Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
డయాబెటిస్‌పై ఇవన్నీ అపోహలు మాత్రమే, నిజమని నమ్మొద్దు
డయాబెటిస్.. ఈ దీర్ఘకాళిక వ్యాధి బారిన పడితే దీన్ని వదిలించుకోవడం చాలా కష్టం. ఈ మధ్య చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి రోగులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవితాంతం తీవ్ర ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలంటే ముందుగానే దీని గురించి ఆవగాహన పెంచుకోవాలి. అలాగే ఈ వ్యాధి పట్ల నెలకొన్న అపోహల గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యమే. మరి ఈ అపోహలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర తినకపోతే డయాబెటిస్ రాదు!
అధిక చక్కెర తీసుకోవడం హానికరం కానీ ఇది డయాబెటిస్ కు దారి తీసే ఏకైక కారణం అని చెప్పడం తప్పు. టైప్ 1 మధుమేహం జెనిటిక్స్, ఇతర కారకాల వల్ల వస్తుంది. టైప్ - 2 మధుమేహం పేలవమైన లైప్ స్టైల్ వల్ల వస్తుంది. కేలరీలు అధికంగా ఉండే ఆహారం బరువు పెరగడానికి కారణం అవుతుంది. అధిక బరువు ఉండడం వల్ల టైప్ - 2 మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.

మధుమేహం వస్తే ప్రాణాలేం పోవు!
అలాగే మధుమేహం ప్రాణాంతకం కాదనే ఓ అపోహ ఉంటుంది. కానీ ఏ రకమైన మధుమేహం అయినా సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఆయుష్ష తగ్గి జీవితం నరకంగా మారవచ్చు.
లావుగా ఉన్న వాళ్లకే డయాబెటిస్ వస్తుంది!
లావుగా ఉన్న వాళ్లకి డయాబెటిస్ ఎక్కువగా వస్తుందని అనుకుంటారు. కానీ సన్నగా ఉన్న వారు కూడా చక్కెర వ్యాధి బారిన పడతారు ఊబకాయం అనేది టైప్ - 2కి లేదా ఇతర డయాబెటిస్ కు ప్రత్యక్ష కారణం కాదు. కానీ ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే సరైన బరువును మెయింటైన్ చేయాలి. అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేస్తే మంచిది. సరైన వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. వైద్యుల సూచన మేరకు మధుమేహ వ్యాధి గ్రస్తులు పలు రకాల పండ్లను తినొచ్చు.
డయాబెటిస్ ఉన్న వాళ్లు వ్యాయామం చేయకూడదు!
అన్ని రకాల మధుమేహం ఒకటేనని చాలా మంది భావిస్తారు. అన్నిటికీ ఒకే చికిత్స అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఇక టైప్ 1, టైప్ 2, గెస్టేషనల్ డయాబెటిస్ వంటి రకరకాల మధుమేహ వ్యాధులు చాలా మందిని ప్రపంచ వ్యాప్తంగా వేధిస్తున్నాయి. టైప్ - 2 డయాబెటిస్ మన దేశంలో చాలా కామన్ అయిపోయింది. ఎక్కువ మంది ఈ వ్యాధతోనే బాధపడుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications