For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రిడయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ జరిగినవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

|

రక్తంలో, సాధారణం కన్నా గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉన్నప్పటికీ, మధుమేహంగా నిర్ధారించడానికి అవసరమైనంత అధికంగా లేనప్పుడు, ఆ పరిస్థితిని ప్రిడయాబెటిస్ గా పేర్కొంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోని ఎడల, ఇది టైప్ 2 డయాబెటిస్ గా పురోగతి చెందే ప్రమాదం ఉంది.

ప్రిడయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ జరిగినవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

ప్రిడయాబెటిస్ కలిగి ఉండి కూడా, జీవనశైలి మార్పులను చేసుకోకపోతే, అది 10 సంవత్సరాలలో టైప్ 2 మధుమేహంగా మారవచ్చు. అందువల్ల, ప్రిడయాబెటిస్ ఉన్నవారు ముందుగా వైద్యుని సంప్రదించి, వారు సూచించిన ఆహార మరియు జీవనశైలి మార్పులను చేసుకోవాలి.

ప్రిడయాబెటీస్ ను నిర్ధారణ చేయటం:

ప్రిడయాబెటీస్ ను నిర్ధారణ చేయటం:

రక్తంలోని మూడు నెలల సగటు చక్కెర స్థాయిలను తెలియజేసే HbA1c పరీక్షను ప్రిడయాబెటీస్ నిర్ధారణకై సూచిస్తారు. దీనిని ఉపవాస అనంతరం చేయవలసిన అవసరం లేదు. ప్రిడయాబెటీస్ వ్యాధిగ్రస్తులలో, HbA1c విలువ 5.7 మరియు 6.4 శాతం మధ్యలో ఉంటాయి. అధిక A1c ఫలితం, అధిక టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని సూచిస్తుంది.

ఉపవాసంతో కూడా రక్తంలోని చక్కెర పరీక్ష చేయవలసి ఉంటుంది. దీని కొరకు, ఎనిమిది గంటలు లేదా ఒక రాత్రంతా ఉపవాసం చేయాలి. రక్తంలో చక్కెర స్థాయి డెసీ లీటర్ కు 100 నుండి 125 మి.గ్రా ఉంటే, మధుమేహంను సూచిస్తుంది.

మధుమేహంలో రకాలు:

మధుమేహంలో రకాలు:

మధుమేహంలో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. టైప్ 1 మధుమేహం మరియు టైప్ 2 డయాబెటిస్.

టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో, రోగనిరోధక వ్యవస్థ క్లోమంపై దాడి చేసి బీటా కణాలను నాశనం చేయడం వలన, ఇన్సులిన్ తక్కువగా లేదా పూర్తిగా లేకుండా పోతుంది. అందువల్ల, శరీరం శక్తి ఉత్పత్తి కొరకు చక్కెరలను వినియోగించుకోలేదు, కనుక రక్తంలో చక్కెర నిలువలు పెరిగిపోతాయి. మధుమేహం ఈ రకమైన మధుమేహం ఎక్కువగా బాల్యంలో లేదా యుక్త వయసులో అభివృద్ధి చెందుతుంది.

ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను శరీరం వినియోగించుకోలేకపోయినా, లేదా ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి చేయలేకపోయినా, టైప్ 2 మధుమేహం వస్తుంది. దీనివల్ల, రక్తంలో చక్కెర శక్తిగా మారకపోవడం వలన నిల్వలు పెరిగిపోతాయి. మధుమేహంతో బాధపడుతున్న 90 శాతం మంది, ఈ వర్గంలోకి వస్తారు. టైప్ 2 మధుమేహం ఎక్కువగా పెద్దలలో సంభవిస్తుంది.

ప్రీడయాబెటీస్ మరియు టైప్ 2 డయాబెటిస్ కు మధ్య తేడా:

ప్రీడయాబెటీస్ మరియు టైప్ 2 డయాబెటిస్ కు మధ్య తేడా:

• ప్రిడయాబెటీస్, టైప్ 2 డయాబెటిస్ కు ఒక హెచ్చరిక. మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనే సూచనగా గుర్తించాలి.

• టైప్ 2 మధుమేహం సమయంతో పాటు నెమ్మదిగా సంభవిస్తుంది.

• ప్రిడయాబెటీస్ ను జీవనశైలి మరియు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కానీ, టైప్ 2 డయాబెటీస్ పూర్తిగా నయం చేయబడదు. దీని నియంత్రణకై, జీవనశైలిలో మార్పులు మాత్రమే ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా మందులు వాడటం అవసరం.

ప్రిడయాబెటీస్ ను ప్రేరేపించే కారకాలు:

ప్రిడయాబెటీస్ ను ప్రేరేపించే కారకాలు:

ప్రిడయాబెటిస్ ఎవరిలోనైనా సంభవించవచ్చు. దీనిని కలిగించే కొన్ని ప్రధాన ప్రమాద కారకాల గురించి ఈ క్రిందన తెలియజేస్తున్నాం:

• 45 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగి, 25 కన్నా ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కలిగి ఉన్నవారు, ప్రిడయాబెటీస్ ఉనికిని పరీక్షించుకోవాలి.

• మీ నడుము చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుని ఉంటే (ఆడవారికి 35 అంగుళాలు, మగవారికి 40 అంగుళాలు లేదా అంతకన్నా ఎక్కువ)

• సెడెంటరీ జీవనశైలి

• అధిక బరువు కలిగి ఉండటం

• జన్యు కారణాలు

• PCOS (పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్)

• ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అధికంగా తినడం

ప్రిడయాబెటిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:

ప్రిడయాబెటిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:

ప్రిడయాబెటిస్ కు ఖచ్చితమైన లక్షనాలంటూ ఉండవు. తరచుగా, ప్రిడయాబెటిస్ యొక్క నిర్ధారణ, వైద్య పరీక్షలలో లేదా సాధారణ రక్త పరీక్షల ద్వారా జరుగుతుంది. కొన్నిసార్లు, మెటికలు, మోచేతులు, మోకాళ్లు మరియు మెడ వద్ద చర్మం నల్లబడటం మనం గమనించవచ్చు. ఇవి ప్రిడియబెటిస్ యొక్క ముందస్తు సూచనలు కూడా కావచ్చు.

 ప్రిడయాబెటిక్స్ లో కనిపించే కొన్ని గుర్తించదగిన లక్షణాలు:

ప్రిడయాబెటిక్స్ లో కనిపించే కొన్ని గుర్తించదగిన లక్షణాలు:

• అధిక బరువు ఉండటం

• మత్తుగా నిద్ర వస్తున్నట్లు ఉండటం

• నీరసం

• పొట్ట చుట్టూ బరువు పెరగటం

దాహం పెరగటం, దృష్టి మసకబారడం, తరచూ మూత్రవిసర్జన కావడం మరియు అలసట వంటి లక్షణాలను కనిపిస్తున్నట్లైతే, ప్రిడియాబెటీస్, టైప్ 2 డయాబెటిస్ గా పురోగతి సాధించిందనడానికి సంకేతం.

నివారణ:

నివారణ:

కాస్తంత ప్రయత్నం చేస్తే ప్రిడయాబెటీస్ ను నివారించవచ్చు. ప్రిడియబెటిస్ కు చేసే చికిత్స కూడా దాని నివారణగా పరిగణించబడుతుంది. వ్యాయామం, యోగ మరియు ధ్యానం వంటి జీవనశైలి మార్పులు, ఈ పరిస్థితిని నివారించడానికి సహాయపడతాయి.

ఆహార మార్పులు: ప్రిడయాబెటీస్ డైట్ ను అనుసరించాలి.

ఆహార మార్పులు: ప్రిడయాబెటీస్ డైట్ ను అనుసరించాలి.

• అధిక పీచుపదార్ధం కలిగిన ఆహారాన్ని తీసుకోండి.

• మీ ఆహారంలో, మరిన్ని పండ్లు మరియు కూరగాయలను భాగంగా చేసుకోవాలి.

• వారానికి రెండుసార్లు చేపలను తినాలి.

• మాంసకృత్తులు మరియు మాంసాహారం మధ్యస్థంగా తీసుకుంటే చాలా మంచిది. ఏదేమైనా, వృక్షాధారిత ప్రోటీన్లు, మటన్ మరియు చికెన్ కు మంచి ప్రత్యామ్నాయం.

• ఆహారాన్ని నూనెలో వేయించకూడదు. బేకింగ్, స్టీమింగ్ లేదా గ్రిల్లింగ్ చేసుకుని తింటే మంచిది.

• నీరు, లేత కొబ్బరి నీరు మరియు ఇతర సహజ పానీయాలు పుష్కలంగా త్రాగాలి. జ్యూసులు మరియు శీతల పానీయాలు త్రాగరాదు.

• మద్యంను పరిమితంగా తీసుకోవాలి .

• శుద్ధి చేయబడిన పిండిపదార్ధాలను నివారించండి.

• చిన్న మొత్తాలను తినండి మరియు రెండవ సారి వడ్డనను నివారించండి.

. చిరుతిళ్లుగా సలాడ్లు లేదా గింజల వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఎంపిక చేసుకోండి.

ఇతర నివారణ చర్యలు:

ఇతర నివారణ చర్యలు:

వ్యాయామం చేయడం ద్వారా, రక్తంలోని పిండిపదార్ధాలను ఉపయోగించుకునేట్టుగా చేసి

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి రోజంతా భౌతికంగా క్రియాశీలంగా ఉండటంపై దృష్టి పెట్టండి. భోజనం అనంతరం నడవడం, తోటపని, ఈత, బైకింగ్, ఆటలు ఆడటం, నృత్యం మొదలైన కార్యకలాపాలు చురుకుగా ఉంచేందుకు దోహదపడతాయి.

• కొంత బరువును తగ్గించుకునేందుకు కృషి చేయండి.

• వైద్యుని సలహా ప్రకారం ఔషధాలను పూర్తిగా తీసుకోవాలి.

• ధూమపానం వదిలేయడం.

• ఒత్తిడిని నియంత్రించడం.

• మద్యపానం చేయకపోవడం.

• కొన్నిసార్లు, ప్రత్యామ్నాయ మందులు మరియు ఇతర చికిత్సా విధానాలైన ఆక్యుపంక్చర్ మరియు ధ్యానం వంటివి చాలా సహాయపడతాయి.

• కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలకు, ప్రిడయాబెటిస్ మధ్య సంబంధం ఉన్నందున, వీటిని నియంత్రించడం కూడా ప్రిడయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుంది.

ఎందుకంటే ముగ్గురు అనుసంధానించబడినట్లు నమ్ముతారు.

• చురుకుగా ఉండటం, తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహార పదార్థాలు తినడం మరియు ఆరోగ్యకరమైన పద్ధతిలో ఒత్తిడి నియంత్రించడం ద్వారా, దీర్ఘకాలంలో ఈ పరిస్థితిని నివారించవచ్చు.

English summary

Prediabetes: Types, Signs, Symptoms, Diet and diagnosis

Prediabetes is a condition when your blood sugar levels show higher than normal values, but not high enough to be classified as diabetes. This condition is reversible if you follow a strict dietary regimen, exercise regularly and remain physically active, and also make other lifestyle modifications.
Story first published: Wednesday, August 22, 2018, 17:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more