For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొడ కొవ్వు తగ్గాలంటే.....!

By B N Sharma
|

Exercises To Reduce Thigh Fat & Get Lean Legs
సాధారణంగా మహిళలు తమ కాళ్ళు సన్నగా నాజూకుగా వుంచుకోటానికి తీవ్రకృషి చేస్తూంటారు. తొడపై భాగంలో కొవ్వు ముందుగా చేరుతుంది. కాని కొవ్వు శరీరంలో పూర్తిగా కరిగేటపుడు చివరగా కరిగేది తొడలోనే. తొడలు సన్నబడటానికిగాను తగిన వ్యాయామాలు చేస్తూ అవసరమైన తక్కువ కొవ్వు కల ఆహారాన్ని కూడా తీసుకుంటే ఫలితాలు త్వరగా కనపడతాయి.

తొడభాగం గణనీయంగా తగ్గాలంటే చేయాల్సిన వ్యాయామాలు చూద్దాం-
పరుగు పెట్టటం - పరుగుపెడితే తొడ, కాళ్ళ భాగాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది. వేగంగా 30 నుండి 45 నిమిషాలు పరుగుపెట్టి తొడ కొవ్వు కరిగించుకోండి.
స్వ్కాట్ లేదా బాసింపట్టు వేసి నేలపై కూర్చోడం - ఈ వ్యాయామంతో పొట్ట, తొడలు, కాళ్ళు, పిరుదులు అన్నీ కొవ్వు తగ్గించుకొనే అవకాశం వుంది. కూర్చొని వివిధ రకాలుగా శరీర భాగాలను బెండ్ చేస్తూ వుండాలి. ఒక్కొక్క పొజిషన్ లో కనీసం 20 నుండి 30 సెకండ్లు వుండాలి.
కాళ్లు పైకి ఎత్తడం- నేలపై పడుకొని చేతులు పక్కలకు చాచి కాళ్ళను ఒక్కొక్కటిగా సీలింగ్ వైపుకు ఎత్తి నిలపాలి. ఒక సర్కిల్ ఆకారంలో వాటిని తిప్పాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైస్ గా 5 మార్లు తిప్పాలి. తొడ కొవ్వు తగ్గటానికి ఇది ఒక సామాన్య వ్యాయామం.
హై జంపులు - కంగారూ జంతువు దూకినట్లు నేలకు ఎత్తుగా కాళ్ళు మడిచి దూకండి.
సైకిలింగ్ - ప్రతిదినం ఒక గంట పాటు సైకిలు తొక్కండి. నెమ్మదిగా కాదు కొంచెం వేగంగానే పోవాలి. సైకిల్ లేకుంటే, నేలపై పడుకొని కాళ్ళను గాలిలోకి చాపుతూ సైకిలు తొక్కుతున్నట్లు చేయాలి. ప్రతిదినం ఈ వ్యాయామం 20 నుండి 30 నిమిషాలు చేస్తే మంచి ఫలితాలనిస్తుంది.
నడక - ప్రతి దినం వేగంగా నడక సాగిస్తే తొడలు, పిరుదులు, కాళ్ళ భాగంలోని కొవ్వు బాగా కరిగిపోతుంది.
క్రీడలు ఆడండి.- ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, స్వమ్మింగ్, లాన్ టెన్నిస్ వంటివి కాళ్ళకు, శరీరానికి మంచి బలాన్నివ్వటమే కాక తొడ కొవ్వును తగ్గిస్తాయి.

సహజంగా ఎట్టి సాధనాలు లేకుండా తొడల కొవ్వు తగ్గించుకునేటందుకు ఈ వ్యాయామాలు చేసి ఫలితాలను పొందండి.

English summary

Exercises To Reduce Thigh Fat & Get Lean Legs | తొడ కొవ్వు తగ్గాలంటే.....!

Women want to have lean and tall legs to flaunt them in shorts but the thigh fat makes you appear short and heavy. Upper thighs is the first place to gain weight and the last to loose! Combine exercise with specific strength training movements for your upper thighs to tone and improve them.
Story first published:Wednesday, September 7, 2011, 16:46 [IST]
Desktop Bottom Promotion