For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ రావడానికి కారణమయ్యే కామన్ మిస్టేక్స్..!

బ్లడ్ లోని గ్లూకోజ్ ని శరీరం ఉపయోగించుకోలేనప్పుడు.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే డయాబెటిస్. కాబట్టి.. డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలేంటి ? లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, కొన్ని పొరపాట్లే.

By Swathi
|

డయాబెటిస్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. చాలా తరచుగా, చాలామంది చెబుతున్న సమస్య. అయితే ఇలా చాలామందిలో డయాబెటిస్ రావడానికి కామన్ మిస్టేక్స్.. ఉన్నాయి. ప్రతిరోజూ చేసే పొరపాట్లే.. డయాబెటిస్ రావడానికి కారణమవుతోంది.

7 Common Mistakes That Will Surely Make You Diabetic

బ్లడ్ లోని గ్లూకోజ్ ని శరీరం ఉపయోగించుకోలేనప్పుడు.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే డయాబెటిస్. కాబట్టి.. డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలేంటి ? కీలకంగా.. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, కొన్ని పొరపాట్లు, డైలీ హ్యాబిట్స్ డయాబెటిస్ కి కారణమవుతుంది.

ఒబేసిటీ, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి వంటివి డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలు. డయాబెటిస్ లో రెండురకాలున్నాయి. టైప్ 1 అనేది ఆటో ఇమ్యున్ డిజార్డర్, టైప్ టు డయాబెటిస్ అనేది ఇన్సులిన్ కి వ్యతిరేకంగా శరీరంలో మార్పులు రావడం. టైప్ టు డయాబెటిస్ అనేది చాలా కామన్.

హైబ్లడ్ షుగర్ లెవెల్స్ కాకుండా, తలనొప్పి, అలసట, కంటిచూపు మందగించడం, తరచుగా యూరిన్ కి వెళ్లడం, నోరు ఆరిపోవడం, తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటివన్నీ.. డయాబెటిస్ లక్షణాలు. మరి.. డయాబెటిస్ కి కారణమయ్యే కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం..

బ్రేక్ ఫాస్ట్ మానేయడం

బ్రేక్ ఫాస్ట్ మానేయడం

బ్రేక్ ఫాస్ట్ మానేయడం అనేది అదిపెద్ద పొరపాటు. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే.. తర్వాత తీసుకునే ఆహారంలో ఎక్కువ క్యాలరీలు అందుతాయి. దీనివల్ల షుగర్ లెవెల్స్ లో సమస్యకు కారణమవుతుంది.

ప్రొబయోటిక్స్ తినకపోవడం

ప్రొబయోటిక్స్ తినకపోవడం

ప్రొబయోటిక్స్ లేదా మంచి బ్యాక్టీరియా శరీరానికి అందితే.. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. శరీరంలో బ్లడ్ షుగర్ రెగ్యులేట్ అవుతుంది. కాబట్టి ప్రొబయోటిక్స్ తీసుకోకపోతే.. డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.

ఎక్కువ ఒత్తిడి

ఎక్కువ ఒత్తిడి

ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. ఇది ఇన్సులిన్ పై ప్రభావం చూపి.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది.

విటమిన్ డి సరిగా అందకపోతే

విటమిన్ డి సరిగా అందకపోతే

శరీరంలో విటమిన్ డి లోపిస్తే.. డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ కి ఛాన్స్ ఉంది. కాబట్టి విటమిన్ డి ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.

రోజంతా కూర్చోవడం

రోజంతా కూర్చోవడం

రోజంతా కూర్చోని పనిచేయడం, టీవీ చూడటం వంటి అలవాట్లు, శరీరక కదలికలు లేకపోవడం వల్ల కూడా డయాబెటిస్ బారిన పడటానికి కారణమవుతుంది.

నిద్రసరిగా లేకపోతే

నిద్రసరిగా లేకపోతే

నిద్ర సరిగా పట్టని వాళ్లు, రాత్రిళ్లు లేట్ నైట్ వరకు టీవీ చూసేవాళ్లలో కూడా డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.

ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్

ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్

వైట్ బ్రెడ్ లేదా వైట్ రైస్ లో ఎక్కువగా రిఫైన్డ్ కార్బ్స్ ఉంటాయి. ఇవి డయాబెటిస్ రిస్క్ ని పెంచుతాయి. కాబట్టి..వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.

English summary

7 Common Mistakes That Will Surely Make You Diabetic

7 Common Mistakes That Will Surely Make You Diabetic. Diabetes is one of the major health problems that is rising in recent times. Certain mistakes in our daily habit can also cause diabetes.
Desktop Bottom Promotion