఆకలితో అలమటించేవారు సంపాదన కొరకు కష్టపడి పనిచేసేవారు. డయాబెటీస్ వుండేది కాదు. అయితే, నేటి శారీరక కష్టం లేని జీవితాలలో డయాబెటీస్ అధికమై అనేక దుష్ప్రభావాలు ఆరోగ్యంపై చూపుతోంది.

English summary

What Happens With Too Much Insulin? | ఇన్సులిన్ అధికం అయితే హాని కలుగుతుందా?

This is very hard for most people: reduction of food intake and exercise.At one time, people were poor and hungry and had to work hard. Diabetes was extremely rare. Society is moving in that direction. Perhaps, you should just wait?
Story first published:Thursday, March 29, 2012, 14:14 [IST]
Desktop Bottom Promotion