For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ వారికి సురక్షితమైన వాటర్ ఫ్రూట్స్ ...

|

శరీరంలో ఇన్సులిన్ లోపం వల్లే డయాబెటిస్ కు కారణం అవుతుంది. ఇదివరికే డయాబెటిస్ తో బాధపడుతంటే, బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా పెరుగుతుంది. డయాబెటిస్ వల్ల నాడీవ్యవస్థ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ , స్ట్రోక్, ద్రుష్టిలోపం, చెవుడు, హార్ట్ అటాక్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల డయాబెటిస్ ను రెగ్యులర్ గా పరీక్షించుకోవడం చాలా అవసరం. డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడం కోసం రెగ్యులర్ గా తీసుకొనే హెల్తీ డైట్ మీద ఓ కన్నేసుండాలి. తగిన విశ్రాంతి, మంచి నిద్ర, వ్యాయామం, ఒత్తిడి లేకుండా జీవించాలి.

READ MORE:డయాబెటిస్ తో పాటు హార్ట్ సమస్యలున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..

డయాబెటిస్ ఉన్న వారు తీసుకొనే ఆహారం క్యాలరీలు, న్యూట్రీషియన్స్, షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్న , లోఫ్యాట్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. డయాబెటిక్ పేషంట్స్ చాలా మంది స్వీట్ గా ఉండే పండ్లను తినకూడదని భావిస్తుంటారు. అయితే పండ్లలో కూడా కొన్ని ప్రత్యేకమైనవి బ్లడ్ షుగర్స్ ను కంట్రోల్ చేస్తాయి. పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్, విటమిన్స్, మరియు ఫైటోన్యూట్రీషియన్స్ డయాబెటిక్ పేషంట్స్ కు కూడా చాలా మంచిది . లో గ్లిజిమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లు డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు డయాబెటిస్ వారికి అత్యంత ఉపయోగకరం అని పోషకాహార నిపుణుల సలహా. కాబట్టి, డయాబెటిస్ వారికి ఆరోగ్యకరమైన వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ ఈ క్రింది లిస్ట్ లో ...

 గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్:

డయాబెటిస్ వారు తినగలిగిన పండ్లలో గ్రేప్ ఫ్రూట్ ఒకటి. ఈ పండులో 91శాతం నీరు ఉంటుంది. గ్రేప్ ఫ్రూట్ లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. దీంతో పాటు గ్లిజిమిక్ ఇండెక్స్ 25శాతం మరియు సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బాడీలోని ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేసి సెన్షిబుల్ నారింజెనిన్ అనే ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. అందువల్ల ప్రతి రోజూ గ్రేప్ ఫ్రూట్ లో సగం భాగం తినడానికి అలవాటు చేసుకోవాలి. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ లో 92శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్స్, మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు వీటిలో 40 గ్లిజిమిక్ ఇండెక్స్ మరియు లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి . స్ట్రాబెర్రీస్ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది . ఇవి శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచి బ్లడ్ గర్ లెవల్స్ ను బాలెన్స్ చేస్తాయి. 3 /4కప్పు స్ట్రాబెర్రీస్ రెగ్యులర్ గా తినడం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు ఉపయోగకరం.

ఆరెంజెస్:

ఆరెంజెస్:

8 రకాల వాటర్ బేస్డ్ పండ్లలో ఆరెంజ్ కూడా ఒకటి. డయాబెటిక్ వారికి ఇది సురక్షితమైనది. ఆరెంజ్ లోవిటమిన్ సి, థైయమిన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ షుగర్ ఉండటం వల్ల షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది . ముఖ్యంగా ఆరెంజ్ లో 87శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది మరియు చాలా తక్కువ గ్లిజిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది . ఆరెంజ్ బరువును కంట్రోల్ చేస్తాయి .

చెర్రీస్ :

చెర్రీస్ :

చెర్రీస్ లో 22 లో గ్లిసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, ఐరన్, బీటాకెరోటిన్, పొటాషియం, ఫొల్లెట్, మెగ్నీషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ వారికి చెర్రీస్ వాటర్ బేస్డ్ ఫ్రూట్ . ముఖ్యంగా ఇందులో యాంథో సైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్స్ ను కంట్రోల్లోకి తీసుకొస్తుంది . 50శాతం ఇన్సులిన్ లెవల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. చెర్రీస్ ను ఎండిన లేదా ఫ్రెష్ గా, ప్రోజోన్ వంటివి తీసుకోవాలి . ఒకరోజుకు 1నుండి 2కప్పులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి.

 వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో బీటాకెరోటిన్ , విటమిన్ బి మరియు సి, లైకోపిన్ మరియు పొటాషియం అధికంగా ఉంటాయి . అలాగే వాటర్ మెలోన్ లో 92శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి, ఇది డయాబెటిక్ వారికి సురక్షితమైన ఆహారంగా తీసుకోవచ్చు . కాబట్టి, రెగ్యులర్ డైట్ లో వాటర్ మెలోన్ కూడా తీసుకోవచ్చు.

ఆపిల్స్:

ఆపిల్స్:

యాపిల్స్ జ్యూసీగా మరియు విటమిన్ సి, సోలబుల్ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఆపిల్స్ లో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్, మన శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇన్సులిన్ ను పరిమితికి మించి తగ్గిస్తుంది.

బేరిపండ్లు:

బేరిపండ్లు:

84శాతం వాటర్ కంటెంట్ఉంటుంది. బేరిపండ్లలో ఉండే ఫైబర్ మరియు విటమిన్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది . బేరిపండ్లను కూడా వాటర్ బేస్డ్ ఫ్రూట్ గా భావిస్తారు . ఇన్సులిన్ సెన్షివిటిని పెంచుతుంది . కాబట్టి, ఒక చిన్న బేరిపండును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా స్వీట్స్ తినాలనే కోరికను తగ్గించుకోవచ్చు.

కివి:

కివి:

కివీ ఫ్రూట్ డయాబెటిస్ వారికి చాలా మంచిది. ఈ అమేజింగ్ ఫ్రూట్ డయాబెటిస్ వారికి అద్భుతాలనే చేస్తుంది. కివీ ఫ్రూట్ లో బీటాకెరోటిన్, ఫ్లెవనాయిడ్, విటమిన్ ఎ, సి, మరియు ఇ లు మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి . ముఖ్యంగా కివి ఫ్రూట్ లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

English summary

Water Based Fruits That Are Safe For Diabetes: Health Tips in Telugu

Diabetes is caused due to the lack of insulin in the body. If you have diabetes, your blood sugar levels also increase. Diabetes can cause numerous health hazards such as nerve damage, poor blood circulation, kidney failure, strokes, blindness, hearing loss, heart attacks etc. Hence, it is quite necessary to keep diabetes in check.
Story first published: Tuesday, November 10, 2015, 13:58 [IST]
Desktop Bottom Promotion