Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
Drink Onion Juice for Diabetes: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగండి, డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది!
Drink Onion Juice for Diabetes: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగండి, డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది!
ప్రస్తుత జీవన శైలి ప్రకారం చాలా మంది డయాబెటిస్ బారీన పడుతున్నారు. స్థూలకాయం తర్వాత బహుశా మధుమేహం అనేది ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఒక్క సారి మధుమేహం వచ్చిందంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే ఆహార విషయంలో ఏ మాత్రం అశ్రద్ద ఉన్నా, రక్తంలో షుగర్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే ఆధారపడకుండా కొన్ని చిన్నపాటి హోం రెమెడీస్ కూడా మనకు తెలయకుండానే సహాయపడుతాయి. అలాంటి వాటిలో ఉల్లిపాయ రసం ఒకటి, దీన్ని ప్రతి రోజూ ఉదయం పరగడపుతో తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలను 50% వరకు తగ్గించవచ్చు. అంతే కాదు ఈ జ్యూస్ శరీరంలో యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గిస్తుంది. ఉల్లిపాయ తినడం కూడా బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, క్రోమియం, అల్లైల్ ప్రొఫైల్ డైసల్ఫైడ్, రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. మంచి వ్యాధినిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. 'హీలింగ్ స్పైసెస్' పుస్తకంలో, కొరియన్ శాస్త్రవేత్తల బృందం రక్తంలో చక్కెరను తగ్గించడానికి టైప్-2 డయాబెటిస్ ఉన్న జంతువులకు ఉల్లిపాయ రసం తినిపించిన తర్వాత, చక్కెర స్థాయిలు తగ్గడం ప్రారంభించాయి. దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని గుర్తించబడింది.

డయాబెటిస్ వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావంతంగా తగ్గించడానికి కారణం
1. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది:
ఉల్లిపాయలు, ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ విచ్ఛిన్నం మరియు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఫైబర్ మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఒక సాధారణ సమస్య అయిన మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

2. కార్బోహైడ్రేట్లు తక్కువ :
ఉల్లిపాయల్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలో దాదాపు 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. చక్కెర త్వరగా రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలను చేర్చుకోవాలని సూచిస్తుంటారు. అదనంగా, ఉల్లిపాయలు కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన బరువు తగ్గించే కార్యక్రమం కోసం సురక్షితంగా పరిగణించబడతాయి.

3. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ :
ఉల్లిపాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన కూరగాయ. పచ్చి ఉల్లిపాయలు 10 గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉల్లిపాయ రసం యొక్క ఇతర ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఉదయాన్నే పరగడుపున ఉల్లిపాయ నీళ్లు తాగితే మరింత మేలు జరుగుతుంది. ఎందుకంటే ఉదయం పూట జీర్ణవ్యవస్థ అంత యాక్టివ్‌గా ఉండదు. కాబట్టి ఉల్లిపాయ రసంతో రోజు ప్రారంభించడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది మరియు జీర్ణవ్యవస్థ కూడా తన పనిని సాఫీగా చేసుకోగలుగుతుంది.

జుట్టుకు కూడా ఎంతో మేలు
ఉల్లిపాయ నీరు ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని వారంలో రెండు రోజులు కూడా తలకు రాసుకుంటే జుట్టు పెరుగుదల, నాణ్యతలో తేడా కనిపిస్తుంది.

ఆహారంలో ఉల్లిపాయను ఎలా చేర్చుకోవాలి?
'ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ ఇన్‌సైట్స్' జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో తాజా ఉల్లిపాయల వినియోగం టైప్-1 మరియు టైప్-2 మధుమేహం రెండింటిలోనూ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని కనుగొంది. మీరు సూప్‌లు, సలాడ్‌లు, శాండ్‌విచ్‌లలో ఉల్లిపాయలను పచ్చిగా తినవచ్చు.

ఆనియన్ వాటర్ తయారీకి కావలసిన పదార్థాలు:
- 2 తరిగిన ఉల్లిపాయలు
- 1 కప్పు నీరు
- 1 టీస్పూన్ నిమ్మరసం
- 1 చిటికెడు రాక్ ఉప్పు
తయారుచేసే విధానం: అన్ని పదార్థాలను బ్లెండర్లో రుబ్బుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం, రాళ్ల ఉప్పు వేయాలి. ఉల్లిపాయల కాఠిన్యాన్ని తగ్గించడానికి ఉప్పు సహాయపడుతుంది. కావాలంటే చిటికెడు ఉప్పు, కొద్దిగా తేనె కలుపుకుని కూడా తాగవచ్చు.
నిరాకరణ: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానైనా ఏ ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
ఉల్లిపాయలను మీరు సూప్‌లు, సలాడ్‌లు, శాండ్‌విచ్‌లలో ఉల్లిపాయలను పచ్చిగా తినవచ్చు.
ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, క్రోమియం, అల్లైల్ ప్రొఫైల్ డైసల్ఫైడ్, రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే ఆధారపడకుండా కొన్ని చిన్నపాటి హోం రెమెడీస్ కూడా మనకు తెలయకుండానే సహాయపడుతాయి. అలాంటి వాటిలో ఉల్లిపాయ రసం ఒకటి, దీన్ని ప్రతి రోజూ ఉదయం పరగడపుతో తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలను 50% వరకు తగ్గించవచ్చు.



Click it and Unblock the Notifications