For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహగ్రస్థుల(డయాబెటిస్ ఉన్నవారికి )కి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్!!

మధుమేహగ్రస్థుల(డయాబెటిస్ ఉన్నవారికి )కి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్!!

|

మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి.

అల్పాహారం సేవించడంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్దీకరించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. దీంతోపాటు ఆకలికి సంబంధించిన హార్మోన్లకు సహాయకారిగా ఉంటుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అల్పాహారాన్ని సాధారణమైన హై కార్బోహైడ్రేట్ భోజనంలాంటి బ్రెడ్ తదితర వాటితో పూర్తి చేయవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు శరీరానికి కావల్సిన శక్తిస్తాయిలను అందిస్తాయి, దాంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయి నిలకడగా ఉంటుందని కొన్నిపరిశోధనల్లో తేలినట్లు న్యూట్రీషియన్ నిపుణులు తెలుపుతున్నారు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే మధుమేహం

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే మధుమేహం

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే మధుమేహం నుంచి బయటపడేందుకు మార్గమని, దీనిని నియంత్రించాలనుకుంటే అల్పాహారం ఉత్తమమైన మార్గమని వైద్యనిపుణుల సూచన. ఇంకా అల్పాహారం సేవిస్తే మధుమేహానికి సంబంధించిన బాధలు తొలగిపోతాయంటున్నారు. అల్పాహారంలోనున్న మోనో-సాచురేటెడ్ ఫ్యాట్ శరీరంలోని వ్యర్థపు కొవ్వు స్థాయిని నియంత్రించడంతో పాటు శరీరానికి ఉపయోగపడే కొవ్వును పెంచుతుంది. ఇది గుండెను కాపాడటంలో చాలా ఉపయోగపడుతుందంటున్నారు

అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం

అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం

అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చాలని నిర్ధారించుకోండి. పప్పుధాన్యాలు, కాయలు, గుడ్లు, మాంసం, పండ్లు, పాలు మరియు పాల ఉత్పత్తులలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆరోగ్య సంరక్షణ గురించి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది డయాబెటిస్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా అల్పాహారం సేవిస్తుంటే

క్రమం తప్పకుండా అల్పాహారం సేవిస్తుంటే

కార్బోహైడ్రేట్లున్న భోజనంతో పాటు అల్పాహారం సేవిస్తుంటే బ్లడ్ షుగర్ స్థాయిలో మార్పుంటుంది. క్రమం తప్పకుండా అల్పాహారం సేవిస్తుంటే శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయి త్వరగా తగ్గుముఖం పడుతుంది. అయితే మధుమేహం ఉన్న వారు ఎలాంటి ఆహారాన్ని అల్పాహారంలో తీసుకోవాలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

మేతీ పరోటా:

మేతీ పరోటా:

మెంతి ఆకుకూరను స్టఫ్ చేసిన రోటీలను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఎక్సలెంట్ ఫైబర్ కంటెంట్ అందుతుంది. పరాటా తయారీయి వెజిటేబుల్ ఆయిల్ ఉపయోగించడం మంచిది.

గుడ్డు:

గుడ్డు:

ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్డును డయాబెటిక్ వారు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. గుడ్డు ఫ్రై లేదా బాయిల్ ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఉడకబెట్టిన గుడ్డు ఉదయం టైమ్ సేవ్ చేయడమే కాదు, రోజంతా శరీరానికి కావల్సిన శక్తి అందిస్తుంది.

 పోహ:

పోహ:

ఎర్ర అటుకులకు కొద్దిగా పోహా జోడించి తీసుకోవడం వల్ల ఇది పొట్టను తేలికగా ఉంచడం మాత్రమే కాద, శరీరానికి కావల్సిన ఫైబర్ ను అందిస్తుంది. ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఇతర షుగర్ ఫుడ్ లేదా సాల్ట్ ఫుడ్స్ పై కోరిక కలగకుండా ఉంటుంది.

మొలకలు:

మొలకలు:

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయాలంటే మొలకలు సహాయపడుతాయి. మొలకలకి కీరదోస, టమోటో ముక్కలు, కొద్దిగా ఉప్పు ఒక టీస్పూన్ నిమ్మరసం చిలకరించి తీసుకోవాలి.

ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

డయాబెటిస్ వారికి ఓట్ మీల్ మరో గ్రేట్ ఆప్షన్. ఇది త్వరగా తయారవ్వడమే కాదు, సులభంగా కూడా..కొన్ని సందర్భాల్లో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. ఓట్ మీల్ కు నట్స్ లేదా సీడ్స్ ను ఒక స్పూన్ జోడించండి పెరుగు, బెర్రీస్ వంటివి కూడా జోడించవచ్చు.

గ్రీక్ యోగర్ట్:

గ్రీక్ యోగర్ట్:

అంటే లోఫ్యాట్ లేదా ఫ్యాట్ లేని ప్లెయిన్ పెరుగును వివిధ రకాల పండ్లతో కలిపి తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు సహాయపడుతుంది. అంతే కాదు డయాబెటిస్ వారికి ఒక మంచి ఎంపిక కూడా..

బాదం మరియు ఫ్రూట్స్ :

బాదం మరియు ఫ్రూట్స్ :

డయాబెటిస్ ఉన్న వారు బాదం మరియు ఫ్రూట్స్ కాంబినేషన్ తీసుకోవడం మంచిది. బాదం మరియు లోగ్లిజిమిక్ ఇండెక్స్ ఉండేటటువంటి బెర్రీస్, పీచ్, ఆపిల్ , ఆరెంజెస్ వంటి పండ్ల మిశ్రమాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ఫైబర్ ను అందిస్తుంది. అంతే కాదు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఆకలి కానీవ్వదు.

English summary

Healthy Breakfast Ideas for Diabetic Patients

Here we explain healthy breakfast ideas for diabetic patients. Read on.
Desktop Bottom Promotion