Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడానికి ఢిల్లీ AIIMS డాక్టర్ చే సూచించిన హోం రెమెడీస్
రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి ఢిల్లీ AIIMS డాక్టర్ చే సూచించిన హోం రెమెడీస్
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా శరీరంలో ఒక్కసారి షుగర్ లెవల్స్ పెరిగిపోతే, అది కంట్రోల్ చేయలేని స్థితికి చేరుకున్నప్పుడు శరీరంలో మూత్రపిండాలు, కళ్ళు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు దెబ్బతింటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోవాలి. అందుకు మీరు కొన్ని మార్గాలను ఫాలో అయితే చాలు.

మీరు డయాబెటిస్ అయితే ఈ మధ్యకాలంలో చక్కెర స్థాయిలను చెయించుకున్నారా? లేదంటే ఖచ్చితంగా చేయించుకోండి. ఒక వేళ చేయించుకుని ఉంటే రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నట్లైతే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మీరు తెలుసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో రక్తంలో అధిక చక్కరస్థాయిలను గుర్తించలేకపోవడం జరుగుతుంది, దీని కారణంగా మీ శరీరం మరియు అంతర్గత అవయవాలు క్రమంగా అనేక వ్యాధులకు గురవుతాయి. దీనికి గురించి ఢిల్లీ ఎయిమ్స్ లోని న్యూరాల.ిస్ట్ డాక్టర్ ప్రియాంక షేరావత్ ఏమంటున్నారో బ్లడ్ షుగర్ న్యాచురల్ గా ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరాలజిస్ట్
ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక షెరావత్ ప్రకారం, మీరు మధుమేహ వ్యధిగ్రస్తులైతే, మీరు మీ రక్తంలోని షుగర్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అధిక రక్త చక్కెర స్థాయి మధుమేహం మాత్రమే కాదు, దానితో అనేక సమస్యలను కూడా కలిగిస్తుందని గుర్తుంచుకోండి.

రక్తంలో చక్కర స్థాయిలను తెలుసుకోకుండా వదిలేస్తే
రక్తంలో చక్కర స్థాయిలను తెలుసుకోకుండా మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే అది శరీరంలో జీవక్రియలకు సంబంధించిన నరాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. దాంతో రక్త నాళాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. దీని ప్రభావంతో పక్షవాతం, కంటి రెటీనా దెబ్బతినడం, గుండెపోటు, కిడ్నీలు దెబ్బతింటాయి. అధిక రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మీరు ఏ రెమెడీస్ తీసుకోవచ్చో చూద్దాం..

వెంటనే ఆహారంలో మార్పులు చేసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అనే విషయం మనందరికి తెలిసిందే. అయితే మీ షుగర్ లెవెల్ తగ్గడం లేదు అని మీరు భావిస్తే, మీరు వెంటనే మీ ఆహారాన్ని మార్చుకోవాలి. మీ ఆహారంలో ఆపిల్, కివి, అవకాడో మరియు బెర్రీలు వంటి పండ్లను చేర్చండి.

గ్రీన్ వెజిటేబుల్స్ మరియు సలాడ్లు
శరీరంలోని రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉన్న రోగులు వారి ఆహారంలో గ్రీన్ వెజిటేబుల్ మరియు సలాడ్‌లను చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉండటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. డయాబెటిక్ రోగులకు జీర్ణక్రియ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. డయాబెటిస్ మందులు వికారం లేదా వాంతులు కలిగించవచ్చు, కాబట్టి సలాడ్ తినడం వల్ల ఆ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్
బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు బాదం మరియు వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తినవచ్చు. ఇది కాకుండా, వెజిటేబుల్ ఆయిల్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

శారీరక వ్యాయామం కూడా తప్పనిసరి
ఆహారంతో పాటు, మీరు శారీరక శ్రమపై కూడా శ్రద్ధ వహించాలి. మీరు రోజుకు 45 నిముషాల పాటు ఖచ్చితంగా నడకకు వెళ్ళాలి. వారానికి కనీసం మూడుసార్లు వ్యాయామం చేయాలి. ఇది చాలా కాలం పాటు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెరను ఎలా నియంత్రించాలి
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
డా.ప్రియాంక సెహ్రావత్ (@docpriyankasehrawat) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

వైద్యుడిని సంప్రదించండి
మీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, వెంటనే సరైన చికిత్స ను పొందడం చాలా ముఖ్యం. దీని కోసం, మీరు రెగ్యులర్ గా వైద్యుడిని కలవండి మరియు దానికి సరైన చికిత్స పొందండి. పైన పేర్కొన్న చర్యలు దానిని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి, కానీ దాని చికిత్స అవసరం.
నిరాకరణ: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానైనా ఏ ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.



Click it and Unblock the Notifications











