Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
టైప్ 1 డయాబెటీస్ గురించి మీకేం తెలుసు?

టైప్ - 1 డయాబెటీస్ లో ఎదురయ్యే కాంప్లికేషన్స్ గురించి కూడా వివరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ముందుగా చెప్పుకోవలసిన కాంప్లికేషన్ హైపో గ్లైసీమియా. అంటే లో బ్లడ్ షుగర్ అన్న మాట. అంటే రక్తంలో ఉండవలసిన దానికన్నా తక్కువ గ్లూకోజ్ ఉండటం అన్నమాట. టైప్ -1 డయాబెటీస్ తో బాధపడేవారు పలు సందర్భాలలో ఈ పరిస్ధితిని ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది అశ్రద్ధ చేయదగిన కాంప్లికేషన్ కాదు.
హైపోగ్లైసీమియా యొక్క ప్రధాన లక్షణాలేమిటో స్పష్టంగా పరిశీలించండి.
హైపోగ్లైసీమియా వచ్చిన రోగి షేకీగా వణుకుతూ ఉంటారు. కళ్ళు తిరగటం వుంటుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఆకలి అనిపిస్తుంది. తలనొప్పిగా ఉంటుంది. చర్మం పాలిపోయినట్లవుతుంది. సడన్ గా మూడీగా తయారవుతారు. సడన్ గా ప్రవర్తనలో తేడా వస్తుంది. ఫిట్స్ కూడా రావచ్చు. కదలిక, నడక సాఫీగా ఉండకుండా జర్క్ ఇస్తున్నట్లు ఉంటాయి. మనసంతా ఆందోళన గా ఉంటుంది. ఏకాగ్రత ఉండదు. నోటి చుట్టూ ఏదో చురుక్కు మంటూ వుంటుంది. ఈ లక్షణాలన్నీ బ్లడ్ లో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండి ఒక వ్యక్తి హైపోగ్లైసీమిక్ స్టేజ్ లో ఉన్నపుడు కన్పించే లక్షణాలు.
మీరు చికిత్స ప్రారంభించినపుడే నేను ఎన్ని రోజులకొకసారి బ్లడ్ గ్లూకోజ్ పరీక్షించుకోవాలి అన్నది మీ డాక్టర్ ను స్పష్టంగా అడగండి మీరు బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకున్నపుడు, మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బాగా తక్కువగా ఉందని గ్రహిస్తే ఈ పరిస్ధితిని తక్షణం చక్కదిదిద్దుకునే ప్రయత్నం వెంటనే చేయాలి. సహజంగా పేషెంట్ కు అలవాటయ్యాక బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోకుండానే పై లక్షణాలను బట్టి, నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బాగా పడిపోయిందన్న విషయాలన్ని గుర్తించగలుగుతాడు. ఈ విషయంలో మీకు ఏ మాత్రం సందేహం వచ్చినా, బ్లడ్ గ్లూకోజ్ పరిస్ధితి పరీక్షించుకునేందుకు ప్రయత్నించకుండా, మీరు హైపోగ్లైసీమిక్ స్టేజ్ నుంచి బయటపడే ప్రయత్నం వెంటనే చేయడం ప్రధానం.
టైప్ 1 డయాబెటీస్ తో బాధపడేవారి శరీరంలోని పాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. కనుక వీరికి బయటనుంచి ఇన్స్ లిన్ ను ఇంజక్షన్ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. సాధారణ ఇంజక్షన్స్ మాదిరి కాకుండా ఈ ఇన్సులిన్ ఇంజక్షన్ ను చర్మం క్రింద భాగానికి ఇంజక్ట్ చేస్తే చాలు. ఇన్స్ లిన్ అంటే ఒక రకం కాదు. ఇన్స్లిన్ లో పలురకాలు ఉన్నాయి. అవి రాపిడ్ యాక్షన్ ఇన్సులిన్, షార్టు యాక్టింగ్ ఇన్సులిన్, ఇంటర్ మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అని వుంటాయి. అవసరం మేరకు వైద్యులు వీటిని వాడుతూంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications