For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీచు అధికంగా వుండే 5 ఆహార పదార్ధాలు!

By B N Sharma
|

Top 5 High Fibre Foods
తరచుగా మలబద్ధకం పట్టి పీడిస్తుంటే మీరు మీ ఆహారంలో పొట్ట కదలికలకవసరమైన పీచు పదార్ధాలను తినటం లేదని భావించాలి. సాధారణంగా పీచు పదార్ధాలకు మనం ఆహారాలలో ప్రాధాన్యతనివ్వం. ఎందుకంటే అది ఇతర పోషకాలలో కలిసే వుంటుంది. తినే ఆహార పదార్ధాలలోనే పోషకాలతో పాటు కొద్దిపాటిగా పక్కన వుంటుంది. సాధారణంగా ఎవరూ కూడా పీచు పదార్ధాలను ప్రత్యేకించి తీసుకోరు. కాని మీకు ప్రతిరోజూ సాఫీగా మలవిసర్జన జరగాలంటే ఈ పీచు పదార్ధాల ఆవశ్యకత ఎంతైనా వుంది.

పీచు అధికంగా వుండే 5 ఆహార పదార్ధాలు:
1. తవుడు లేదా ధాన్యాలు - సాధారణంగా మనం తీసుకునే ధాన్యాలలో కావలసినంత పీచు వుంటుంది. బియ్యం, గోధుమ, జొన్న, పప్పులు, ఓట్లు పీచు అధికంగా వుండే పదార్ధాలు. ఇవి కావలసిన మెగ్నీషియం, బి 6 విటమిన్ కూడా ఇస్తాయి. ఇవి కనుక ముతక ధాన్యాలైతే (పాలిష్ కానివి), పీచు మరింత అధికంగా కూడా వుంటుంది. తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ వంటివి మంచివి.
2. బీన్స్: ఆహారంలో బీన్స్ చాలా మంచి ఆహారం. ఇవి వండిన తర్వాత కరూడా పీచు కలిగి వుంటాయి. ఫ్రెంచి బీన్స్, కిడ్నీ బీన్స్ ఏవైనప్పటికి మంచిదే.
3. బెర్రీ పండ్లు: సాధారణంగా అందరూ వీటిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమే వున్నాయనుకుంటారు. కాని వీటిలో పీచు కూడా అత్యధికంగా వుంటుంది. కనుక, స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి బాగా తినండి.
4. పచ్చని ఆకు కూరలు: గోంగూర, బచ్చలి, మెంతి, కరివేప మొదలైన పచ్చని ఆకు కూరలలో కూడా పీచు అధికంగా వుంటుంది. కనుక ఆకు కూరలు తినే ఆహారంలో ప్రధానంగా వుండాలి.
5. కాయ ధాన్యాలు: సైజులో చిన్నవైనప్పటికి ఇవి పీచు అధికంగా కలిగి వుంటాయి. కొద్దిపాటిగా తింటే చాలు వాటిలో వున్న కొవ్వు, ప్రొటీన్లు అధిక శక్తి నిస్తాయి. కనుక ప్రతిరోజూ కొన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి తినండి.

English summary

Top 5 High Fibre Foods | మలబద్ధకం చంపేస్తోందా?

Green Leafy Vegetables: Not all green leaves of plants have great nutritional value but they all do have a considerable amount of roughage which is healthy for you. It is thus prudent to choose the greens that give you fibre along with other essential nutrients; for example spinach which is the most favourite among leafy vegetables.
Story first published:Monday, October 31, 2011, 12:47 [IST]
Desktop Bottom Promotion