For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెనోపాజ్ మహిళలకు వ్యాయామాలు!

By B N Sharma
|

Exercise Tips For Menopause Women
మహిళ 40సంవత్సరాలు పైబడిందంటే కొన్ని ఆరోగ్య సమస్యలనెదుర్కొంటుంది. ప్రధానంగా ఎముకలు అరిగి బలహీనపడటం, ఆందోళన, పోషకాహార లేమి మొదలైనవిగా వుంటాయి. వీటన్నిటికి వైద్యులు పరిష్కారం చెపుతూనే వుంటారు. కాని మహిళలు తమకు చేతనైన రీతిలో కొద్దిపాటి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా వుండటానికి ప్రయత్నించాలి. 40 సంవత్సరాల వయసుపైగా వారు చేసే వ్యాయామం శారీరక వ్యవస్ధలు అంటే జీర్ణక్రియ, నరాల వ్యవస్ధ మొదలైనవి మెరుగుపరచి శరీర బరువు మెయిన్టెయిన్ చేస్తాయి. కేన్సర్ కారక కణాలను అరికడతాయి. ఎముకల అరుగుదల, గుండెజబ్బులు లాంటి వ్యాధులు వెనకపడతాయి. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా కనపడతారు. ముట్లుడిగిన మహిళలు చేయాల్సిన చిన్నపాటి వ్యాయామాలు...

1. సింపుల్ స్ట్రెచస్ - చిన్నపాటివిగాను మెల్లగాను చేసే రొటీన్ అరబిక్స్ లాంటివి చేయాలి. కొద్ది సమయం జోగింగ్ వీరికి చాలు. ఆహారం నియంత్రిస్తే బరువు పెరగకుండా కూడా వుంటారు.

2. శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి. శ్వాస మెరుగుపడి మైండ్ ప్రశాంతంగా వుంటుంది. కొవ్వు తగ్గి రోజంతా శరీరం బిగువుగా వుంటుంది.

3. నడక, ఇంటిపనులు అంటే గుడ్డలు పిండటం, ఇల్లు ఊడ్చటం, మెట్లు ఎక్కటం, సైకిలు తొక్కడం వంటివి ఎముకలను బలంగాను ఆరోగ్యంగాను ఉంచగలవు.

4. కెగెల్ వ్యాయామాలు - మెనోపాజ్ తర్వాత తుండి కండరాలు బలహీనపడతాయి. కనుక వీటిని బలపరచాలంటే కొన్ని నేలమీద కూర్చుని చేసే ఆసనాలు ఉపయోగిస్తాయి. ప్రతిరోజూ ఫిట్ గా వుంటే హెమరాయిడ్స్, బ్లాడర్ సంబంధిత సమస్యలు కూడా లేకుండా వుంటాయి.

English summary

Exercise Tips For Menopause Women | మెనోపాజ్ మహిళలకు వ్యాయామాలు!

Menopause has become one of the main cause for various health problems. Women over 40 suffer from weak bones, anxiety, malnutrition etc. Although doctors suggest various diet and nutritional supplements to women, they also need to follow some exercise routines for a healthy lifestyle. Take a look at the exercise tips for menopause women.
Story first published:Wednesday, September 28, 2011, 10:50 [IST]
Desktop Bottom Promotion