For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చేసే సాయం ..!

మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చేసే సాయం ..!

|

మీలో ఎవరైనా ఒక గ్లాసు చల్లని జామ పండ్ల రసంతో రోజును ప్రారంభించడానికి ఇష్టపడే వారున్నారా? ఇది నిజానికి ఆరోగ్యకరమైన అలవాటని నిపుణులు సూచిస్తున్నారు! మరియు మన పూర్వీకుల నుండి జామ పండును అనేక వ్యాధులకు విరుగుడుగా కూడా వినియోగిస్తున్నారని మనకు తెలుసు. ముఖ్యంగా అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలకై.

రోజులో మొదటగా, అనామ్లజనకాలు, పోషకాలు మరియు ఫైబర్ కూడుకుని ఉన్న పండ్ల రసాలు (పంచదార లేకుండా) తీసుకోవడం ద్వారా, మీ ఆరోగ్యం మెరుగవుతుందని అనేక అధ్యయనాలలో తేలిన నిజం.

Here Is How Guava Leaves Help People With Diabetes!

ముఖ్యంగా వీటిలో జామ పండ్ల రసం ఆరోగ్యకరమైనది, ఎందుకంటే జామ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పుష్కలంగా నిండి ఉంటుంది. నిజానికి, మన వంట గదిలో కనిపించే సహజ పదార్ధాలు, మరియు మన తోటలలో పెరిగే మొక్కలలో శక్తివంతమైన పోషకాలు నిండి ఉండడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కేంద్రంగా ఉంటాయి.

అనేక వ్యాధులు మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలు, ముఖ్యంగా జీవనశైలి సంబంధిత వ్యాధులను తేలికగా దొరికే సహజ సిద్దమైన పదార్థాలను ఉపయోగించి చికిత్స చేయవచ్చు. అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే సహజ ఔషధాల తయారీలలో పండ్లు మరియు కూరగాయలు మాత్రమే కాకుండా ఆకులు, వేర్లు, కాండం వంటి మొక్కల యొక్క ఇతర భాగాలను కూడా ఉపయోగిస్తారు.

జామ ఆకులు మధుమేహం ఉన్నవారికి చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాక, వాటి లక్షణాలను నిర్వహించడంలో కూడా సహాయపడతాయని ఇటీవలి పరిశోధనలలో తేలింది. మధుమేహం గల వ్యక్తులకు జామ ఆకులు ఎలా సహాయపడగలవో తెలుసుకోండి.

అసలు మధుమేహం అంటే ఏమిటి?

అసలు మధుమేహం అంటే ఏమిటి?

మనకు తెలుసు, ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక వ్యాధులను ఎదుర్కొంటాడని. వాటిలో కొన్ని ఎటువంటి ప్రత్యేక కారకాన్ని కలిగి ఉండకపోయినా, కొన్ని వ్యాధులు మాత్రం వంశపారంపర్యత, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, గాయాలు, అనారోగ్యకరమైన జీవనశైలి, అవయవ లోపాలు వంటి అనేకములైన ఇతర కారణాల వలన కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి.

డయాబెటిస్ అనేది వంశపారంపర్యత, అనారోగ్యకరమైన జీవనశైలి, ప్రమాదాలు వంటి పలు అంశాల కారణంగా వస్తుందని చెప్పవచ్చు. ఒక్కోసారి పుట్టుకతోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్సులిన్ హార్మోన్ యొక్క అసమతుల్యత, శరీరంలోని రక్తంలోని చక్కెర నిల్వల అసమతుల్యతకు కారణంగా పరిణమిస్తుంది. ఒక జీవక్రియ సంబంధిత వ్యాధిగా ఈ మధుమేహాన్ని నిర్వచించవచ్చు.

మధుమేహంలో అనేక రకాలు ఉన్నాయి, ఇది లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.

క్లోమ గ్రంధి అతి తక్కువ ఇన్సులిన్ విడుదల చేసినా, లేదా అసలు ఇన్సులిన్ హార్మోనును ఉత్పత్తి చేయకపోయినా టైప్ 1 డయాబెటిస్ వస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరగడం మూలంగా , ఇన్సులిన్ రక్తంలోని చక్కెరల స్థాయిలను క్రమబద్దీకరించలేని పక్షంలో టైప్ 2 మధుమేహం వస్తుంది.

గర్భాశయ మధుమేహం అనేది కూడా మధుమేహం యొక్క రకంగా చెప్పబడింది, తాత్కాలికంగా కొంతమంది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తుంది. అయితే జువనైల్ మధుమేహం మాత్రం పిల్లలపై ప్రభావం చూపిస్తుంది.

మధుమేహం యొక్క లక్షణాలు అధిక దాహం, దీర్ఘకాలిక అలసట, మూత్ర సంబంధిత సమస్యలు(తరచూ మూత్రం వస్తున్న అనుభూతి), ఆకలి లేకపోవడం, మరియు బరువు కోల్పోవడం, అస్పష్టమైన దృష్టి, గాయం తగ్గడంలో ఆలస్యం, లిబిడో కోల్పోవడం మొదలైనవిగా ఉన్నాయి.

మధుమేహానికి పూర్తి నివారణా వైద్యం అయితే ఇప్పటికీ లేదు. కేవలం లక్షణాల ఆధారితంగా ఇన్సులిన్ హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ వైద్యులు సూచించిన మందులతో క్రమబద్దీకరించడమే నేటికీ జరుగుతూ ఉంది. మందులతో పాటు సహజ నివారణా చర్యలు మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలి మార్పుల సహాయంతో దాని లక్షణాలను మరికొంతమేర నియంత్రించవచ్చు, క్రమంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జామ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:

జామ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:

భారతదేశం వంటి అనేక ఉష్ణ మండల దేశాల్లో ఈ జామ మొక్క సాధారణంగా కనిపిస్తుంది మరియు దీని రుచి అనేక మందిని ఆకర్షిస్తుంది కూడా. ఇంతకు ముందు అనేక వ్యాసాలలో జామ పండు గురించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనం తెలుసుకున్నాం. ఈ వ్యాసంలో జామ ఆకుల గురించిన వివరాలను తెలుసుకుంటాము.

ఈ జామ చెట్టు ఆకులు, డయేరియా చికిత్సకు, ఊబకాయం చికిత్సకు, వాపును మరియు మంటను తగ్గించడంలో, అధిక కొలెస్ట్రాల్ తగ్గుదలలో, ఉదర క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కొన్ని అధ్యయనాల ద్వారా జామ ఆకులు మధుమేహ చికిత్సకు కూడా దోహదపడుతున్నాయని తేలింది; ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

జామ ఆకులు డయాబెటిస్ చికిత్సలో ఎలా ఉపయోగపడుతాయి:

జామ ఆకులు డయాబెటిస్ చికిత్సలో ఎలా ఉపయోగపడుతాయి:

న్యూట్రిషన్ & మెటాబోలిజమ్ జర్నల్లో ప్రచురించబడిన ఒక పరిశోధనా అధ్యయనంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహం చికిత్స చేయవచ్చని భావిస్తున్నారు. జామ ఆకులలో, అల్ఫా- గ్లూకోసిడేస్ గా పిలువబడే శరీరంలోని ఒక ఎంజైమ్ చర్యను తగ్గించగల పదార్ధాలు ఉన్నాయని ఈ అధ్యయనం వివరించింది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఆహారంగా మార్చుటలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించగలదని నివేదికల సారాంశం.

ప్రతి భోజనంతో పాటుగా జామ ఆకులను నేరుగా కాని, లేదా దాని సారాన్ని తీసుకోవడం ద్వారా కానీ, రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించగలదు. ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి, ఆ చక్కర స్థాయిలను తగ్గించే క్రమంలో జామ ఆకులు సహాయం చేయగలవు. మధుమేహం చికిత్సలో ఎటువంటి దుష్ప్రభావాలు లేని చికిత్సగా ఉన్నప్పటికీ,. ఈ చికిత్సను ప్రారంభించడానికి ముందు మీ వైద్యునితో మాట్లాడటం చాలా ముఖ్యం.

ఈ వైద్యం పాటు, మధుమేహానికి సంబంధించిన మందులను కూడా కొనసాగించాలి, మీ వైద్యుడు మందులను ఆపవచ్చని చెప్పేదాకా. ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక మరియు సాధారణ వ్యాయామం కూడా అనుసరించవలసి ఉంటుంది.

తయారీ పద్ధతి:

తయారీ పద్ధతి:

4-5 తాజా జామ ఆకులు సేకరించండి. వాటిని బాగా కడిగి, ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో వేయండి. 5 నిమిషాలు కాచిన తర్వాత, ఆకులను పక్కకు తీసివేయండి. ప్రతి భోజనం తర్వాత ఈ నీటిని తాగండి. లేదా శుభ్రం చేసిన ఆకులను నమలవచ్చు కూడా.

గమనిక: మధుమేహం ఉన్న గర్భిణీ స్త్రీలు వైద్యుని సంప్రదించకుండా ఈ చికిత్సను తీసుకొనరాదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత ఆసక్తికర అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Here Is How Guava Leaves Help People With Diabetes!

Diabetes is a dangerous metabolic disease which has no known cure; only its symptoms can be treated and kept under control. There are many natural remedies which can help reduce the symptoms of diabetes, if they are coupled with healthy lifestyle changes. A research study has found that guava leaves have the ability to treat diabetes; find out how.
Story first published:Tuesday, July 3, 2018, 17:56 [IST]
Desktop Bottom Promotion