Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డయాబెటిక్ పేషంట్స్ కి తీపి వార్త... మీరు తీసుకోగలిగే లో షుగర్ ఫుడ్స్..
డయాబెటిక్ పేషంట్స్ కి తీపి రుచి లేకపోవడం ఒకరకంగా నిరాశ కలిగిస్తూ ఉంటుంది. ఆహారం విషయంలో షుగర్ పేషంట్స్ ఎప్పుడూ చాలా జాగ్రత్త వహించాల్సిందే. అయితే చక్కెర ఆహారాలకు దూరంగా ఉంటూనే.. మీ రుచులను అమోఘం చేసుకోవాలి. అదెలా అనుకుంటున్నారా ?
మధుమేహులకు తీపి రుచులకు దూరంగా ఉన్నా.. .హెల్తీగా, యమ్మీగా ఉండే పుడ్స్ తీసుకునే అద్భుతమైన ఫుడ్స్ లిస్ట్ ఉంది. తక్కువ చక్కెర ఉండే ఆహారాలను ఎంచుకుంటే.. మీరు ఆహారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇలాంటి ఆహారాల వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి లో షుగర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


నట్స్
ప్రొటీన్స్ పుష్కలంగా ఉండే నట్స్, ఆరోగ్యానికే కాదు.. హార్ట్ కి కూడా ఆరోగ్యకరమైన ఫ్యాట్ అందిస్తాయి. వీటిలో చక్కెర తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవాళ్లక ఇవి చక్కటి ఆప్షన్.

పిస్తా
పిస్తాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీకు ఎనర్జీని అందిస్తాయి. అలాగే వీటిల్లో చక్కెర కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.

జెలటిన్
తీపి పదార్థాల కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటే.. జెలటిన్ సురక్షితమైన ఎంపిక. డిజర్ట్ రూపంలో వీటిని కలుపుకుంటే రుచికరమైన ఫుడ్ తీసుకోవచ్చు.

ఆరెంజ్
మధుమేహంతో బాధపడేవాళ్లకు ముఖ్యమైన విటమిన్ సి పుష్కలంగా లభించే ఆరంజ్ లను తీసుకోవచ్చు. వీటిల్లో కూడా చక్కెర తక్కువ ఉంటుంది.

ఆల్మండ్స్
డయాబెటిక్ పేషంట్స్ కి ఆల్మండ్స్ కూడా చక్కటి పరిష్కారం. వీటి ద్వారా పోషకాలు పొందవచ్చు. నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మంచి హెల్తీ ఫుడ్ అవుతుంది.

కివి
కివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించవచ్చని పలు పరిశోధకులు వెల్లడించాయి. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ డైట్ లో వీటిని చేర్చుకుంటే.. రుచితోపాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు.

డో నట్స్
ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించి ఇన్సులిన్ లెవెల్స్ పెంచవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి, దాల్చిన చెక్క డోనట్స్ ని మీ డైట్ లో నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు.

పుచ్చకాయ
పుచ్చకాయలు అధిక GI విలువ కలిగి ఉన్నప్పటికీ పుచ్చకాయ మధుమేహంతో బాధపడేవాళ్లకు చక్కటి పండు.

ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో కూడా చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.

పైనాపిల్
పైనాపిల్.. లో షుగర్ ఫుడ్స్ లో ఒకటి. ఇది యాంటీ వైరల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి.. దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి.

తేనె
పంచదార తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి.. షుగర్ పేషంట్స్ తేనెను తీసుకోవచ్చు. కాఫీ లేదా టీలో ఒక టేబుల్ స్పూన్ తేనె చేర్చుకోవచ్చు.

దానిమ్మ
రక్తంలో చక్కెర స్థాయిలను ట్రాక్ లో ఉంచడానికి దానిమ్మ సహాయపడుతుంది. వీటిలో చక్కెర శాతం తక్కువ.



Click it and Unblock the Notifications