For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బలమైన కాళ్ళకు పిక్క కండరాల వ్యాయామం!

By B N Sharma
|

girl.jpeg
పిక్క కండరాల వ్యాయామ ఫలితం మీ కాళ్ళపై అమోఘంగా వుంటుంది. అందంగా కనపడే కాళ్ళేకాదు కావలసింది...బలమైనవి గా కూడా వుండాలి. మీ మోకాళ్ళ వెనుక దిగువ భాగంలో వుండే పిక్కల బిగువును ఎపుడైనా పరీక్షించారా? నేటి రోజుల్లో రోజులో అధిక భాగం మనమంతా కుర్చీలలో కూర్చొని కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం. అధికభాగం కూర్చిండిపోవటంతో కాళ్ళకు వ్యాయామం లేకుండా పోయి బలహీనపడుతున్నాయి. పిక్కల కండరాలను బలపరచుకోడానికి ఏ రకమైన వ్యాయామాలు చేయాలో పరిశీలించండి.

సులభమైన పిక్క కండరాల వ్యాయామం!
కండరాలను బలపరచటానికి చేసే వ్యాయామం అంటే...స్ట్రెచింగ్. అంతే...ఎంతో తేలికైన వ్యాయామం. కాళ్ళ పిక్కల కండరాలు బలపడాలంటే ప్రతిరోజూ జిమ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటిని ఇంటిలోనే చేసుకొటూ ఆరోగ్యంగా వుండవచ్చు.

ప్రధానంగా రెండు రకాల స్ట్రెచింగ్ లున్నాయి. రెండూ కూడా ఏ పరికరాలు లేకుండానే చేయవచ్చు.
వాల్ స్ట్రెచ్ - గోడకు 10 అంగుళాల దూరంలో నించోండి. ఒక కాలిముందు మరోకాలు పెట్టండి. మీ మోకాలును తిన్నగా గోడవైపుకు వంచండి. మీరు కదలకుండా గోడవైపుకు మోకాలును పుష్ చేయాలి. మీ కాలిలో వచ్చే ఒత్తిడి కండరం బలపడటానికి చేసే వ్యాయామమని గ్రహించండి.

సిటింగ్ స్ట్రెచ్ - ఈ సాగే వ్యాయామానికి మీరు నేలపై కూర్చోండి. కాళ్లను మీ ముందుకు చాపండి. మీ పాదాల అరికాల్ళను అరచేతులతో పట్టుకోండి కాళ్ళను బయటకు నెడుతూ వుండండి. పిక్క కండరాల నొప్పులేమైనా వుంటే మాయమవుతాయి.

స్కిప్పింగ్ - చిన్నపుడు మనమంతా స్కిప్పింగ్ చేసిన వారమే. చాలా ఏళ్ళ తర్వాత మొదటి సారి చేస్తున్నట్లయితే, కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. అందరూ స్కిప్పింగ్ తేలికనుకుంటారు. ఆనందిస్తారు. కాని అది చాలా శ్రమతో కూడిన వ్యాయామం. ప్రతిరోజూ చేస్తూ వుంటే మీ పిక్క కండరాలు బలపడి శరీరమంతా తేలికవుతుంది. అధిక బరువు వున్నవారికి ఇది ఒక మంచి వ్యాయామం.

శరీరం చురుకుగా కదులుతూ ఆరోగ్యంగా వుండాలంటే, కాలి పిక్క కండరాలకు బలం పట్టటం ఎంతో ప్రధానం. ప్రతిరోజూ అధిక సమయం పాటు కూర్చుని పనులు చేయటంతో శారీరకంగా బలాన్ని సంతరించుకోవటం వెనుకబడిపోతోంది. కనుక. ప్రతిరోజూ ఉదయం వేళ లేక సాయంత్రాలు ఒక్క గంట ఏ పరికరాలు అవసరంలేని ఇట్టి వ్యాయామాలు చేస్తే శరీరం చక్కని ఫిట్ నెస్ సంతరించుకొంటుందనటంలో సందేహం లేదు.

English summary

Calf Muscle Exercise For Strong Legs| బలమైన కాళ్ళకు పిక్క కండరాల వ్యాయామం!

This game we all have played as kids can be a very good calf work out for you. The first time your do this after a long gap of years, your legs will hurt like hell. Contrary to popular opinion, skipping is a very strenuous exercise. We don't realize it because we are having too much fun. But slowly it will build up the strength in your calf muscles to support the weight of your whole body.
Story first published:Saturday, October 8, 2011, 10:28 [IST]
Desktop Bottom Promotion