For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్పొరేట్‌ డయాబెటిస్, నిర్లక్ష్యం చేస్తే ఒళ్లంతా కబళిస్తుంది..!

|

కార్పొరేట్‌ డయాబెటిస్, నిర్లక్ష్యం చేస్తే ఒళ్లంతా కబళిస్తుంది. కీలకమైన అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. గుండె, కిడ్నీ జబ్బుల వంటి రకరకాల సమస్యలను మోసుకొస్తుంది. కానీ దీనిపై చాలామందికి.. కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకూ దీనిపై అంతగా అవగాహన ఉండటం లేదు. అస్తవ్యస్త పనివేళలు, గంటల తరబడి పనిచేయాల్సి ఉండటం కార్పొరేట్‌ ఉద్యోగులకు శాపంగా మారుతున్నాయి. దాంతో ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం లేదా అధిక రక్తపోటు ముప్పు పొంచి ఉంటోంది.

మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా మధుమేహం బారినపడుతున్నారు. అపోలో మ్యూనిచ్‌, నీల్సన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. వయసు పెరుగుతున్నకొద్దీ మధుమేహం కూడా విజృంభిస్తున్నట్టు తేలటం గమనార్హం. 36-45 ఏళ్ల ఉద్యోగులతో పోలిస్తే 46-60 ఏళ్ల వారిలో మధుమేహం చాలా ఎక్కువగా.. దాదాపు 20% ఎక్కువగా కనబడుతోంది. 56-60 ఏళ్ల ఉద్యోగుల్లోనైతే సుమారు 50% ఎక్కువగా కనబడుతుండటం మరింత ఆందోళన కలిగించే విషయం.

కార్పొరేట్‌ డయాబెటిస్, నిర్లక్ష్యం చేస్తే ఒళ్లంతా కబళిస్తుంది..!

ఒకసారి మధుమేహం బారినపడితే దాన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్ప, నయం కావటమనేది ఉండదు. ఇది దీర్ఘకాల సమస్య. అందువల్ల ఇతర జబ్బులతో పోలిస్తే దీనికే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆహార నియమాలు పాటించటం ద్వారా మధుమేహాన్ని నియంత్రిచుకోవచ్చు. కానీ దీనిపై అవగాహన లేకపోవటం, అపోహల వంటివి సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. డయాబెటిస్ మీద కొన్ని అపోహాలు..

డయాబెటిస్ ను కంట్రోల్ చేసే అమేజింగ్ హెర్బ్స్ అండ్ స్పైసెస్..!! డయాబెటిస్ ను కంట్రోల్ చేసే అమేజింగ్ హెర్బ్స్ అండ్ స్పైసెస్..!!

అపోహ #1

అపోహ #1

మధుమేహం బారినపడితే మూత్రం ఎక్కువగా రావటం, నిస్సత్తువ, తలతిప్పు వంటి లక్షణాలు కనబడతాయని భావిస్తుంటారు. ఇది అన్నిసార్లు నిజం కాదు. చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. కొన్నిసార్లు చూపు పోవటం వంటి తీవ్ర సమస్యలతోనే సమస్య బయటపడొచ్చు.

టైప్ 2 డయాబెటిస్ ను లక్షణాలను నివారించే పసుపు స్మూతీ టైప్ 2 డయాబెటిస్ ను లక్షణాలను నివారించే పసుపు స్మూతీ

అపోహ #2

అపోహ #2

కొందరు మధుమేహాన్ని మామూలు జబ్బుగా కొట్టిపారేస్తుంటారు. చికిత్స సరిగా తీసుకోరు. కానీ మధుమేహం నియంత్రణలో లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. తరచుగా ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండటం, జబ్బులు, పుండ్లు త్వరగా మానకపోవటం.. కిడ్నీ, గుండె జబ్బులు.. చూపు తగ్గటం వంటివి వేధిస్తాయి. కొందరిలో పాదాలు, వేళ్లు తొలగించాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది.

అపోహ #3

అపోహ #3

మిఠాయిలు, చాక్లెట్లు తినటం వల్ల మధుమేహం వస్తుందని కొందరు అనుకుంటుంటారు. ఇది నిజం కాదు. మన జీవనశైలి, జన్యుపరమైన అంశాలు దీనికి దోహదం చేస్తాయి.

అపోహ #4

అపోహ #4

కొందరు చక్కెర తీసుకోవటం మానేస్తే మధుమేహం అదే తగ్గుతుందని భావిస్తుంటారు. మధుమేహ నియంత్రణకు చక్కెర, కొవ్వులు తగ్గించటం అవసరమే గానీ పరిస్థితిని బట్టి వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.

అపోహ # 5

అపోహ # 5

ఇన్సులిన్‌ తీసుకోవటం మొదలుపెడితే ఇక జీవితం అంతమైనట్టేనని కొందరు భయపెడుతుంటారు. ఇది నిజం కాదు. ఇన్సులిన్‌ అవసరమైతే దాన్ని తీసుకుంటూ మంచి జీవనశైలిని పాటించటం, ఒత్తిడి తగ్గించుకోవటం వంటి వాటితో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీర్ఘకాలం నిశ్చింతగా జీవించవచ్చు.

ఒక్క నెలలో డయాబెటిస్ లక్షణాలను తగ్గించే ఆయుర్వేదిక్ హోం రెమెడీ.. ఒక్క నెలలో డయాబెటిస్ లక్షణాలను తగ్గించే ఆయుర్వేదిక్ హోం రెమెడీ..

అపోహ #6

అపోహ #6

ప్రెగ్నెన్సీ సమయంలో జెస్టేషనల్ డయాబిటీస్ తో బాధ పడిన వారు, మా పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వస్తుందా అని భయపడుతూంటారు. వీరి భయంలో యదార్ధం లేకపోలేదు. 25 సంవత్సరములు దాటిన తర్వాత వీరి సంతానానికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది షుగర్ వ్యాధిని వెల్లడించే లక్షణాలు మాకేమీ లేవు. కాబట్టి మాకు షుగర్ వ్యాధి ఉండి ఉండదు అని కూడా అపోహ పడుతూంటారు.

అపోహ # 7

అపోహ # 7

షుగర్ కు సంబంధించిన అధిక ఆకలి, అధిక దప్పిక, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవలసి రావటం, తదితర లక్షణాలు ఏ మాత్రం లేకుండా కూడా షుగర్ వ్యాధితో బాధ పడేవారున్నారు. ఆ లక్షణాలు లేనంత మాత్రాన నాకు షుగర్ లేదు అనుకోవటం తప్పు.

అపోహ # 8

అపోహ # 8

నాకు దెబ్బతగిలినా, పుండు పడినా, గాయం త్వరగానే మానుతుంది. నాకు షుగర్ లేదేమో అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ దాన్ని నియంత్రణలో ఏ మాత్రం ఉంచుకోని వారిలో పుండు మానకపోవటం వంటి బాధలు ఉంటాయి. కనుక పుండ్లు సంతోషంగా మానుతున్నాయి కదా అని షుగర్ లేదేమో అనుకోవటం తప్పు.

అపోహ # 9

అపోహ # 9

షుగర్ వున్న వారు గోధుమతో చేసిన ఆహారాలే తినాలని వరి తినకూడదని చాలామంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి వీటన్నింటిలో 70 శాతం పిండి పదార్ధాలే ఉంటాయి కనుక వరి మానేసి గోధుమ, జొన్న తినటం ఏ మాత్రం సమంజసం కాదు.

English summary

1 in every 5 corporate employees at risk of diabetes: Study

1 in every 5 corporate employees at risk of diabetes: Study,Erratic and long working hours put one in every five employees of the corporate world at the risk of diabetes or hypertension, a study has claimed.
Story first published:Thursday, July 13, 2017, 11:26 [IST]
Desktop Bottom Promotion