Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రక్తంలో షుగర్ స్ధాయి తగ్గినపుడు ఏం చేయాలి?

లో బ్లడ్ షుగర్ కు ట్రీట్ మెంట్ చాలా సులభం. పంచదారతో కూడిన ఏదో తీయని పదార్ధాన్ని కొంచెం తినేయటమో లేదా ఓ అరకప్పు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవటమో, అవి దొరకకపోతే రెండు లేదా మూడు చాక్లెట్లు తినటమో చేయాలి. టైప్ 1 డయాబెటీస్ తో బాధ పడేవారు, లో బ్లడ్ షుగర్ పరిస్ధితిని తక్షణం ఎదుర్కునేటందుకు ఎప్పుడూ జేబులో రెండు చాక్లెట్స్ కానీ రెండు చెంచాల పంచదార ఉన్న పొట్లం కానీ ఉంచుకోవటం ఉత్తమం. తీపి పదార్ధం తిన్నాక పావుగంట ఆగి మీ బ్లడ్ గ్లూకోజ్ ను చెక్ చేసుకోండి. అప్పటికీ మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగకపోతే మరలా కొంచెం స్వీట్ తీసుకోండి.
ఈ రకంగా రక్తంలో షుగర్ స్ధాయి పెరిగేవరకు తీపి తినవచ్చు. నీరసం, వణుకు, చెమటలుపట్టటం, కళ్ళు తిరగడం, తలనొప్పి ఈ లక్షణాలన్నీ తొలగిపోతే, మీ బ్లడ్ గ్లూకోజ్ స్ధాయి కావలసిన స్ధాయికి పెరిగిందని ఇక మీకు లో బ్లడ్ షుగర్ పరిస్ధితి లేదని భావించండి. కొన్ని సందర్భాలలో తక్షణం చికిత్స చేయకపోతే, హైపో గ్లైసీమియా ప్రమాదాలు తెచ్చి పెడుతుంది. పేషెంట్ స్ప హ కోల్పోయే ప్రమాదం ఉంది. తర్వాతి దశగా రోగి డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇలాంటపుడు అరనిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీకు సమీపంలో వున్న హాస్పిటల్ కు లేదా వైద్యుల వద్దకు అర్జంటుగా రోగిని తరలించాలి.
షుగర్ పేషెంట్ ఉన్న కుటుంబంలోని కుటుంబ సభ్యులు ఇలాంటి పరిస్ధితిలో ప్రాధమిక చికిత్సగా ఏం చేయాలి అనే విషయాలు తెల్సుకుని ఉండటం మంచిది. షుగర్ పేషెంట్ నీరసించి, లోబ్లడ్ షుగర్ కారణంగా కుప్పకూలిపోతే, ఈ సమయంలో రోగికి ఇన్సులిన్ ఇంజక్షన్ చేయకూడదు. స్పహలోలేని అతనికి ఆహారం పెట్టడం లేదా ద్రవాలు నోటి ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయటం, చేయనే చేయకూడదు. గ్లూకాగాన్ ఇంజక్షన్ చేయవచ్చు. ఇది ఎలా చేయాలన్నది వైద్యుని సంప్రదించి తెల్సుకుని ఎప్పుడూ ఈ ఇంజక్షన్ బాటిల్, సిరంజ్ మీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో వుంచుకోవాలి. ఇన్సలిన్ ను ఎలా అయితే ఇంజెక్టు చేస్తామో, గ్లూకాగాన్ ఇంజక్షన్ కూడా అలానే చేయాలి
హైపో గ్లైసీమియాలో ప్రాణాపాయ స్ధితిని కలిగించే దశకు వెళ్ళకుండా ఉండాలంటే ప్రతి షుగర్ వ్యాధి కల రోగి హైపోగ్లైసీమియా లక్షణాలేమిటన్నది బాగా తెల్సుకుని దానికి తగిన చికిత్సా విధానాన్ని కూడా తెలుసుకుని ఉండాలి. ఈ లక్షణాలు గురించి తెల్సినవారు, ఈ స్టేజ్ లో స్పహ తప్పే పరిస్ధి తి రాకముందే తగు జాగ్రత్త తీసుకోగల్గుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications