For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలు తింటే చాలు...!

By B N Sharma
|

Burn
బరువు తగ్గాలనేవారు ప్రధానంగా రెండు అంశాలు పాటించాలి. ఆహార ప్రణాళిక, కొన్ని వ్యాయామాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సరైన ఆహార ప్రణాళికలు ఆచరించలేరు సరైన ఆహారపుటలవాట్లు లేకపోవడంతో కొవ్వు తగ్గటానికి బదులు పెరిగి బరువెక్కుతారు. ఖచ్చితంగా ఆహార ప్రణాళిక ఆచరించేవారు జిమ్ లేదా వ్యాయామాలతో తమ శక్తి పోగొట్టుకుంటారు. కనుక వ్యాయామాలు లేకుండా, ఆహార ప్రణాళికలు ఆచరించకుండా, సాధారణంగా వుంటూ మంచి ఫిట్ నెస్ కొరకు ఏం చేయాలనేది పరిశీలించండి.

కొవ్వు వేగంగా కరిగించే ఆహారాలు -
గుడ్లు - గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.
విటమిన్ సి - సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు, ఆరెంజస్ వంటి పండ్లు, కేరట్, కేబేజి, బ్రక్కోలి, యాపిల్, వాటర్ మెలన్ వంటి కూరలు పండ్లు శరీరంలోని కొవ్వును కరగించి, కణాలలోని అధిక నీటిని కూడా పీల్చేస్తాయి.
బాదం పప్పులు - బాదం పప్పు ఎంతో ఆరోగ్యకర కొవ్వునిస్తుంది. మంచి కొల్లెస్టరాల్ ఇస్తుంది. వీటిలోని ఫైబర్ మంచి కొల్లెస్టరాల్ శరీరంలోని కొవ్వును కరిగించి మీరు చురుకుగా, ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. పొట్ట కొవ్వు ఏర్పడదు. రోజుకు 12 నుండి 24 బాదం పప్పులు సాయంత్రం స్నాక్స్ గా తింటే ఆకలి తీర్చి కడుపు నింపుతుంది.
వెజిటబుల్స్ - పచ్చటి కూరలు...కేబేజి, బ్రక్కోలి, అవకాడో, కేరట్లు, గోంగూర వంటివి శరీర కొవ్వు తేలికగా కరిగిస్తాయి. వీటిని కనొద్దిపాటి పెరుగు, లేదా పప్పులు కలిపి తినవచ్చు.
టమాట - కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.
తేనె - వేడి నీటిలో తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. తియ్యనైన తేనెను ఏదీ కలపకుండా కూడా తీసుకోవచ్చు. తేనెలోని కార్బో హైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరచి బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రిస్తాయి. బరువు వేగంగా తగ్గాలంటే, షుగర్ కు బదులు తేనెవాడండి.
నీరు - ఇది ఆహారం కాకపోయినా, బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరం లో తేమనుంచుతుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే కొద్ది వారాలలో మీకు ఫలితం కనిపిస్తుంది. వేడి నీటిలో నామ్మరసం, తేనె కలిపి తాగితే కూడా బరువు తగ్గటంలో ఫలితాలు వేగంగా వుంటాయి.

ఈ ఆహారాలు తింటే చాలు మీ బాడీ షేప్ చక్కగా వుంటుంది.

English summary

7 Foods To Burn Fat Fast & Get Into Shape | వ్యాయామాలు లేని ఫిట్ నెస్!

If you want to lose weight then there are two essentials. You have to follow a strict diet and workout in gyms. For many people a strict diet is ineffective and they waste their energy in gym to lose those extras pounds. Working professionals can't follow a proper diet and poor eating habits can add more weight instead of burning the fat.
Story first published:Saturday, November 26, 2011, 10:37 [IST]
Desktop Bottom Promotion