For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహ రోగులలో రక్తంలో చక్కర నిల్వలను నియంత్రించగలిగే లవంగాల రెసిపీ

మధుమేహ రోగులలో రక్తంలో చక్కర నిల్వలను నియంత్రించగలిగే లవంగాల రెసిపీ

|

భారతదేశం సుగంధ ద్రవ్యాల భూమిగా ప్రసిద్ధి చెందిందని మనకు తెలుసు, అవునా ?

ఈ సుగంధ ద్రవ్యాలు మన వంటలకు మంచి రుచి, మరియు సువాసనలను అందివ్వడమే కాకుండా, అనేక ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. కొన్నిటిని పర్ఫ్యూమ్స్ లో కూడా వినియోగిస్తారు అంటే అతిశయోక్తి కాదు.

దాల్చినచెక్క, లవంగం, ఏలకులు వంటి అనేక సుగంధద్రవ్యాలు మనకు సుపరిచితమైనవిగానే ఉంటాయి. ఈ సుగంధ ద్రవ్యాలను వంటలలోనే కాకుండా, పర్ఫ్యూమ్స్ మరియు, కొన్ని ముఖ్యమైన నూనెల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

Natural Remedies For Diabetes

పురాతన ఆయుర్వేద ఔషధ విధానంలో, కొన్ని సుగంధ ద్రవ్యాలకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. దీనికి కారణం, వాటిలోని అద్భుతమైన గొప్ప ఆరోగ్య విశిష్టతలు. ఆ పద్దతులను, ఆ పదార్ధాలను ఇంకనూ మనం అనుసరిస్తున్నామంటే, వాటి ప్రయోజనాల గురించి వేరే చెప్పనవసరం లేదు.

మనలో వ్యాధులకు గురవని వ్యక్తులు అంటూ ఉండరు. రోజుకో రోగం పుట్టుకొస్తున్న ఈ కాలంలో, ఒక వ్యక్తి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఆశ్చర్యం కలుగకమానని పరిస్థితుల్లో ఉన్నాము.

వీటిలో అనేక రకాల వ్యాధులు, గుర్తెరుగని వ్యాదులుగానే ఉండడం మన దురదృష్టం. క్రమంగా వ్యాధి గురించిన పూర్తి అవగాహన లేని కారణంగా అనేకమంది, తక్కువ వయసులోనే ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఏదిఏమైనా ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంభించే వారు, అనారోగ్యాలకు కూసింత దూరంగానే ఉంటారు అన్నది సత్యం.

Natural Remedies For Diabetes

మధుమేహ లక్షణాల నివారణ కోసం సహజసిద్దమైన చికిత్స విధానం :

ఇప్పుడు మధుమేహం గురించి తెలియని వారంటూ ఉండరు. కానీ మధుమేహానికి పూర్తిస్థాయిలో నివారణ అనేది ఉండదు, ఆ వ్యాధి లక్షణాలు మాత్రమే నియంత్రించబడతాయి.

కావున, నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు జీవన శైలి, ఆహార ప్రణాళికలలో కొన్ని మార్పులు ఖచ్చితంగా అవసరమవుతాయి. ఈ లక్షణాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడమే కీలకమైన అంశంగా ఉంటుంది. డయాబెటిస్ వంటి వ్యాధితో జీవనం కొనసాగించడం, అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అది ఒక వ్యక్తి రోజువారీ కార్యాచరణలకు ఆటంకం కలిగించడమే కాకుండా, అనేక ఇతరములైన ఆరోగ్య సమస్యలకు కూడా కారకంగా మారుతుంది.

శరీరంలో ఇన్సులిన్ స్థాయిల మితిమీరిన హెచ్చుతగ్గుల కారణంగా టైప్ -1 మరియు టైప్-2 మధుమేహాలకు దారితీస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇన్సులిన్ విడుదల యొక్క అసాధారణ స్థితిగా చెప్పబడుతుంది. క్రమంగా శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకునే జీవక్రియల పనితీరు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. క్రమంగా కొన్ని అవాంఛనీయ లక్షణాలతో కూడిన పరిస్థితులకు దారితీస్తుంది.

ఈ లక్షణాలు వరుసగా, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, బరువు నష్టం, అతి మూత్ర వ్యాధి, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం, అస్పష్టమైన దృష్టి, నిరంతరమైన ఆకలి, పాదాలలో తిమ్మిరి మొదలైనవిగా ఉంటాయి.

ఈ మధుమేహం యొక్క లక్షణాలకు సరైన సమయంలో చికిత్స చేయని పక్షంలో, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు సైతం దారితీయవచ్చు.

కావున, మీరు మధుమేహం చికిత్సలో, మరియు నియంత్రణలో భాగంగా మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహజసిద్దమైన పద్దతులను అనుసరించాలని భావిస్తున్న వారైతే, లవంగం మీకు అత్యుత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది.

Natural Remedies For Diabetes

కావలసిన పదార్ధాలు :

లవంగాలు – 6 నుండి 8

వేడినీరు - 1 గ్లాసు

మధుమేహ వ్యాధితో భాదపడుతున్న వ్యక్తి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈ చికిత్సా విధానం రోజూవారీ వినియోగం కారణంగా, ఉత్తమంగా పనిచేస్తుందని నిరూపించబడింది కూడా.

మధుమేహ చికిత్సా విధానం కోసం ఈ ఔషధాన్ని ప్రారంభించడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం మరియు మధుమేహానికి సూచించబడిన మందులను కూడా క్రమపద్దతిలో తీసుకుంటూ ఉండాలి. ఈ గృహనివారణా వైద్యాలు, మందులతో పాటుగా సహాయం చేస్తాయని గుర్తుంచుకోండి. మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేనివి.

అంతేకాకుండా, మీ వైద్యుడు సూచించిన ఆహార ప్రణాళిక మరియు వ్యాయామ నియమాలను అనుసరించడం ముఖ్యం, ఎందుకంటే మధుమేహం పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనశైలితో మాత్రమే నియంత్రించబడుతుంది.

మధుమేహ రోగుల రక్తంలో చక్కర స్థాయిల నియంత్రణకు సహాయపడే నైజీరిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉన్నట్లుగా చెప్పబడింది.


ఈ నైజీరిసిన్ రక్తం నుండి చక్కెరను శోషించడానికి, కణాల సామర్ధ్యాన్ని పెంచుతుంది మరియు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. క్రమంగా మధుమేహం యొక్క లక్షణాలను నియంత్రిస్తుంది.

Natural Remedies For Diabetes

తయారుచేసే పద్ధతి:

వేడి నీటిలో, లవంగాలను వేసి 15 నిమిషాల అలాగే ఉండనివ్వండి. తర్వాత, నీటిని వడకట్టి, నీటి నుండి లవంగాలను వేరు చేయండి.

ఒక గ్లాసులో నీటిని సేకరించండి.

అల్పాహారం తర్వాత ప్రతిరోజూ ఉదయం ఈ నీటిని సేవించండి. ఉత్తమ ఫలితాలకై కనీసం మూడు నెలలు ఈ పద్దతిని అనుసరించండి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Natural Remedies For Diabetes

Diabetes is a common yet deadly disease, which cannot be cured, but can be controlled. There is a home remedy which can help control the blood sugar levels in diabetic patients. This remedy includes cloves. Learn how it is prepared here.
Desktop Bottom Promotion