For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహాన్ని తగ్గించే శక్తివంతమైన ఆహార పదార్ధాలు ఇవే

మధుమేహాన్ని తగ్గించే శక్తివంతమైన ఆహార పదార్ధాలు ఇవే

|

“నేషనల్ హెల్త్ కేర్ అండ్ ది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ” ప్రకారం, మధుమేహం అనేది ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వ్యాధి అనడంలో ఆశ్చర్యమే లేదు. ఇది అధిక ఉద్రిక్తత మరియు ఒత్తిడి ఫలితంగా సంభవించవచ్చు లేదా వంశపారంపర్య ప్రాతిపదికన కూడా కలుగవచ్చు. ఒక్కసారి మధుమేహానికి గురైతే దాని పర్యవసానాలు అత్యంత దారుణంగా ఉంటాయి. కనీసం చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని స్థితికి చర్మం చేరుకుంటుంది. తద్వారా ఏదైనా కీలకమైన ఆపరేషన్లు చేసే సందర్భంలో ఈ మధుమేహం ప్రధాన ఆటంకిగా పరిణమిస్తుంది కూడా. మధుమేహం వేరే ఇతర రోగాలకు కూడా కారణభూతమవుతుంది. మరియు శరీరంలో రోగ నిరోధక శక్తి ని పూర్తిగా హరిస్తుంది అనడంలో అనుమానమే లేదు.

కానీ ఏది ఏమైనప్పటికీ, మధుమేహంతో బాధపడుతున్న వారు, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ఉత్తమం. ఈ మధుమేహ నియంత్రణా చర్యలలో భాగంగా సరైన పద్ధతుల గురించిన అవగాహన లేకపోతే అనేక ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాoతకాలుగా మారే అవకాశాలు లేకపోలేదు.

Here Are 16 Best Foods To Control Diabetes

మధుమేహులు పొరపాటున చేసే ఒక తెలియని తప్పు కూడా ప్రమాదకరమైన పరిణామాలను కలిగజేస్తుంది. డయాబెటిస్ రోలర్ కోస్టర్ రైడ్ వంటిది, ఇది మీ ఆలోచనల స్థాయి లేదా అసహజ ఆహారపు అలవాట్లను బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.

డయాబెటిక్ రోగులు తరచుగా తీసుకునే ఆహారo విషయంలో ఎప్పుడూ ఒక గందరగోళంలో ఉంటారు. ప్రధాన లక్ష్యం మధుమేహం నియంత్రించడానికి కాదు, తీసుకునే ఆహారాలు మధుమేహానికే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా చూసుకోవలసి ఉంటుంది.

క్రింద ఇవ్వబడిన 11 ఉత్తమ ఆహారాలు మధుమేహం నియంత్రించడంలో సహాయపడతాయి మరియు మీరు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడంలో సహాయం చేస్తాయి.

ఫాటీ ఫిష్ :

ఫాటీ ఫిష్ :

కొవ్వు కలిగిన చేపలైన ఆంకోవీస్, సాల్మన్, హెర్రింగ్, మెకెరెల్, మరియు సార్డినెస్ డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరమైన ఆరోగ్యకర కొవ్వు చేపలలో కొన్ని. ఈ.పి.ఎ, మరియు డి.హెచ్.ఎ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో సమృద్దిగా ఉండే ఈ చేపలు హృదయస్థితిని కూడా కాపాడుతుంది మరియు మధుమేహం ఫలితంగా సంభవించే గుండె సంబంధిత సమస్యల అవకాశాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తనాళాలను సరిచేసే కణాలను కాపాడడంలో కూడా సహాయం చేస్తాయి, ధమనుల యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి మరియు వాపును తగ్గిస్తాయి .

ఆకు కూరలు :

ఆకు కూరలు :

ఆకు కూరలను తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు చాలా పోషకమైనవి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్ సి కలిగి ఉన్న కాలే, బచ్చలి కూర మరియు ఇతర ఆకు పచ్చని కూరగాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూచించబడినవి. రక్తంలోని చక్కెరల స్థాయిని తగ్గించడంలో లేదా నియంత్రించుటలో టైప్ - 2 మధుమేహ రోగులకు లేదా రక్తపోటుతో బాధపడుతున్నవారికి ఎంతగానో సహాయపడుతాయి. ఇవి మంటను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి మరియు జియాక్సాoథిన్ మరియు ల్యూటెన్ వంటి అనామ్లజనకాల యొక్క గొప్ప మూలంగా ఈ ఆకుకూరలు ఉన్నవి. ఈ అనామ్లజనకాలు కంటిశుక్లాలు మరియు మచ్చల క్షీణత నుండి మీ కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. ఈ కంటికి సంబంధించిన వ్యాధులు మధుమేహం స్థాయిలు పెరుగుట మూలంగా సంభవిస్తాయి.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

అత్యంత సాధారణమైన వంటింటి పదార్దాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చినచెక్క రక్తoలోని చక్కెరస్థాయిని తగ్గించడం మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సమర్థవంతమైన ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న రోగ నిరోధక తత్వ లక్షణాలు, టైప్-2 మధుమేహం మరియు ఊబకాయానికి సంబంధించిన ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను 3నెలల వ్యవధిలో వినియోగిస్తే, దీర్ఘకాల మధుమేహం యొక్క స్థాయిని నిర్ణయించే హెమోగ్లోబిన్ ఎ1సి ను నియంత్రించటానికి సహాయపడగలదు. ఇది టైప్-1 మధుమేహం స్థాయిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది, కాని దాని వినియోగం రోజువారీ 1 టీస్పూన్ కు పరిమితం చేయాలి.

గుడ్లు :

గుడ్లు :

గుడ్లు పిల్లల నుండి పెద్దవారి వరకు ఏ వ్యక్తైనా ఇష్టపడే ఆహారంలో ఒకటిగా ఉంది. ఇవి ప్రోటీన్ యొక్క గొప్ప వనరులు మరియు ఎక్కువ సేపు మీ కడుపుని ఆకలి లేకుండా శాంత పరచడానికి సహాయపడతాయి. రోజువారీ గుడ్లు తినడం ద్వారా, గుండె సంబంధిత వ్యాధులను సైతం నివారించవచ్చు అని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాకుండా, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుటకు, వాపు తగ్గించడానికి మరియు మంచి హెచ్.డి.ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచటానికి మరియు చెడు ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయం చేస్తాయి. జియాక్సాoథిన్ మరియు ల్యూటెన్ వంటి అనామ్లజనకాలు సమృద్దిగా ఉండే గుడ్లు కళ్ళను అనేక సమస్యలనుండి కాపాడగలదు.

పసుపు :

పసుపు :

పసుపు, సామాన్యంగా కనిపించే వంటింటి పదార్ధం, ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా , అనేక ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. పసుపు రంగులో ఉండే కుర్క్యుమిన్, రక్తo లోని చక్కెర స్థాయిలను, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇది మధుమేహం వలన ప్రభావితం అయ్యే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

గ్రీక్ యోగర్ట్ (పెరుగు) :

గ్రీక్ యోగర్ట్ (పెరుగు) :

రక్తo లోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి మరియు హృద్రోగం సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఈ గ్రీక్ యోగర్ట్ తినడం వలన దాని ప్రోబయోటిక్స్ కంటెంట్ ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ పాల పదార్ధం ఊబకాయం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది అంతే కాకుండా టైప్ 2 డయాబెటిక్ రోగుల శరీరo తిరిగి పుంజుకునేలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా, పెరుగు కంటే గ్రీక్ యోగర్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ప్రోటీన్ కలిగి ఉండడం వలన ఆకలి మీదకు దృష్టి వెళ్ళకుండా చూడగలదు.

నట్స్ లేదా తృణ ధాన్యాలు :

నట్స్ లేదా తృణ ధాన్యాలు :

హాజెల్ నట్స్, బాదం, పెకాన్, బ్రెజిల్ నట్స్, పిస్తా పప్పులు, జీడిపప్పు, మకాడమియా, మరియు అక్రోట్లను మీ మధ్యాహ్న స్నాక్స్ ప్రణాళికలో భాగంగా తీసుకోవడం మూలంగా ఎన్నో ఫలితాలను పొందగలరు. ఇవి ఫైబర్ యొక్క గొప్ప వనరులుగా ఉండడమే కాకుండా తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఈ గింజలు రోజువారీ వినియోగం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మరియు వాపు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంలో, మరియు ఇన్సులిన్ స్థాయిని తగ్గిoచడంలో సహాయ పడగలవని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ :

ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ :

ఒలిక్ ఆమ్లం యొక్క గొప్ప మూలం, ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. టైప్-2 డయాబెటిస్ రోగులకు ఆరోగ్యకర కొలెస్ట్రాల్ స్థాయిని మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ నూనె యొక్క వినియోగం జి.ఎల్.పి -1 హార్మోన్ల పెరుగుదలను చూపించింది. తద్వారా గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గించినట్లుగా అనేక నివేదికల సారాంశం. ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె కూడా పాలిఫేనోల్స్ యొక్క గొప్ప వనరుగా ఉంది. ఇది రక్తనాళాలకు అనుసంధానించబడిన కణాలను కాపాడడంతో పాటు, వాపు మరియు రక్తపోటును తగ్గిస్తుంది. మరియు చెడు క్రొవ్వుల స్థాయిని తగ్గించే ఒక ప్రతిక్షకారిణిగా చెప్పబడింది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం మంచి ఎంపిక. పిండి పదార్ధాలతో కూడిన భోజనంతో కలిపి దీనిని తీసుకున్న ఎడల, ఆపిల్ సైడర్ వెనిగర్ దాదాపు 20% రక్తoలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. నిద్రకు ముందు రెండు టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి 6% తగ్గింపుకు దారి తీస్తుంది. అంతేకాకుండా, ఇది సంపూర్ణతో కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది మరియు గ్యాస్ట్రోపరేసిస్ యొక్క సంభవనీయతను నిరోధిస్తుంది. ఈ గ్యాస్ట్రోపరేసిస్ ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ రోగులకు సాధారణంగా కలిగే సమస్య (ఖాళీ కడుపుతో ఉన్న ఎడల). అందువలన, దైనందిక చర్యలో భాగంగా ఒక గాజు నీటిలో, వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ జోడించి తీసుకోవడం ఉత్తమం.

స్ట్రాబెర్రీలు :

స్ట్రాబెర్రీలు :

యాంటీఆక్సిడెంట్ ఆంథోసియనిన్లతో సమృద్ధమైన, స్ట్రాబెర్రీస్ అత్యంత పోషక పదార్ధాలు కలిగిన పండ్లలో ఒకటి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ భోజనం తర్వాత ఇన్సులిన్ స్థాయిని మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇది గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరియు టైప్ 2 డయాబెటిస్ రోగులకు రక్తo లోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. స్ట్రాబెర్రీస్ విటమిన్ సి కూడా కలిగి ఉంటాయి, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అదనపు ఇన్ఫ్లమేటరీ(మంటను తగ్గించే) ప్రయోజనాలను అందిస్తుంది.

వెల్లుల్లి :

వెల్లుల్లి :

అపారమైన పోషక ప్రయోజనాలతో ఉన్న వంటింటి పదార్ధాలలో వెల్లుల్లి ఒకటి. ఆహారoలో రుచిని పెంచడమే కాకుండా, టైప్ 2 డయాబెటిస్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయి, వాపు మరియు చెడు క్రొవ్వులను నియంత్రిoచడంలో సహాయం చేస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తీసుకోవడం ద్వారా రక్తపోటు స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి రక్తo లోని చక్కెరల స్థాయిని నియంత్రించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు. మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల ఫలితంగా ప్రభావితమైన ఇతర అవయవాలను కూడా కాపాడతాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.

English summary

Here Are 11 Best Foods To Control Diabetes

People get diagnosed with diabetes because of heridity or due to excess stress, etc. Diabetics are advised to include these 16 foods in the diet: Fatty fish, green leafy vegetables, cinnamon, eggs, chia seeds, turmeric, Greek yogurt, nuts, broccoli, extra-virgin olive oil, flax seeds, apple cider vinegar, strawberries, garlic, squash and Shirataki noodles.
Story first published:Wednesday, May 9, 2018, 16:42 [IST]
Desktop Bottom Promotion