For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ నెర్వ్ పెయిన్ నుంచి ఉపశమనాన్నందించే 10 హోమ్ రెమెడీలు

|

రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) వారి గణాంకాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలలో ఈ సంఖ్య 108 మిలియన్ల నుంచి 422 మిలియన్లకు చేరింది.

డయాబెటిస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. సరైన సమయంలో సరైన విధంగా చికిత్సనివ్వకపోతే ప్రాణానికే ప్రమాదం. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోకపోతే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. డయాబెటిక్ న్యూరోపతికి కూడా దారితీయవచ్చు.

డయాబెటిక్ న్యూరోపతిని పెరిఫెరల్ న్యూరోపతి అని కూడా అంటారు. డయాబెటిస్ వలన నరాలు దెబ్బతినడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. ఎక్కువగా లింబ్స్ లో, అరికాళ్లలో అలాగే చేతులలో ఈ కండిషన్ ను గుర్తించవచ్చు. హై బ్లడ్ షుగర్ వలన కలిగే దుష్ప్రభావం వలన ఇలా జరుగుతుంది.

ఈ సమస్య వలన చేతివేళ్ళు, కాలివేళ్లు, చేతులు మరియు కాళ్ళు మొద్దుబారినట్టనిపిస్తుంది. కాబట్టి, బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ని మానిటర్ చేయడం ముఖ్యం. కొన్ని హోమ్ రెమెడీస్ ని పాటించడం ద్వారా కూడా ఈ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

డయాబెటిక్ నెర్వ్ పెయిన్ నుంచి ఉపశమనాన్నిఅందించే హోమ్ రెమెడీస్ గురించి ఈ ఆర్టికల్ లో చర్చించాము.

1. వెచ్చటి నీటితో స్నానం

1. వెచ్చటి నీటితో స్నానం

డయాబెటిక్ నెర్వ్ పెయిన్ నుంచి ఉపశమనాన్నిఅందిస్తుంది ఈ సులభమైన హోమ్ రెమెడీ. వెచ్చటి నీటితో స్నానం చేస్తే బ్లడ్ సర్క్యూలేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వేడి వలన హీలింగ్ ప్రాసెస్ అనేది వేగవంతం అవుతుంది.

20 నిమిషాల పాటు రోజూ వార్మ్ వాటర్ బాత్ ని చేయండి. ఈ నీటిలో ఒక కప్పుడు ఎప్సం సాల్ట్ ని జోడించినా మంచిదే.

2. జింజర్ టీ:

2. జింజర్ టీ:

జింజర్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవి డయాబెటిక్ నెర్వ్ పెయిన్ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. జింజర్ టీని తాగడం వలన బ్లడ్ షుగర్ లెవల్స్ అనేవి నియంత్రణలో ఉంటాయి.

ఒక కప్పుడు నీటిలో రెండు ముక్కల జింజర్ ను లేదా ఒక టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్ ను తీసుకుని ఈ నీటిని మరిగించాలి.

అయిదు నుంచి పది నిమిషాల పాటు ఈ టీని మరిగించాలి. ఈ టీని ప్రతిరోజూ తీసుకుంటే మంచిది.

3. క్రమం తప్పకుండా వ్యాయామం:

3. క్రమం తప్పకుండా వ్యాయామం:

వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిక్ నెర్వ్ పెయిన్ ను అదుపులో ఉంచవచ్చు. వ్యాయామం ద్వారా రక్తప్రసరణ అనేది మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. తద్వారా డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. అందుకే, క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాలి.

4. మసాజ్:

4. మసాజ్:

డయాబెటిక్ నెర్వ్ పెయిన్ ను తగ్గించే మరొక అద్భుతమైన రెమెడీగా మసాజ్ పేరొందింది. రక్తనాళాలలోని రక్తప్రసరణని మెరుగుపరచడానికి అలాగే కండరాలను బలపరచడానికి మసాజ్ ఉపయోగపడుతుంది.

కొన్ని చుక్కల మస్టర్డ్ ఆయిల్ ను లేదా కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి.

ఆ ప్రదేశాన్ని అయిదు నుంచి పది నిమిషాల వరకు మసాజ్ చేయాలి.

ఆ తరువాత, వెచ్చటి టవల్ తో ప్రభావిత ప్రదేశాన్ని కప్పాలి.

ఈ పద్దతిని రోజులో అనేకసార్లు పాటించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

5. ఎసెన్షియల్ ఆయిల్స్:

5. ఎసెన్షియల్ ఆయిల్స్:

ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా నొప్పితో పాటు ఇంఫ్లేమేషన్ తగ్గుముఖం పడుతుంది. పెప్పెర్మింట్, ల్యావెండర్ లేదా ఫ్రాన్కిన్సన్స్ ఎసెన్షియల్ ఆయిల్ ను వాడటం ద్వారా డయాబెటిక్ నెర్వ్ పెయిన్ ను తగ్గించుకోవచ్చు.

కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. ఆ ప్రదేశాన్ని సున్నితంగా మసాజ్ చేయండి.

6. దాల్చిన చెక్క:

6. దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లేమేటరీ, యాంటీ మైక్రోబయాల్, యాంటీ డయాబెటిక్ మరియు ఇమ్మ్యూన్ బూస్టింగ్ ప్రాపర్టీలు కలవు. ఇవన్నీ డయాబెటిక్ నెర్వ్ పెయిన్ ను తగ్గిస్తాయి.

దాల్చిన చెక్క నూనెతో ప్రభావిత ప్రాంతాన్ని మసాజ్ చేయండి.

దాల్చిన చెక్క టీని తీసుకోండి.

వంటలలో దాల్చిన చెక్కను ఉపయోగించండి.

7. ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్:

7. ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్:

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి నరాలు మొద్దుబారటాన్ని, బర్నింగ్ సెన్సేషన్ ని అలాగే నరాల తిమ్మిరిని నివారించగలవు.

ఒక టీస్పూన్ ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి.

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ క్యాప్సూల్ ని కూడా తీసుకోవచ్చు. అయితే, వైద్యుని పర్యవేక్షణ తప్పనిసరి.

8. విటమిన్ సి:

8. విటమిన్ సి:

ఇమ్మ్యూన్ సిస్టమ్ ని బలపరిచే శక్తి విటమిన్ సి లో కలదు. తద్వారా, నెర్వ్ పెయిన్ తగ్గుతుంది. నెర్వ్ డామేజ్ కూడా రిపైర్ అవుతుంది. విటమిన్ సి వలన హీలింగ్ ప్రాసెస్ వేగవంతం అవుతుంది.

ఆరంజ్, లెమన్, పైనాపిల్, టమాటో, స్పినాచ్, స్ట్రాబెర్రీస్ వంటి ఫ్రూట్స్ లో విటమిన్ సి లభ్యమవుతుంది.

9. క్యాప్సిసిన్ క్రీమ్:

9. క్యాప్సిసిన్ క్రీమ్:

క్యాప్సిసిన్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ అలాగే అనాల్జేసిక్ ప్రాపర్టీస్ కలవు. ఇవి నెర్వ్ పెయిన్ ను తగ్గించి డయాబెటిక్ నెర్వ్ పెయిన్ ను నివారించేందుకు తోడ్పడతాయి.

ఈ క్రీమ్ ను ప్రభావిత ప్రాంతంపై రోజుకు రెండు లేదా మూడు సార్లు రాయాలి.

10. విటమిన్ బి6:

10. విటమిన్ బి6:

విటమిన్ బి6 అనేది నరాలలో తిమ్మిరిని అలాగే మొద్దుబారటాన్ని తగ్గిస్తుంది. అలాగే డామేజ్ అయిన నెర్వ్ ని రిపైర్ చేస్తుంది. విటమిన్ బి6 కలిగిన ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ నెర్వ్ పెయిన్ ను తగ్గించుకోవచ్చు.

బనానా, పీనట్ బటర్, టమాటో జ్యూస్, సోయ్ బీన్స్, వాల్నట్స్ వంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ బి6 ని పొందవచ్చు.

English summary

10 Home Remedies For Diabetic Nerve Pain

10 Home Remedies For Diabetic Nerve Pain,Diabetic neuropathy also called peripheral neuropathy occurs when there is a nerve damage caused by diabetes. Read on to know the home remedies for diabetic nerve pain.
Story first published:Tuesday, February 27, 2018, 15:41 [IST]
Desktop Bottom Promotion