Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
పొట్టిగా ఉన్నారా? అయితే మీరు టైప్ 2 మధుమేహం బారినపడే అవకాశాలున్నాయని మీకు తెలుసా?
పొట్టిగా ఉన్నారా? అయితే మీరు టైప్ 2 మధుమేహం బారినపడే అవకాశాలున్నాయని మీకు తెలుసా?
ఈ అధ్యయనం 2662 మంది మధ్య వయస్కులైన పురుషులు మరియు మహిళల మీద జరిగింది. వారి బరువు, వయస్సు, నడుము పరిమాణం, కూర్చున్న ఎత్తు మరియు రక్తపోటును పర్యవేక్షించిన తరువాత, భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పొడవైన వ్యక్తులలో తక్కువగా ఉందని కనుగొనబడింది; ఆ ప్రమాద స్థాయిలు, పురుషులలో 41% మరియు మహిళలలో 33% వరకు పొడవైన వ్యక్తులలో తక్కువగా ఉన్నాయని నివేదికలో పేర్కొనబడింది.
అద్యయనంలో పాల్గొన్న వారిలో సాధారణ బరువుతో కూడుకుని, 10 సెం.మీ ఎక్కువ ఎత్తుగా ఉన్న వారిలో, పురుషులలో మధుమేహం బారినపడే ప్రమాదం 86% తక్కువగా ఉండగా, మహిళల్లో 67% తక్కువగా ఉందని తేలింది. అంతేకాకుండా వీరిలో ఊబకాయం బారినపడే అవకాశాలు కూడా పురుషులలో 36% తక్కువగా మరియు మహిళలలో 30% తక్కువగా ఉన్నాయని నివేదికల్లో పేర్కొనబడ్డాయి.

అదేవిధంగా నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వ్యక్తులలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు పొడవాటి కాళ్ళు ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్ అవకాశాలు తక్కువగా ఉన్నాయని నివేదించబడింది. పురుషులు మరియు మహిళలలో టైప్ -2 డయాబెటిస్ ప్రమాదమనేది నడుము చుట్టుకొలత, మరియు కాళ్ళ పొడవు మీద ఆధారపడి ఉన్నట్లు కనుగొన్నామని జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ (జర్మనీ) పరిశోధకులు చెబుతున్నారు.
ఏదేమైనా, ఒక వ్యక్తి వారి ప్రారంభ మరియు వృద్ధి దశలను చక్కగా నిర్వహిస్తే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని అడ్డుకోవచ్చునని అధ్యయనం సూచిస్తుంది.

తక్కువ ఎత్తులో ఉన్నవారు ఎదుర్కొంటున్న ఇతర ఆరోగ్య సమస్యలు :
ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణ ఆరోగ్యానికి శరీర పెరుగుదల కూడా అత్యంత అవసరంగా ఉంటుంది. ఎత్తు తక్కువగా ఉండడం, మధుమేహాన్ని ఆహ్వానించడమే కాక, ఇతర అనేకరకాల వ్యాధులకు కూడా తలుపులు తెరుస్తుందని చెప్పబడుతుంది. తక్కువ ఎత్తు కలిగిన వారు తరచుగా ఎదుర్కొనే వ్యాధుల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి.

1. ఎత్తు తక్కువగా ఉన్నవారు, ఊపిరితిత్తుల వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి :
కమ్యూనికేషన్స్ బయాలజీలో ప్రచురించబడిన పరిశోధనల ప్రకారం, తక్కువ ఎత్తు కలిగినవారు, ఊపిరితిత్తుల సమస్యలను ఎక్కువగా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. క్రమంగా ఇది మధుమేహం మరియు గుండె జబ్బులకు దారితీస్తుంది. కావున అటువంటి వ్యక్తులు క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని, చురుకైన జీవనశైలిని అలవరచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

2. తక్కువ ఎత్తు ఉన్నవారు, కొరోనరీ గుండె జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయి :
లీసెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, తక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులను పొడవుగా ఉన్న వ్యక్తులతో పోల్చినప్పుడు, ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం బారినపడుతున్నారని పరిశోధనల్లో చూపింది. ప్రతి 2.5 అంగుళాల తక్కువ ఎత్తు 13.5% ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు వరుసగా 5.5 అడుగులు మరియు 5 అడుగుల ఎత్తును కలిగి ఉంటే, తక్కువ ఎత్తు కలిగిన వ్యక్తిలో, కొరోనరీ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 27% ఎక్కువగా ఉంటాయి.

3. తక్కువ ఎత్తు కలిగిన వారు, బట్టతల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉంటాయి :
నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, పొడవైన వారి కంటే తక్కువ ఎత్తుకలిగిన పురుషులలో బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. సుమారు 20000 మంది పురుషుల జన్యువులను పరిశోధించిన తరువాత, అకాలంగా జుట్టు రాలడమనేది, తక్కువ ఎత్తుతో ముడిపడి ఉందని కనుగొనడం జరిగింది.

4. తక్కువ ఎత్తు, శిశువుల ముందస్తు జననంతో ముడిపడి ఉండే అవకాశాలు ఉన్నాయి :
మార్చ్ ఆఫ్ డైమ్స్ ప్రీమెచ్యూరిటీ రీసెర్చ్ సెంటర్ ఓహియో కొలాబరేటివ్ వారు నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, గర్భధారణ విషయాలలో తల్లి ఎత్తు అనేది శిశువు ముందస్తు జననానికి కారణం కావచ్చు. అలాగే, ఇది నవజాత శిశువుల పరంగా, దృష్టి సమస్యలు, కామెర్లు, మందబుద్ది మరియు శ్వాస సమస్యలు వంటి జీవితకాల సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది.

5. ఎత్తు తక్కువగా ఉండడం, బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుందా :
చిన్న పరిమాణంలో ఉన్న ఎముకలు మరియు మృదులాస్థి తక్కువగా ఉన్న కారణంగా, ఎత్తు తక్కువగా ఉన్న ప్రజలలో బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పొరాసిస్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ఏదేమైనా, జన్యువులు అనేవి 80% వ్యక్తి యొక్క ఎత్తును నిర్ణయిస్తాయని వారు సూచిస్తున్నారు. మిగిలినవి పర్యావరణం, ప్రారంభదశలో అందించిన పోషకాలు మరియు పోషణ కారణంగా మారుతూ ఉంటాయి.

పురుషులు మరియు మహిళల సగటు ఎత్తు :
గణాంకాల ప్రకారం, భారతీయ పురుషుల సగటు ఎత్తు 5 అడుగులా 5 అంగుళాలు కాగా, భారతీయ మహిళల సగటు ఎత్తుగా 5 అడుగులు ఉంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications