For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహం ఉన్నవారు చేపలు తినొచ్చా... తింటే ఏదైనా హాని కలుగుతుందా?

మధుమేహ వ్యాధిగ్రస్తులకు చేపలు తినడం వల్ల మంచి ఫలితాలొస్తాయా? ఇప్పుడే చూడండి.

|

మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్న వాళ్లకు ఆహార అలవాట్ల మీద వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఏమి తినాలి, ఏమి తినకూడదు అంటూ డాక్టర్లు చాంతాడు అంత జాబితానే ఇస్తుంటారు.

Diabetes : Is Fish Good For People With Diabetes

మధుమేమ వ్యాధి గ్రస్తులు వారు తీసుకుని ఆహారం వలనే వారిలో షుగర్ లెవల్స్ ఆధాపడి ఉంటాయి. ఒక్కొసారి ఇష్టం వచ్చినట్లు ఏదిపడితే అది తింటున్న కొందరు షుగర్ లెవల్స్ తేడాతో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు.

Diabetes : Is Fish Good For People With Diabetes

ఒక అధ్యయనం ప్రకారం షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు ఎక్కువ మోతాదులో చేపలు తినడం వలన వారి ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉంటుందని వెలుగు చూసింది. ప్రతిరోజు చేపలు తినడం వలన చక్కర వ్యాధి కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు అంటున్నారు.

డైట్ లో ఉన్నప్పుడు 10 ప్రమాదకరమైన విషయాలు మీకు తెలుసా?డైట్ లో ఉన్నప్పుడు 10 ప్రమాదకరమైన విషయాలు మీకు తెలుసా?

లావుగా ఉండేవాళ్లు..

లావుగా ఉండేవాళ్లు..

షుగర్ వ్యాధితో బాధపడుతున్న చాలా మంది, లావుగా ఉన్నవాళ్లు చేపలు తినడం వలన వారి షుగర్ లెవల్స్ కంట్రోల్ లోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. చేపల్లో ఎక్కువగా ప్రోటిన్లు, డి విటమిన్ షోషకాలు ఎక్కువగా ఉండటంతో మధుమేహం వ్యాధి ఉన్న క్రమం తప్పకుండా చేపలు తినడం వలన వారు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.

గుండె జబ్బులకు ఎంతో మేలు..

గుండె జబ్బులకు ఎంతో మేలు..

చేపలు తినడం వలన గుండె జబ్బులను కంట్రోల్ చేసే అవకాశం ఉందని. మధేమేహ వ్యాధి నుంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి చేపలు ఎంతో ఉపయోగపడుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. చేపలు తినడం వలన గుండె జబ్బులు రాకుండా ఉంటాయని, చేపల్లో పోషక ఆహారం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

సల్మాన్ లో విటమిన్ డి పోషకాలు..

సల్మాన్ లో విటమిన్ డి పోషకాలు..

విటమిన్ డి అధికంగా ఉండే సల్మాన్, హెర్రింగ్ వంటి చేపలు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీంలో కొవ్వు తగ్గించి షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉండే అవకాశం ఉందని, శరీరంలో డి విటమిన్ స్థాయిని పెంచే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. చేపల్లో డి విటమిన్ పుష్కలంగా ఉండటంతో షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు క్రమం తప్పకుండా చేపలు తినాలని నిపుణులు అంటున్నారు.

చికెన్, గొడ్డు మాంసం కంటే చేపలు ఎంతో మేలు

చికెన్, గొడ్డు మాంసం కంటే చేపలు ఎంతో మేలు

షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు చికెన్, గొడ్డు మాంసం తినడం కంటే చేపలు ఎక్కువగా తింటే వారు ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. అంటార్కిటికస్, ట్యూనా వంటి చేపలు తినడం వలన శరీరంలో షుగర్ లెవల్స్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటాయని, మధుమేహ వ్యాధికి దూరం కావడంతో వాళ్లు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఓమేగా చేపలు

ఓమేగా చేపలు

ఓమేగా చేపలు తినడం వలన డయాబెటిస్ ఉన్న వాళ్లలో కొవ్వు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. గుండె జబ్బులు కంట్రోల్ లో ఉండటానికి, కొలోస్ట్రాల్ ను కంట్రోల్ చెయ్యడానికి ఓమేగా చేపలు ఎంతగానో ఉపయోగపడుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

వాటిని పక్కన పెట్టండి

వాటిని పక్కన పెట్టండి

చేపలు తినడం వలన షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వయసు ఎక్కువగా ఉన్న వాళ్లు చేపలు ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణుల అధ్యయనంలో వెళ్లడైయ్యింది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు చికెన్, మటన్, గొడ్డు మాంసంకు దూరంగా ఉంటూ చేపలు ఎక్కువగా తినాలని నిపుణులు సూచించారు.

English summary

Is Fish Good For People With Diabetes?

మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్న వాళ్లకు ఆహార అలవాట్ల మీద వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఏమి తినాలి, ఏమి తినకూడదు అంటూ డాక్టర్లు చాంతాడు అంత జాబితానే ఇస్తుంటారు. మధుమేమ వ్యాధి గ్రస్తులు వారు తీసుకుని ఆహారం వలనే వారిలో షుగర్ లెవల్స్ ఆధాపడి ఉంటాయి.ఒక అధ్యయనం ప్రకారం షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు ఎక్కువ మోతాదులో చేపలు తినడం వలన వారి ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉంటుందని వెలుగు చూసింది. ప్రతిరోజు చేపలు తినడం వలన చక్కర వ్యాధి కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Desktop Bottom Promotion