For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ పేషంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన బ్రేక్ ఫాస్ట్ టిప్స్..!

డయాబెటిక్స్ ఫాలో అవ్వాల్సిన బ్రేక్ ఫాస్ట్ టిప్స్..!

By Swathi
|

మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారా ? లేదా మీ ఇంట్లో, ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటిస్ పేషంట్స్ ఉన్నారా ? ఒకవేళ ఉంటే.. కొన్ని బ్రేక్ ఫాస్ట్ టిప్స్ మీరు ఖచ్చితంగా పాలో అవ్వాలి. అప్పుడే.. డయాబెటిస్ లక్షణాలను కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుంది.

breakfast rules for diabetes

బ్రేక్ ఫాస్ట్ రోజులో చాలా ముఖ్యమైన ఆహారం అని మనలో చాలా మందికి తెలుసు. ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల.. రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాం. చాలామంది న్యూట్రిషనిస్ట్స్.. బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు, అన్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు.

కాబట్టి.. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే.. కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు.. బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ తో బాధపడుతుంటే.. కొన్ని బ్రేక్ ఫాస్ట్ రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే.. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

మానేయకూడదు

మానేయకూడదు

ఎప్పటికీ బ్రేక్ ఫాస్ట్ తినకుండా మానేయకూడదు. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే.. తర్వాత.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిక్ లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్

హెల్తీ బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తినడం ఎంత అవసరమో.. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం కూడా.. అంతే ముఖ్యం. దీనివల్ల రోజంతా రకరకాల పదార్థాలు తినకుండా అడ్డుకోవచ్చు.

ఇంట్లో చేసినది

ఇంట్లో చేసినది

బ్రేక్ ఫాస్ట్ ని బయట ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. ఫ్యాట్, షుగర్ లేని పదార్థాలతో ఇంట్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి.

బ్రెడ్, ధాన్యాలు

బ్రెడ్, ధాన్యాలు

డయాబెటిక్ పేషంట్స్ బ్రేక్ ఫాస్ట్ లో వోల్ గ్రెయిన్ బ్రెడ్, ధాన్యాలు, ఫ్రూట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి.

వెజిటబుల్స్

వెజిటబుల్స్

డయాబెటిస్ పేషంట్స్ డైట్ లో ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. లక్షణాలను తగ్గిస్తాయి.

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్

ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. డయాబెటిస్ పేషంట్స్ కి మంచిది.

ఓట్ మీల్

ఓట్ మీల్

డయాబెటిక్ పేషంట్స్ ప్రతిరోజూ డైట్ లో మిస్ అవకుండా.. ఓట్ మీల్ చేర్చుకోవాలి. ఇవి డయాబెటిక్ లక్షణాలు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

పాలు

పాలు

షుగర్ వ్యాధితో బాధపడేవాళ్లు.. బ్రేక్ ఫాస్ట్ లో ఫ్యాట్ లేని పాలను చేర్చుకోవాలి. ఇందులో ఉండే క్యాల్షియం.. డయాబెటిక్ లక్షణాలను కంట్రోల్ చేస్తుంది.

పెరుగు

పెరుగు

బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చుకోవడం చాలా మంచిది. అయితే.. ఎలాంటి ఫ్లేవర్స్ లేని, ఫ్యాట్ లేని, షుగర్, ఫ్యాట్స్ లేని పెరుగు మాత్రమే డైట్ లో చేర్చుకోవాలి.

ఆరంజ్

ఆరంజ్

డయాబెటిక్ పేషంట్స్ ఆరంజ్ జ్యూస్ కి బదులు.. ఆరంజ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. జ్యూస్ లో పంచదార ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి.. ఫైబర్ ఎక్కువగా ఉండే.. ఫ్రూట్ తీసుకోవాలి.

దాల్చిన చెక్క పొడి

దాల్చిన చెక్క పొడి

దాల్చిన చెక్క పొడిని.. టీ లేదా కాఫీలో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ని న్యాచురల్ గా ట్రీట్ చేస్తుంది.

యాపిల్స్ లేదా అవకాడో

యాపిల్స్ లేదా అవకాడో

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఓట్ మీల్ తీసుకోవాలి అనుకుంటే.. అందులో యాపిల్స్ లేదా అవకాడోలు చేర్చుకోవడం వల్ల.. చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. ఇది.. ఖచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

English summary

12 Breakfast Tips People With Diabetes Need To Follow

12 Breakfast Tips People With Diabetes Need To Follow. Few breakfast tips that need to be followed to control the symptoms of diabetes.
Desktop Bottom Promotion