For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైటింగులతో సన్న పడేకంటే.. ఆరోగ్యంతో లావుగా వున్నా హేపీయే!

By B N Sharma
|

Fat than go on Dieting to turn Slim!
లండన్: లావుగా వున్నవారందరకూ ఊరట కలిగే ఒక శుభవార్త....! తాజాగా, సైంటిస్టులు సన్నగా వుండాలంటూ బరువును తగ్గించే డైటింగులు చేసేకంటే హాయిగా లావుగా వుంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. లావుగా వున్నప్పటికి ఆరోగ్యంగా వున్నవారు సన్నగా వున్న వారితో సమానంగానే జీవిస్తున్నట్లు, లావుగా వున్నప్పటికి వీరికి ఎటువంటి గుండె జబ్బులు లేవని కూడా తేలినట్లు యార్క్ విశ్వవిద్యాలయంలో చేసిన ఒక పరిశోధనలో తేలింది.

లావుగా వున్నవారు బరువు వదిలించుకోవాల్సిందే అన్న భావనను తాము చేసిన అధ్యయన ఫలితాలు ఛాలెంజి చేస్తున్నాయని అధ్యయన బృంద నేత యార్క్ స్కూల్ ఆఫ్ కిన్సియాలజీ అండ్ హెల్త్ సైన్స్ లోని ప్రొఫెసర్ జెన్నిఫర్ కుక్ వెల్లడించారు. అంతేకాదు, అధిక బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించటం, అందులో విఫలమవటం కూడా ఆరోగ్యానికి హానికరమంటారు ఈ శాస్త్రవేత్తలు. ఈ టీము సుమారు 6,000 మంది అమెరికన్లను 16 సంవత్సరాల కాలంలో సన్నగా వున్న వ్యక్తుల జీవనంతో పోల్చి పరిశోధన చేసింది.

ఈ స్టడీని అప్లైడ్ ఫిజియాలజీ, న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్ లో ప్రచురించారు.

English summary

It's healthier to stay 'healthy' Fat than go on Dieting to turn Slim! | డైటింగులతో సన్న పడేకంటే.. ఆరోగ్యంతో లావుగా వున్నా హేపీయే!

They found that obese individuals who had no (or only mild) physical, psychological or physiological impairments had a higher body weight in early adulthood, were happier with this higher body weight, and had attempted to lose weight less frequently during their lives. However, these individuals were also more likely to be physically active and consume a healthy diet.
Story first published:Tuesday, August 23, 2011, 11:28 [IST]
Desktop Bottom Promotion