Just In
- 1 hr ago
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ 5 పండ్లను మీకు తెలియకుండా తినకండి...!
- 3 hrs ago
చుండ్రును వదిలించుకోవడానికి మీ జుట్టు కుదుళ్లు పొడవుగా పెరగడానికి ఈ 2 ఇంటి నివారణలు చాలు
- 8 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది..!
- 18 hrs ago
30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!
Don't Miss
- News
చంద్రబాబు పిట్టల దొర; దావోస్ వెళ్లి చేసిందిదే.. అయ్యన్నకు మెంటల్: సాయిరెడ్డి వ్యంగ్యం
- Movies
T Rajendar కు తీవ్ర అస్వస్థత.. సింగపూర్‌కు తరలించేందుకు శింబు ప్రయత్నాలు?
- Finance
జొమాటో అదరగొడుతుంది, షేర్ టార్గెట్ ధర రూ.100
- Sports
IPL Records: బ్రెండన్ మెక్కల్లమ్ తర్వాత.. మళ్లీ 15ఏళ్లకు అలాంటి బ్రాండెడ్ ప్లేయర్‌గా టిమ్ డేవిడ్!
- Technology
Motorola నుంచి 200MP కెమెరా స్మార్ట్ ఫోన్ ! లాంచ్ త్వరలోనే ....వివరాలు !
- Automobiles
ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే బాదం,ఎప్పుడు, ఎలా తినాలి? రోజుకు ఎన్నితినాలి?
మీ షుగర్ డైట్ చూస్తే ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఆహారం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు వారి రక్తంలో చక్కెర స్థాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల రోగులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా నిర్వహిస్తే అందరిలాగే సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అలాగే వీరు రెగ్యులర్ గా తినే ఆహారాల్లో ఏది ఆరోగ్యకరమైనది మరియు ఏది కాదు అనే దానిపై వారు స్పష్టంగా ఉండాలి. కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపవు. వాటిలో ఒకటి బాదం. వీటిని డయాబెటిక్ డైట్ లో నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడే డ్రై ఫ్రూట్స్ రకాల్లో ఇది ఒకటి.

బాదం
బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరి ఆహారంలో తప్పనిసరిగా ఉండవలసిన పోషకాంశాలు. కానీ ఈ అద్భుతమైన బాదం మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దంగా నిర్వహించడానికి కి సహాయపడుతాయి మరియు వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.

రెగ్యులర్ ఆహారంలో బాదం
బాదంపప్పులో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాదం యొక్క నిర్దిష్ట లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. బాదం సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు మరియు నిపుణులు పేర్కొన్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ...
సీనియర్ డైటీషియన్ రుచికా జైన్ మాట్లాడుతూ, "అన్ని డైనట్స్ లో కంటే బాదం ఉత్తమమైన పోషకాలలో ఒకటి. ఇందులో పోషకాలు మరియు అధిక కేలరీలు ఉన్నాయి. చక్కెర రోగులకు బాదం ఉత్తమమైన స్నాక్స్. బాదంలో ఉండే మెగ్నీషియం డయాబెట్సాండ్ రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రిస్తాయని పేర్కొన్నారు.

ఎండోక్రినాలజీ సలహాదారు ప్రకారం
ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డా. మహేష్ మాట్లాడుతూ, "బాదం టైప్ -2 చక్కెర గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే, టైప్ -2 షుగర్ ఉన్నవారు కార్బోహైడ్రేట్ డైట్ తీసుకునే ముందు బాదం పప్పును తినాలి. బాదం కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాలలో గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

బాదం ఎలా, ఎప్పుడు తినడం మంచిది?
బాధితులు మార్కెట్లో విక్రయించే సాల్టెడ్ బాదం లేదా కాల్చిన బాదంపప్పు తినకూడదని రుటికా అనే డైటీషియన్ చెప్పారు. చక్కెర అధికంగా ఉన్నవారికి ముడి బాదం పప్పులు ఉత్తమమైనవని కూడా ఆమె చెప్పారు. ముడి బాదంను ఉదయాన్నే లేదా సాయంత్రం స్నాక్స్ గా కూడా తినవచ్చు. ఇలా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది

బాదం బరువు పెరగనివ్వకుండా?
బాదంపప్పులలో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుతుంటే, మీరు ఇతర క్యాలరీ అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ఇది ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ సాధారణ మొత్తంలో కేలరీలను తీసుకుంటే మరియు రోజూ బాదంపప్పును తీసుకుంటే అది వారి మొత్తం కేలరీల పెరుగుదలను పెంచుతుంది. కాబట్టి మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాదం తింటుంటే, మీరు కేలరీలు అధికంగా ఉండే ఇతర ఆహారాన్ని తినడం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు ఎన్ని బాదంపప్పు తినవచ్చు?
క్యాలరీలను సమతుల్యం చేసుకోగలిగితే వాటి ద్వారా రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రిస్తే మరియు బాదంపప్పును తీసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందవచ్చు. సాధారణంగా డయాబెటిక్ పేషంట్స్ రోజుకు 6-8 బాదంపప్పు తినడం మంచిది. దానికి మించి ఒకటి రెండు ఎక్కువ తిన్నామొత్తం కేలరీల వినియోగాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. కాబట్టి రోజుకు 6-8 బాదం తినడం సురక్షితం అని రుచికా పేర్కొన్నారు.