డయాబెటిస్ తో పాటు హార్ట్ సమస్యలున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..

డయాబెటిస్ .....ఇప్పుడు చాలా కామనైంది. ప్రతి ఇంట్లోనూ ఒకళ్లిద్దరు షుగర్ పేషంట్స్ ఉంటున్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ పేషంట్ల సంఖ్య 50కోట్లకు పైగా చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాడీలోని గ్లూకోజ్ లేదా షుగర్ లెవెల్స్ లో తేడా వస్తే హెల్త్ లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సి రావడం డయాబెటిస్ ముఖ్య లక్షణం. అలాగే, కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం, కళ్లు తిరగడం, మైకం కమ్మడం ఇవన్నీ షుగర్ లక్షణాలే. డయాబెటిస్ కు మరియు హార్ట్ కు సన్నిహితమైన సంబంధం ఉంది. డయాబెటిస్ తో పాటు హార్ట్ సమస్యలున్న వారు హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వంటి సమస్యను ఎదుర్కొంటారు.

ముఖ్యంగా శరీరంలో డయాబెటిస్ ఎక్కువగా ఉండడంవల్ల వచ్చే గుండెజబ్బుల్ని ‘డయాబెటిక్ హార్ట్ డిసీజెస్'అంటారు. వీనిలో కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిక్ కార్డియోమయోపతి ముఖ్యమైనవి. డయాబెటిస్ టైప్ 1, టైప్ 2 రెండు విధాలుగానూ బాధపడుతున్నవారికి డయాబెటిక్ హార్ట్ డిసీజెస్ రావచ్చు. బ్లడ్‌షుగర్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి ఈ పరిస్థితిని ABCs డయాబెటిస్ -A1C(బ్లడ్ గ్లూకోజ్), బ్లడ్ ప్రెజర్, మరియు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఇవి కంట్రోల్ ఉంటే హార్ట్ డిసీజ్ మరియు స్ట్రోక్ లను నివారించుకోవచ్చు.

ముఖ్యంగా డయాబెటిస్ తో పాటు హార్ట్ సమస్యలున్నప్పుడు, రెండింటికి చికిత్స తీసుకొనే వారు, వారు తీసుకొనే డైట్ మీద ప్రత్యేక శ్రద్ద కలిగి ఉండాలి . బ్లడ్ లో షుగర్ అధికమైతే శరీరంలో రక్తనాళాలతో సహా అనేక అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అందువల్ల డయాబెటిక్ పేషంట్స్ తీసుకొనే ఆహారాలు షుగర్ తక్కవుగా, కొలెస్ట్రాల్ లేని ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

read more : రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నిర్వహించటానికి తీసుకోవలసిన ఉత్తమ ఆహారాలు

డైట్ లో మార్పులు చేసుకోవడంతో పాటు, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల వచ్చే హార్ట్ డిసీజ్ లను నివారించుకోవచ్చు. కాబట్టి, డయాబెటిక్ విత్ హార్ట్ పేషంట్స్ కోసం ఈ క్రింది లిస్ట్ లో కొన్ని ఆహారాలను తెలపడం జరిగింది...ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ చేసి, హార్ట్ డిసీజ్ రాకుండా రక్షిస్తాయి. మరి ఆహారాలేంటో చూద్దాం....

తీసుకొనే ఫ్యాట్స్ మంచివై ఉండాలి:

తీసుకొనే ఫ్యాట్స్ మంచివై ఉండాలి:

డయాబెటిస్ మిరయు హార్ట్ డిసీజ్ తో బాధపడే వారు, శరీరంకు అవసరం అయ్యే మంచి కొవ్వు ఉన్న ఆహారాలు మాత్రమే తీసుకోవాలి . అధికంగా ప్రొసెస్ చేసిన ఆహారాల జోలికి అస్సలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మటన్ కు దూరంగా ఉండాలి. లీన్ మీట్, చికెన్ కు తీసుకోవచ్చు.

ఓమేగా 3ఎస్ ఉన్న ఆహారాలకు ప్రత్యేకత:

ఓమేగా 3ఎస్ ఉన్న ఆహారాలకు ప్రత్యేకత:

ఓమేగా 3 ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలోని ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మరియు హార్ట్ హెల్తీగా ఉంటుంది. అందుకోసం సోయా బీన్, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ మరియు కానోలా ఆయిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

హెర్బ్స్:

హెర్బ్స్:

సాల్ట్ ఫ్రీ హెర్బ్స్ మరియు స్పైసీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హార్ట్ సమస్యలు మరియు డయాబెటిస్ సమస్యలను నివారించుకోవచ్చు . ఫ్రెష్ గా ఉండే హెర్బ్స్ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు మరియు శరీరంలో మంచి రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు.

సూప్స్ కూడా ఆరోగ్యకరమైనవి:

సూప్స్ కూడా ఆరోగ్యకరమైనవి:

డయాబెటిక్ విత్ హార్ట్ డిసీజ్ తో బాధపడే వారు, నాన్ వెజ్ సూప్స్ నచ్చినట్లైతే, ఆకలిగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం చాలా మంచిది . ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ సూప్స్ లో ఉండే ఫ్యాట్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి, లీన్ మీట్ తో తయారుచేసిన సూప్స్ ను తీసుకోవచ్చు. ముఖ్యంగా మాంసాహారన్ని, భోజనంతో తీసుకోండి, సూపుల రూపంలో తీసుకోవడం మంచిది.

యోగ్రట్ డిప్స్:

యోగ్రట్ డిప్స్:

హై క్యాలరీ మోయో మిస్సు అవుతున్నట్లైతే , బాధపడాల్సిన అవసరం లేదు . మయోనైజ్ కు ప్రత్యామ్నాయంగా యోగ్రట్ ఫ్లేవర్ డిప్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు గుండెకు కూడా మంచిది.

కొలెస్ట్రాల్ ఫుడ్స్:

కొలెస్ట్రాల్ ఫుడ్స్:

కొలెస్ట్రాల్ ఫుడ్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. డయాబెటిస్ విత్ హార్ట్ సమస్యలతో బాధపడే వారు కొలెస్ట్రాల్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి .

రెస్టారెంట్ ఫుడ్స్:

రెస్టారెంట్ ఫుడ్స్:

డయాబెటిక్ మరియు హార్ట్ పేషంట్స్ కు రెస్టారెంట్లలో అంత మంచి ఫుడ్స్ ను అందివ్వలేకపోవచ్చు. ఫాస్ట్ ఫుడ్స్ మరియు రెస్టారెంట్ మెను కోసం రెస్టారెంట్లకు వెళ్లడానికి బదులుగా ఇంట్లోనే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకోవాలి.

 హెల్తీ కుక్కింగ్ పద్దతి:

హెల్తీ కుక్కింగ్ పద్దతి:

డయాబెటిస్ విత్ హార్ట్ సమస్యలతో బాధపడే వారు క్యాలరీ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది . గ్రిల్లింగ్, బేకింగ్, స్టీమ్ చేసిన ఆహారాలు మరియు రోస్ట్ చేసిన ఆహారాలు తీసుకోవడం ఉత్తమం...

Desktop Bottom Promotion