For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహగ్రస్థులు జామపండ్లు తినండి.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోండి

|

ఆధునిక యుగంలో మోడ్రన్ లైఫ్ స్టైల్లో ప్రైవేట్ డైట్ నుండి కమర్షియల్ డైట్ కు మారిపోయారు. ఈ మార్పు కారణంగా జీవనశైలి సంబంధిత వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా జీవనశైలికి సంబంధించిన వ్యాదుల్లో డయాబెటిస్ ఒకటి.

ఈ ప్రపంచం మొత్తంలో రోజు రోజుకి మధుమేహగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మధుమేహగ్రస్తులు పెరిగే సంఖ్య మన భారత దేశంలో ఎక్కువగా ఉంది. మధుమేహాం అంటే శరీరంలో చెక్కర పెరగడం కాదు, రక్తంలో ఇన్సులెన్స్ హెచ్చుతగ్గులకు కారణం. ప్యాంక్రియాస్ శరీరానికి సరిపడినంత ఇన్సులెన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఫలితంగా కణాల్లోకి షుగర్ నిల్వచేరకపోవడం వల్ల శరీరంలో దాని స్థాయి అసాధారణతకు దారితీస్తుంది. వాస్తవానికి అధికంగా షుగర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితికి కారణం అవుతుంది. అయితే ఇది దీర్ఘకాలంలో మాత్రమే ఒక దోషిగా బయటపడుతుంది. అందుకు కారణమయ్యే అంశాలు అనేకం ఉన్నాయి. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని ఆహారాలున్నాయి. మధుమేహగ్రస్తులు తీసుకునే ఆహారాల్లో అలాంటి ఆహారాలను జోడించడం వల్ల మధుమేహ లక్షణాలను నివారించడానికి గొప్పగా సహాయపడుతాయి.

డయాబెటిక్ డైట్ లో అత్యధిక పోషకాలున్న ఆహారంగా జామకాయను చెబుతారు. ఇవి వింటర్ సీజన్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. లైట్ గ్రీన్ కలర్లో సాఫ్ట్ గా కనిపించే ఈ పండు మధుమేహగ్రస్తులకి ఏవిధంగా బ్లడ్ షుగర్స్ ను నిర్వహిస్తుందో ఈ క్రింది కారణాలను బట్టి తెలుసుకుందాం...

మధుమేహగ్రస్తులకు జామకాయ ఏవిధంగా మంచిదో చూద్దాం:

మధుమేహగ్రస్తులకు జామకాయ ఏవిధంగా మంచిదో చూద్దాం:

1. జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)తక్కువగా ఉంటుంది. అంటే ఇది చాలా సులభంగా జీర్ణం అవుతుంది, రక్తంలోకి సులభంగా గ్రహించబడుతుంది మరియు గ్లూకోజ్ స్థాయిలను క్రమంగా పెరుగడానికి ప్రభావితం చేస్తుంది.

2. జామకాయలో పీచుపదార్థం అధికం

2. జామకాయలో పీచుపదార్థం అధికం

జామకాయలో పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి గొప్పగా పరిగణింపబడుతుంది. పీచు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దాంతో శరీరంలోని రక్తంలోకి గ్లూకోజ్ త్వరగా విడుదల చేయకుండా చూసుకుంటుంది.

3.జామకాయలో క్యాలరీలు తక్కువ

3.జామకాయలో క్యాలరీలు తక్కువ

జామకాయలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. అధిక బరువు రక్తంలో చెక్కర స్థాయిలు పెరగడానికి మరో కారకం. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA)నివేధిక ప్రకారం 100గ్రాముల జామకాయలో కేవలం 68 కేలరీలు మరియు సహజ చక్కర స్థాయిలు కేవలం 8.92 గ్రాములు మాత్రమే ఉంటుంది.

4. జామకాలో సోడియంయ తక్కువగా మరియు పొటాషియం ఎక్కువ

4. జామకాలో సోడియంయ తక్కువగా మరియు పొటాషియం ఎక్కువ

జామకాలో సోడియంయ తక్కువగా మరియు పొటాషియం ఎక్కువగా (100గ్రాములకు 417 గ్రాములు)ఉన్నాయి. కాబట్టి డయాబెటిక్ డైట్ లో ఖచ్ఛితంగా చేర్చుకోవాల్సిన పండు ఇది.

5.విటమిన్ సికి మంచి మూలం ఆరెంజ్ అనుకుంటే పొరపాటే

5.విటమిన్ సికి మంచి మూలం ఆరెంజ్ అనుకుంటే పొరపాటే

విటమిన్ సికి మంచి మూలం ఆరెంజ్ అనుకుంటే పొరపాటే , దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా జామకాయలో ఉన్నాయి. శరీరానికి కావల్సినంత రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలు వీటిలో పుష్కలం. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధితో పోరాడటానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

జామకాయలో పైన సూచించిన లక్షణాలతో పాటు, ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన అనేక ఇతర ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నారుగా మరి వీటిని పచ్చిగా నేరుగా తినండి లేదా పంచదార లేకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మరి ఈ శీతాకాలంలో జామకాయలను నిల్వచేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

English summary

Guavas For Diabetes: 5 Reasons Why You Must Eat More Guavas To Manage Blood Sugar

Guava's unique nutrient composition makes it an excellent food for a diabetes diet. The light green coloured fruit with soft, seeded pulp appears mostly in the winter season. Now, if you are wondering what makes guava a preferred fruit for managing blood sugar and handling diabetes, here are the reasons: