For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ని ఎఫెక్టివ్ కంట్రోల్ చేసే.. దానిమ్మ ఫ్లవర్..!!

దానిమ్మను సూపర్ ఫుడ్ గా పరిగణించవచ్చు. అలాగే దానిమ్మ తొక్క, ఫ్లవర్స్ కూడా.. హెల్తీ ఫుడ్ గా చెప్పవచ్చు. ఇప్పుడు దానిమ్మ ఫ్లవర్ తో.. డయాబెటిస్ ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం..

By Swathi
|

దానిమ్మ టేస్టీగానే కాకుండా.. ఆరోగ్యానికి కూడా.. చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దానిమ్మ విత్తనాలే కాదు దానిమ్మ తొక్కలో కూడా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ ఒకవేళ మీరు డయాబెటిస్ తో బాధపడుతుంటే.. దానిమ్మ ఫ్లవర్స్ కూడా.. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

Pomegranate flowers

డయాబెటిస్ అనేది.. భారత జనాభాలో సగానికి సగం మంది బాధపడుతున్న సమస్య. ఇది ఇప్పుడు మేజర్ హెల్త్ డిసీజ్ లా మారిపోయింది. లైఫ్ స్టైల్ లేదా డైట్ కారణంగా.. కావచ్చు. దానిమ్మను సూపర్ ఫుడ్ గా పరిగణించవచ్చు. అలాగే దానిమ్మ తొక్క, ఫ్లవర్స్ కూడా.. హెల్తీ ఫుడ్ గా చెప్పవచ్చు. ఇప్పుడు దానిమ్మ ఫ్లవర్ తో.. డయాబెటిస్ ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం..

యాంటీ ఆక్సిడెంట్స్

యాంటీ ఆక్సిడెంట్స్

దానిమ్మలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండటం వల్ల.. కాన్ట్సిపేషన్, ఆర్థరైటిస్, బ్లడ్ ప్రెజర్ ని అరికడతాయి. ఇమ్యునిటీని మెరుగుపరుస్తాయి. ఫ్లూ, ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తాయి. గుండె వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తాయి.

డయాబెటిస్ కంట్రోల్

డయాబెటిస్ కంట్రోల్

దానిమ్మ ఫ్లవర్ లో యాంటీ డయాబెటిస్ మెడికేషన్ ఉండటం వల్ల.. డయాబెటిస్ ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆయుర్వేదం

ఆయుర్వేదం

డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదంలో కూడా.. దానిమ్మ ఫ్లవర్స్ ని ఉపయోగిస్తారట. కాబట్టి డైట్ లో దానిమ్మ ఫ్లవర్స్ ని చేర్చుకోవడం వల్ల.. డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు.

యునాని వైద్యం

యునాని వైద్యం

యునాని వైద్యంలో కూడా.. దానిమ్మ ఫ్లవర్స్ ని ఉపయోగించి డయాబెటిస్ ని కంట్రోల చేస్తారు.

యాంటీ ఆక్సిడెంట్స్

యాంటీ ఆక్సిడెంట్స్

దానిమ్మ ఫ్లవర్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఫోటోకెమికల్ రిజర్వోర్స్ ఉంటాయి. ఇవి డయాబెటిస్ వల్ల వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఆక్సిడేటివ్ స్ట్రెస్

ఆక్సిడేటివ్ స్ట్రెస్

డయాబెటిస్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి కారణమవుతుంది. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయి.. ఏకాగ్రత కోల్పోతారు. కానీ.. దానిమ్మ ఫ్లవర్స్ తీసుకోవడం వల్ల.. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి దూరంగా ఉండవచ్చు. బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తాయి.

ఎలా తీసుకోవాలి

ఎలా తీసుకోవాలి

దానిమ్మ ఫ్లవర్స్ ని పచ్చిగానే తీసుకోవడం వల్ల డయాబెటిస్ తో పాటు.. డయాబెటిస్ వల్ల వచ్చే వ్యాధులను, సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు.

English summary

Pomegranate flowers: A natural remedy to control diabetes

Pomegranate flowers: A natural remedy to control diabetes. Did you know pomegranate can improve memory and also keep your blood glucose under control?
Story first published: Monday, November 21, 2016, 10:58 [IST]
Desktop Bottom Promotion