For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ ఉన్న వారితో అందులో పాల్గొంటే షుగర్ వస్తుందా? పిల్లలకూ షుగర్ వస్తుందా?

నాకు షుగర్ ఉందని తెలిసిన దగ్గర నుంచి నేను మా ఆయనతో అందులో కలవడం లేదు. కొన్ని రోజులుగా దానికి దూరంగా ఉంటున్నాం. ఒక వేళ కలిసిన మా ఆయన కండోమ్స్ ఉపయోగిస్తాడు. షుగర్ ఉన్న వారితో అందులో పాల్గొంటే షుగర్.

|

ప్రశ్న : నా వయస్సు ముప్పై ఏళ్లు. మా ఆయన వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు. నేను ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళ్తే అక్కడి అన్ని రకాల టెస్ట్ లు చేశారు. నాకు షుగర్ ఉన్నట్లు తేలింది. మేము లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసుకుందామనుకున్నాం. మాకు ఇంత వరకు పిల్లలు లేరు. మా ఆయనేమో పిల్లలు కావాలంటున్నాడు.

అందులో పాల్గొనడం లేదు

అందులో పాల్గొనడం లేదు

నాకు షుగర్ ఉందని తెలిసిన దగ్గర నుంచి నేను మా ఆయనతో అందులో పాల్గొనడం లేదు. కొన్ని రోజులుగా దానికి దూరంగా ఉంటున్నాం. ఒక వేళ కలిసిన మా ఆయన కండోమ్స్ ఉపయోగిస్తాడు. కానీ ఇప్పుడు మా ఆయన కండోమ్ యూజ్ చేయకుండా అందులో పాల్గొంటాను అంటున్నాడు.

షుగర్ ఉన్న వారితో సెక్స్ చేస్తే

షుగర్ ఉన్న వారితో సెక్స్ చేస్తే

అలా చేస్తే ఇబ్బందులపడే అవకాశం ఉందా? షుగర్ ఉన్న వారితో సెక్స్ చేస్తే వారికి కూడా షుగర్ వస్తుందని నా స్నేహితురాలు చెప్పింది. అలాగే పిల్లలకు కూడా షుగర్ వస్తుందని చెప్పింది. ఇది నిజమా. అలాగే షుగర్ ఉన్న వారికి సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. సెక్స్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి. షుగర్ ఉన్న వారితో అందులో పాల్గొంటే నిజంగా షుగర్ వస్తుందా? పిల్లలకూ షుగర్ వస్తుందా? నా సందేహాలకు సమాధానం చెప్పగలరు.

సెక్స్ లో పాల్గొంటే షుగర్ అస్సలు రాదు

సెక్స్ లో పాల్గొంటే షుగర్ అస్సలు రాదు

సమాధానం : ముందుగా మీరు షుగర్ గురించి అవగాహన పెంచుకోవాలి. షుగర్ అంటువ్యాధి కాదు. సెక్స్ లో పాల్గొంటే షుగర్ అస్సలు రాదు. షుగర్ మీ ఆహారపు అలవాట్ల ద్వారా, జన్యపరంగా ఏర్పడే కొన్ని సమస్యల వల్ల మరికొన్ని కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సెక్స్ వల్ల ఒకరి నుంచి ఇది మరొకరికి సంక్రమించదు.

సెక్స్ లో పాల్గొనండి

సెక్స్ లో పాల్గొనండి

మీరు మీ ఆయనతో సెక్స్ లో పాల్గొనండి, ఏమీ కాదు. అయితే పిల్లల విషయంలో మాత్రం మీరు గైనాకాలజిస్ట్ ని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఉన్న షుగర్ ని అదుపులోకి తెచ్చుకున్న తర్వాతే మీరు గర్భం పొందితే బాగుంటుంది. లేదంటే కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కాస్త బరువు తగ్గాలి.

నేరుగా డాక్టర్ని సంప్రదిస్తే

నేరుగా డాక్టర్ని సంప్రదిస్తే

ఈ విషయాలన్నింటి గురించి మీరు నేరుగా డాక్టర్ని సంప్రదిస్తే టెస్ట్ లు చేసి సూచనలు ఇస్తారు. షుగర్ కంట్రోల్ లో లేకుండా మీరు గర్భం ధరించడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపులో బిడ్డను మోసే శక్తితో పాటు ప్రసవసమయంలో ఏర్పడే ఇబ్బందులను మీరు తట్టుకోలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ముందడుగు వేయండి. ఇక షుగర్ ఉన్న వారికి రానురాను సెక్స్ కోరికలు తగ్గే అవకాశం ఉంది. అలాగే యోనిలో స్రవాలు కూడా ఊరవు. అందువల్ల లూబ్రికేట్స్ వాడడం మంచిది. షుగర్ తీవ్రత తక్కువగా ఉంటే ఈ సమస్యలు అంత పెద్దగా ఉండవు.

English summary

does diabetes affects intercourse

does diabetes affects intercourse
Desktop Bottom Promotion