For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహ నియంత్రణలో వేప ఏ విధంగా ఉపయోగపడుతుంది?

మధుమేహ నియంత్రణలో వేప ఏ విధంగా ఉపయోగపడుతుంది?

|

ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనాలు ప్రకారం, ప్రతి సంవత్సరం మధుమేహం మూలంగా, 1.6 మిలియన్ల మరణాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. 2030 నాటికి మధుమేహం, ప్రపంచవ్యాప్త మరణాలకు, ఏడవ అతిపెద్ద కారణం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

మధుమేహం ఒక దీర్ఘకాలిక, జీవక్రియ వ్యాధి. రక్తంలో గ్లూకోజ్ (లేదా రక్తంలో చక్కెర) స్థాయి పెరుగుతుంది. సకాలంలో తగిన చికిత్స తీసుకొని పక్షంలో గుండె, రక్త నాళాలు, కళ్ళు, మూత్రపిండాలు మరియు నరాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.

Neem For Diabetes: How Does The Wonder Herb Help Manage Blood Sugar Levels

మధుమేహం పట్ల అవగాహన లేమి మరియు ఆలస్యంగా నిర్ధారణ చేయడం వలన మధుమేహ నియంత్రణ కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆహార విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ నియంత్రణకు తీపి పదార్థాలు, పానీయాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ అస్సలు తీసుకోరాదు. మధుమేహాన్ని అదుపులో పెట్టడానికి, అధిక పీచుపదార్ధం, సంక్లిష్ట పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల సంతులిత మిశ్రమం కలిగిన ఆహారం తీసుకోవాలి.

మధుమేహాన్ని స్థిరంగా నియంత్రించడంలో

మధుమేహాన్ని స్థిరంగా నియంత్రించడంలో

మధుమేహాన్ని స్థిరంగా నియంత్రించడంలో ప్రముఖ పాత్రను పోషించే, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి, రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటానికి మెంతి విత్తనాలు ఉపయోగపడతాయి. వేప కూడా మధుమేహ నియంత్రణకు అద్భుతంగా తోడ్పడుతుందని ఖ్యాతి గాంచిన ఒక మూలిక.

వేప భారతదేశం అంతటా విస్తృతంగా పెరిగే ఒక ఉష్ణమండల వృక్షం.

వేప భారతదేశం అంతటా విస్తృతంగా పెరిగే ఒక ఉష్ణమండల వృక్షం.

వేప భారతదేశం అంతటా విస్తృతంగా పెరిగే ఒక ఉష్ణమండల వృక్షం. వేప చెట్లు దాదాపు 30-50 అడుగుల ఎత్తు ఎదుగుతాయి. దీనిలో ప్రతి భాగానికి అద్భుతమైన క్రిమిసంహారక మరియు ఔషధ గుణాలు ఉంటాయి.

వేప మొక్క అనాదిగా భారతీయ మరియు చైనీస్ చికిత్స విధానాలలో అంతర్భాగమైనది.

వేప మొక్క అనాదిగా భారతీయ మరియు చైనీస్ చికిత్స విధానాలలో అంతర్భాగమైనది.

వేప మొక్క అనాదిగా భారతీయ మరియు చైనీస్ చికిత్స విధానాలలో అంతర్భాగమైనది. ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు వంటి వేప చెట్టులోని వివిధ భాగాలు- సంప్రదాయ చికిత్సా విధానంలో, వాపు, నొప్పి, అంటువ్యాధులు, జ్వరం, చర్మ వ్యాధులు లేదా దంత రుగ్మతలు వంటి వివిధ రకాల అనారోగ్యాలను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం,

కొన్ని అధ్యయనాల ప్రకారం,

కొన్ని అధ్యయనాల ప్రకారం, అజాడిరక్తా ఇండికా (వేప) లో ఉండే కొన్ని సమ్మేళనాలు, రక్తంలోని చక్కెరను నియంత్రించి, డయాబెటిస్ మెల్లిటస్ కు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వేప ఈ వ్యాధిని అరికట్టేందుకు మరియు ఆరంభాన్ని వాయిదా వేయడంలో సహాయ పడుతుంది. స్టడీస్ ఆఫ్ ఎథ్నో-మెడిసిన్ జర్నల్ లో, వేప-ఆకు పొడి ఇన్సులిన్ మీద ఆధారపడని పురుష మధుమేహ వ్యాధిగ్రస్తులలో, మధుమేహ లక్షణాలను నియంత్రిస్తుందని గుర్తించారు.

డయాబెటిస్ ఉన్న వారు

డయాబెటిస్ ఉన్న వారు

డయాబెటిస్ ఉన్న వారు వేప షర్భత్ తీసుకోవచ్చు లేదా గుప్పెడు వేప ఆకులను తినవచ్చు.రక్తంలో చక్కెర స్థాయిలను వేప నియంత్రించగలదని ధృవీకరించడానికి, మరికొన్ని అధ్యయనాలు అవసరం అవుతాయి. కానీ నిపుణుల అభిప్రాయాలు, ఈ అద్భుత ఔషధానికి అనుకూలంగా ఉన్నాయి. మీకు మధుమేహం ఉంటే, పాటురోజు వేపే షెర్బత్ ను తాగవచ్చు లేదా గుప్పెడు వేప ఆకులను నమలవచ్చు. మీ ఆహారంలో వేపను భాగంగా చేసుకోవడానికి ముందు, డయాబెటాలజిస్ట్ ను సంప్రదించండి. వేప ఆకులను అతిగా తినడం వలన హైపోగ్లైసెమిక్ ప్రభావాలు పొడచూపవచ్చు.

వేప ఆకులలో

వేప ఆకులలో

వేప ఆకులలో ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పినాయిడ్లు, యాంటీ వైరల్ కాంపౌండ్స్ మరియు గ్లైకోసైడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు గ్లూకోజ్లో ఎటువంటి పెరుగుదల లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది.

మధుమేహ నివారణకు ఉపయోగపడే వేప కషాయాన్ని ఎలా తయారు చేయాలి?:

మధుమేహ నివారణకు ఉపయోగపడే వేప కషాయాన్ని ఎలా తయారు చేయాలి?:

మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చేదుగా ఉండే ఆహార పదార్థాలను తినమని సిఫార్సు చేస్తారు.

నిపుణుల అభిప్రాయం అనుసారం, వేప రసంలో మధుమేహ లక్షణాలను నియంత్రించే కొన్ని పదార్థాలను కలిగి ఉంటుంది.

1. ఇరవై వేప ఆకులను అర లీటరు నీటిలో వేసి సుమారు 5 నిమిషాలు పాటు మరగనివ్వాలి.

2. ఆకులు మెత్తగా మారి, నీరు క్రమంగా గాఢమైన ఆకుపచ్చ రంగులోకి మారడాన్ని గమనించవచ్చు.

3. ఈ నీటిని వడగట్టి, ఒక గ్లాసులో తీసుకుని కనీసం రోజుకు రెండుసార్లు త్రాగాలి.

English summary

Neem For Diabetes: How Does The Wonder Herb Help Manage Blood Sugar Levels

Neem is a tropical plant that grows extensively across India. Neem trees are nearly 30-50 feet high, and almost every part of the tree is profuse with antiseptic and healing properties. Neem has been an integral part of Indian and Chinese medicine since time immemorial. Almost all parts of the neem tree- leaves, flowers, seeds, fruits, roots and bark have been used traditionally for a variety of treatments; be it inflammation, infections, fever, skin diseases or dental disorders. Some studies have claimed that certain compounds of Azadirachta indica (Neem) could be of benefit in diabetes mellitus in controlling the blood sugar.
Desktop Bottom Promotion