For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ (మధుమేహ) బాధితులు టమోటోలను తినవచ్చా ? అలా తినడం మంచిదా ? కాదా ?

డయాబెటిస్ (మధుమేహ) బాధితులు టమోటోలను తినవచ్చా ? అలా తినడం మంచిదా ? కాదా ?

|

డయాబెటిస్ను నిర్వహించడమనేది నిస్సందేహంగా ఒక సంక్లిష్టమైన విషయము, అలాగే డయాబెటిస్ బాధితుల పరిస్థితిని సరిగ్గా నిర్వహించగల ఉత్తమ మార్గాల్లో ఒకటి వారు అనుసరించే "డైట్" విధానం. డయాబెటిస్ రోగులు వారు తినే ఆహారాన్ని ఎల్లప్పుడూ తెలుసుకోవాలి.

ఈ ఆర్టికల్లో, మేము టమోటాలకు & మధుమేహానికి మధ్య గల సంబంధాన్ని విశ్లేషించాము. మేము కూడా "డయాబెటిస్ బాధితులు టమోటోలను తినవచ్చా ? అలా తినడం మంచిదా ? కాదా ?" అనే ప్రశ్నకు లోతైన సమాధానం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము. కాబట్టి, మీరు కూడా మాతో కలిసి మధుమేహం & టమోటాల మధ్య గల సంబంధం గూర్చి సరైన సమాధానాలను అన్వేషించడంలో భాగం కండి.

Can Diabetics Eat Tomatoes? Is It Good or Bad?

ముందుగా, టమోటోకు సంబంధించిన కొన్ని వాస్తవాలు:

* విటమిన్ K, విటమిన్ B1, B2 & B6 వంటి వివిధ విటమిన్ల కోసం ఈ టమోటాలు మంచి మూలంగా ఉన్నాయి.

* అలాగే ఐరన్, కాపర్, మాంగనీస్ & పాస్పరస్ వంటి పలు మూలకాలకు ఇది గొప్ప మూలంగా ఉంది.

* వీటిలో ఉన్న ప్రోటీన్లు, వ్యక్తులలో ఆరోగ్యకరమైన కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది.

* ఈ టమోటాలలో ఉండే మాలిబ్డినం అనే సమ్మేళనం, ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని సంరక్షించే ఎంజైమ్స్ ఉత్పత్తి చేయగలవని నిర్ధారిస్తుంది.

* వీటిలో ఉండే లైకోపీన్ సమ్మేళనం, మీ శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగించేదిగా ఉంటుంది.

* వీటిలో చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

* మధ్యస్థ పరిమాణాన్ని కలిగి ఉన్న టమోటాలో సుమారు 22 యూనిట్ల కేలరీలు, 5 గ్రాముల కార్బొహైడ్రేట్లు & 1 గ్రాము ప్రోటీన్ను కలిగి ఉంది. వీటిలో కొవ్వు ఉండదు.

డయాబెటిస్ రోగుల కోసం టమోటాలు :

డయాబెటిస్ రోగుల కోసం టమోటాలు :

మధుమేహం రోగులు పాటించే డైట్లో టమోటాలను ముఖ్య భాగంగా చేసుకోవడం వల్ల వారి శరీరంలో కలిగి ముఖ్యమైన ప్రయోజనాలేమిటో ఇప్పుడు మనము చూద్దాం:

టమోటాలు చాలా తక్కువగా స్థాయిలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.

టమోటాలు చాలా తక్కువగా స్థాయిలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.

* టమోటాలు చాలా తక్కువగా స్థాయిలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. శరీర రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఈ టమోటాలు దీర్ఘకాలం పాటు సహాయపడతాయి.

కేలరీలను కూడా తక్కువ మోతాదులో కలిగి ఉన్నందున

కేలరీలను కూడా తక్కువ మోతాదులో కలిగి ఉన్నందున

* అలాగే ఇవి కేలరీలను కూడా తక్కువ మోతాదులో కలిగి ఉన్నందున, మధుమేహా రోగులకు శరీర బరువు తగ్గడంలో సహాయకారిగా ఉంటాయి. మధుమేహా నిర్వహణలో ఇది అత్యంత ప్రభావశాలిగా ఒకటి.

చెడ్డ కొలెస్ట్రాల్ & ట్రైగ్లిజరైడ్స్ వంటి మొదలైన స్థాయిలను తగ్గించుటలో

చెడ్డ కొలెస్ట్రాల్ & ట్రైగ్లిజరైడ్స్ వంటి మొదలైన స్థాయిలను తగ్గించుటలో

* అంతేకాకుండా, ఈ టమోటాలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ & ట్రైగ్లిజరైడ్స్ వంటి మొదలైన స్థాయిలను తగ్గించుటలో దారితీస్తుందని పరిశోధనలో కనుగొనబడింది.

టమోటాలలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు,

టమోటాలలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు,

* టమోటాలలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు, కొన్ని ప్రధాన డయాబెటీస్ సంబంధిత సమస్యలతో వ్యవహరించడంలో కూడా సహాయపడతాయి (ప్రత్యేకించి మూత్రపిండాల విషయంలో).

మధుమేహం చికిత్సలో రక్త సరఫరా అనేది చాలా మృదువుగా మారుతుంది.

మధుమేహం చికిత్సలో రక్త సరఫరా అనేది చాలా మృదువుగా మారుతుంది.

* అంతేకాకుండా, మధుమేహం చికిత్సలో రక్త సరఫరా అనేది చాలా మృదువుగా మారుతుంది.

 శరీర ఎంజైమ్ పనితీరును మెరుగుపర్చడానికి

శరీర ఎంజైమ్ పనితీరును మెరుగుపర్చడానికి

* శరీర ఎంజైమ్ పనితీరును మెరుగుపర్చడానికి టమోటాలలో ఉండే బీటా-కెరోటిన్ వంటి యాంటిఆక్సిడెంట్లు సహాయపడతాయి, తద్వారా డయాబెటిస్ను సమర్థవంతంగా నిర్వహించగలగుతుంది.

వీటిలో గొప్ప మూలంగా ఉన్న అనేక పోషకాలు

వీటిలో గొప్ప మూలంగా ఉన్న అనేక పోషకాలు

* వీటిలో గొప్ప మూలంగా ఉన్న అనేక పోషకాలు & విటమిన్లు మీ శరీరంలో కొవ్వు చేరడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం రోగులలో చాలా సాధారణంగా తలెత్తే హృదయ సంబంధిత సమస్యలను నివారించడంలో ఇది దీర్ఘకాలం పాటు పనిచేస్తుంది. టమోటాలలో "కెరోటినాయిడ్ లైకోపీన్" ఉనికి ఉన్న కారణంగా గుండె ఆరోగ్యానికి సపోర్టుగా ఉంటుంది.

మధుమేహం కారణంగా మన శరీరం

మధుమేహం కారణంగా మన శరీరం

* మధుమేహం కారణంగా మన శరీరం "లిపిడ్ పెరాక్సిడేషన్" అని పిలువబడే ఒక పరిస్థితికి గురికావచ్చు. ఇలాంటి పరిస్థితి వల్ల, శరీర పొరలు & ఇతర భాగాలలో ఉండే కొవ్వు స్థాయిలు చాలా వరకు దెబ్బతింటాయి. అంతేకాకుండా ఇది శరీర రోగనిరోధక వ్యవస్థ నాశనానికి దారితీస్తుంది. టమోటాలలో ఉన్న "లైకోపీన్" అనే సమ్మేళనం ఈ పరిస్థితితో పోరాడటానికి సహాయపడుతుంది.

టమోటాలలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్

టమోటాలలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్

* ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సహాయపడే రక్త ఫలకళలు ఒకదానికొకటి అతుక్కుని ఉండవచ్చు, ఈ కారణం చేతనే మధుమేహ రోగులు ఎక్కువగా రక్తం గడ్డ కట్టడంతో బాధపడుతుంటారు. ఈ టమోటాలలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ పై సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

 చివరగా, డయాబెటీస్ రోగులలో రక్తపోటు స్థాయిని

చివరగా, డయాబెటీస్ రోగులలో రక్తపోటు స్థాయిని

* చివరగా, డయాబెటీస్ రోగులలో రక్తపోటు స్థాయిని స్థిరీకరించడం కూడా టమోటాలు చాలా బాగా సహాయపడుతుంది.

English summary

Can Diabetics Eat Tomatoes? Is It Good or Bad?

Diabetes management is undoubtedly a complicated matter and one of the best ways in which a diabetes patient can manage the condition is by following a particular meal plan. Diabetes patients have to be always aware of the food they eat and in this article, we shall analyze the relationship between tomatoes and diabetes. We shall also deep dive and try to find the answer to the question “Can Diabetics Eat tomatoes? Is It Good or Bad?” So, come and join us for this article as we explore the answers related to the relationship between diabetes and tomatoes.
Story first published:Saturday, September 1, 2018, 12:49 [IST]
Desktop Bottom Promotion