For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహం మీకు ఎప్పటికి రాకుండా ఉండాలంటే నిరూపితమైన ఈ ఎనిమిది మార్గాలను పాటించండి

By R Vishnu Vardhan Reddy
|

మధుమేహం అనే వ్యాక్యాన్ని, మన దైనందిక జీవితంలో ప్రతిఒక్కరు ఉచ్చరించాల్సిన ఒక పదం అయిపొయింది. ఎందుకంటే, మానవులు ఎదుర్కొంటున్న వ్యాధుల్లో అతి ముఖ్యమైనది, హానికరం అయినది ఇదే కాబట్టి.

మనం ఎప్పుడైతే దీని గురించి ఆలోచిస్తామో అటువంటి సమయంలో, ఖచ్చితంగా మనకు చాలా దగ్గరి వారికి ఈ వ్యాధి సోకి ఉండవచ్చు లేదా ఈ వ్యాధి వల్ల వీరు విపరీతంగా బాధపడుతూ ఉండవచ్చు. నిజమే కదా.

అసలు నిజం ఏమిటంటే, కొన్ని అధ్యయనాల ప్రకారం 1980 వ సంవత్సరంలో 108 మిలియన్ మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉండగా, 2014 నాటికి ఆ సంఖ్య 422 మిలియన్ల దాటింది.

కాబట్టి ఈ సంవత్సరంతో పాటు, భవిష్యత్తులో రాబోయే సంవత్సరాల్లో దీని యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగర్బుడుస్తుంది.

మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మనశరీరంలో జరిగే జీవక్రియ సరైన పద్దతితో చోటు చేసుకోకపోవడం వల్ల, అవసరమైన మోతాదులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తికాదు లేదా ఉత్పత్తి కాకుండా చేస్తుంది. ఈ పరిస్థితి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో అది విపరీతమైన పరిణామాలకు దారి తీస్తాయి. ఈ పరిస్థితినే మధుమేహం అని అంటారు.

ఎప్పుడైతే రక్తంలో చక్కెర స్థాయిలు అధిక శాతంలో ఉంటాయో, అటువంటి సమయంలో తీవ్రంగా అలసిపోవడం ,తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, గాయాలు త్వరగా నయం కాకపోవడం మొదలగు మధుమేహ లక్షణాలకు ఈ పరిస్థితి దారితీస్తుంది.

ఒక దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, మధుమేహం పూర్తిగా నయం అవడానికి ఎటువంటి మందు లేదు. కానీ, ఈ లక్షణాలకు చికిత్స చేసి, అందువల్ల కలిగే పరిణామాలను అదుపులో ఉంచుకోవచ్చు.

మీ వంశపారంపర్యంగా ఎవ్వరికి గాని ఈ జబ్బు లేకుండా ఉంటే, ఇక్కడ నిరూపించిన పద్ధతులు గనుక మీరు అనుసరిస్తే మీరు ఎప్పటికి మహిమేహం వ్యాధి భారిన పడరు.

1. మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి :

1. మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి :

ఎన్నో అధ్యయనాలు పరిశోధించి నిరూపించబడిన అంశం ఏమిటంటే, ఎత్తుకు తగ్గ బరువుని గనుక ప్రతి ఒక్క మనిషి నిర్వహించగలిగితే, ఈ పద్దతి ద్వారా ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స చేయవచ్చు మరియు అవి రాకుండా అరికట్టవచ్చు, మధుమేహ వ్యాధితో సహా. దీనినే ఆంగ్లంలో బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఇలా ఆరోగ్యవంతమైన బాడీ మాస్ ఇండెక్స్ ఉండాలనుకున్నట్లైతే, ప్రతి ఒక్క వ్యక్తి వారికి అనుగుణంగా బరువు ని తగ్గటం లేదా పెరగటం చేయాలి.అంతేకాకుండా వారి యొక్క జీవన విధానాన్ని కూడా ఆరోగ్యవంతంగా మార్చుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ కనుక సరైన పద్దతిలో నిర్వహించి ఆరోగ్యవంతంగా ఉన్నట్లైతే, మధుమేహం వ్యాధి రాకుండా 70% వరకు అరికట్టవచ్చు.

2. సలాడ్స్ ని బాగా తినడం :

2. సలాడ్స్ ని బాగా తినడం :

క్యారెట్లు, దోసకాయ, టమోటాలు,ఉల్లిపాయలు, అల్లం మొదలగు కూరగాయలు మరియు ఆకుకూరలతో తయారుచేసిన సలాడ్ను, రోజుకు ఒక్కసారైన, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి ముందు తినడం చాలా మంచిది. ఈ సలాడ్ లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవడం మాత్రం మరచిపోకండి. సలాడ్స్ లో వెనిగర్ వేసుకొని సేవిచడం ద్వారా, రక్తం తక్కువ మోతాదులో చక్కెరని పీల్చుకుంటుంది. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి మరియు మీరు మధుమేహం వ్యాధిని పడే అవకాశాలు కూడా తగ్గుతాయి.

3. ఎక్కువగా నడవటం :

3. ఎక్కువగా నడవటం :

మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చు, మంచి శరీరాకృతి కలిగి చాలా రోజులు ఆనందంగా జీవించవచ్చు. మధుమేహం వ్యాధిని నిరోధించడానికి వ్యాయామాల్లో అతి ఉత్తమమైనది నడక. ఏ వయస్సులో ఉన్నవారైనా సరే, రోజుకి కనీసం 40 నిమిషాల పాటు బాగా వేగంగా నడవగలిగితే, మీ యొక్క జీవక్రియ చాలా ఆరోగ్యవంతంగా ఉండి, మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇలా చేయడం ద్వారా మీరు మధుమేహం వ్యాధి భారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

4. తృణధాన్యాలను సేవించండి :

4. తృణధాన్యాలను సేవించండి :

మీరు తీసుకొనే ఆహారంలో ఓట్స్, బార్లీ, గోధుమ రంగు బియ్యం, చిరు ధాన్యాలు మొదలగునవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ఉదయంపూట అల్పాహారం తీసుకునే సమయంలో వీటిని సేవించడం మంచిది. తృణధాన్యాల్లో అధిక మోతాదులో పోషకాలు మరియు పీచు పదార్ధాలు ఉంటాయి. తృణధాన్యాల్లో ఉండే పీచు పదార్ధం రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను సాధారణంగానే తగ్గించి వేస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు భవిష్యత్తులో మధుమేహం భారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తృణధాన్యాలు క్రమం తప్పకుండా సేవించడం వల్ల మలబద్దకం, అధిక రక్తపోటు మొదలగు అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని అవి కాపాడి, ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.

5. కాఫీ త్రాగటం :

5. కాఫీ త్రాగటం :

కాఫీ తాగితే వచ్చే లాభ, నష్టాల గురించి వైద్య రంగంలో ఎన్నో వాదనలు ఉన్నాయి. కానీ, ఎన్నో పరిశోధనలు చెబుతున్న నిజం ఏమిటంటే, ఎవరైతే రోజుకి రెండు కప్పుల కాఫీ త్రాగుతారో, వారు టైపు 2 మధుమేహం వ్యాధి భారిన పడే అవకాశాలు 29% తగ్గుతుంది. కానీ, అందరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీరు చక్కెర లేకుండా కాఫీ సేవించాలి. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు లాభం చేకూరుస్తాయి.

6. ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండండి :

6. ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండండి :

ఈ రోజుల్లో రకరకాల ఫాస్ట్ ఫుడ్ లు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తినకుండా మన నోటిని కట్టేసుకోవడం చాలా కష్టం. అయితే పిజ్జా లు, బర్గర్ లు, ఫ్రై పదార్ధాలు మొదలగు ఫాస్ట్ ఫుడ్ సేవించడం వల్ల ఊబకాయం పెరిగిపోతుంది, కొవ్వు అధికం అవుతుంది, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి, గుండె సంబంధిత సమస్యలు అధికం అవుతాయి మరియు ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఈ రకమైన ఆహారాలు మనం తినడం వల్ల, భవిష్యత్తులో మన శరీరంలో ఉండే ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతింటుంది. కావున ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే, భవిష్యత్తులో మీకు మధుమేహం రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

7. దాల్చిన చెక్క ను తినండి :

7. దాల్చిన చెక్క ను తినండి :

దాల్చిన చెక్కను వీలైనంత ఎక్కువగా మీరు తినే ఆహారంలో భాగం చేయండి. దాల్చిన చెక్క నూనె మరియు పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు మధుమేహం భారిన పడే అవకాశం 45% తగ్గుతుందట. ఎన్నో అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే, దాల్చిన చెక్కకు సాధారణంగానే చెడు కొవ్వు మరియు త్రి గ్లిజరాయిడ్లను శరీరం నుండి పంపించివేసే గుణం ఉందట. ఈ రెండింటిని అది సాధారణంగానే తగ్గించి వేస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యతతో ఉండేలా చూసి, మధుమేహం వ్యాధి దరిచేరకుండా కాపాడుతుంది.

8. ఒత్తిడికి దూరంగా ఉండండి :

8. ఒత్తిడికి దూరంగా ఉండండి :

ఒత్తిడి వల్ల ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. తల నొప్పి దగ్గర నుండి క్యాన్సర్ వరకు ఒత్తిడే కారణం. ఇది నిజం. మీరు గనుక తరచూ ఒత్తిడికి లోనవుతున్నట్లైతే, మీరు మధుమేహం వ్యాధిని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లే. కావున తరచూ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. యోగా చేయండి మరియు ఇతర విధాలుగా ఎలా ఒత్తిడిని తగ్గించుకోవచ్చో తెలుసుకొని, ఆ విధంగా చేయడానికి కార్యాచరణను రూపొందించుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలు తగ్గుముఖం పడతాయి మరియు మీరు మధుమేహం వ్యాధి భారిన పడకుండా ఉంటారు.

English summary

8 Proven Ways To Never Get Diabetes

Diabetes is an incurable metabolic disorder, which affects numerous people every year. Diabetes can cause a number of undesirable symptoms, which can affect your life. Here are a few tips which can help prevent diabetes, later on in life!
Story first published:Monday, February 12, 2018, 17:04 [IST]
Desktop Bottom Promotion