Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
బరువును తగ్గించే 5 రకాల సాధారణ ఆహారలు...!
గుడ్డు: కోడిగుడ్డులో అధిక ప్రోటీనులు కలిగి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం గ్లాసు పాలతోటి ఒక గుడ్డును తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మిమ్మల్ని ఎక్కువ సేపు ఆకలి అనిపించకుండా మీ జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతుంది. గుడ్డులో అధిక శాతంలో అమినో ఆసిడ్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా డైయట్ పాటించేవారు గుడ్డును వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా ఉత్తమం. అమినో ఆసిడ్స్ ప్రోటీన్స్ శరీరంలోని కండరాలను గట్టిగా ఉంచడానికి, మెదడులోని కణాలకు ఫైబర్ ను అంధిచడానికి చాలా ఉపయోగపడుతుంది.

గుడ్డు
కోడిగుడ్డులో అధిక ప్రోటీనులు కలిగి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం గ్లాసు పాలతోటి ఒక గుడ్డును తినడం

సలాడ్స్
రకరకాల వెజిటేబుల్స్ తో , అలాగే రకరకాల పండ్లతోటి రెడీ చేసే సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.

కిడ్నీ బీన్స్
సాధారణంగా చాలా మంది బీన్స్ అంటే బాగా తెలుసు. అయితే కిడ్నీ బీన్స్ అంటే కొంత మంది తెలియదు.

పొటాటో
బంగాళా దుంప బరువు తగ్గిస్తుందా..ఆశ్చర్యం కదా! బంగాళదుంప తినడం వల్ల ఏ సమస్యా లేదు.

ఎర్రని టమోటోలు
ఎర్రగా చూస్తానే ఆకర్షించే టమోటోలలో ఒక సీక్రెట్ దాగిఉంది. ఇందులో చాలా శక్తివంతమైనటువంటి యాంటి ఆక్సిడెంట్ కాంపౌడ్ లైకోపెనే కలిగి ఉండి.
సలాడ్స్: రకరకాల వెజిటేబుల్స్ తో, అలాగే రకరకాల పండ్లతోటి రెడీ చేసే సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. సలాడ్స్ ను టమోటో, క్యారెట్, బీట్ రూట్, క్యాబేజ్, క్యాప్సికమ్, లెట్యూస్ మరియు కీర దోసకాయలాంటి కూరగాయలలో చాలా తక్కువ శాతంలో లోకాలరీస్ కలిగి ఉంటుంది. వీటితోనే మీ డైయట్ ను విజవంతం చేసుకోవచ్చు. వీటితో తయారు చేసుకొనే సలాడ్స్ కి కొద్దిగా పెరుగ లేదా నిమ్మరసం డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. సాండ్ విచ్ లలో ఈ పచ్చికూరలను వినియోగించడం చాలా మంచిది. సాండ్ విచ్ బ్రెడ్ ను ఉపయోగిస్తారు ఒక రకంగా ఆరోగ్యానికి మంచిదే అయినా బ్రౌన్ బ్రెడ్ ను అదీ చీజ్ వాడకుండా దాని ప్లేస్ లో పుదీనా, కొత్తిమీర సాస్ లేదా చట్నీలను ఉపయోగించి సాండ్ విచ్ లను తయారు చేసుకొని తినొచ్చు.
కిడ్నీ బీన్స్: సాధారణంగా చాలా మంది బీన్స్ అంటే బాగా తెలుసు. అయితే కిడ్నీ బీన్స్ అంటే కొంత మంది తెలియదు. ఈ కిడ్నీ బీన్స్ ను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. సాధారణంగా లభించే ఈ కిడ్నీబీన్స్ డైజెస్టీవ్ హార్మోన్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా కిడ్నీ బీన్స్ ను మీ డయట్ లో చేర్చుకొంటారు కదా?
పొటాటో: బంగాళా దుంప బరువు తగ్గిస్తుందా..ఆశ్చర్యం కదా! బంగాళదుంప తినడం వల్ల ఏ సమస్యా లేదు. అయితే వండి విధానంలోనే జాగ్రత్త వహించాలి. ఫింగర్ చిప్స్ మరియు ఫ్రైడ్ పొటాటో చిప్స్ వంటి వాటిలో ఎక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అయితే ఉడికించిన లేదా వేయించిన వాటిలో ఫాట్ అంత ఎక్కువగా మోతాదులో ఉండదు. బంగాళదుంప మీ డైయట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. ఉడికించిన వాటిని బాగా చిదిమి దానిపై పెప్పర్, నిమ్మరసం వంటి వాటిని చేర్చి తినవచ్చు. లేదా స్టఫ్ గా ఉపయోగించవచ్చ. ఆలూ పరోటా వంటివి నూనె, నెయ్యి లాంటివి ఉపయోగించకుండా తయారు చేసుకొని తినొచ్చు.
ఎర్రని టమోటోలు: ఎర్రగా చూస్తానే ఆకర్షించే టమోటోలలో ఒక సీక్రెట్ దాగిఉంది. ఇందులో చాలా శక్తివంతమైనటువంటి యాంటి ఆక్సిడెంట్ కాంపౌడ్ లైకోపెనే కలిగి ఉండి. దీని ద్వారానే ఆ టమోటోలకు అంతటి ఆకర్షనీయమైన కలర్ ను కలిగి ఉంటుంది. చాలా తక్కువ ఖరీదులో అరుదుగా దొరికేటటువంటి టమోటోలు లోఫాట్ ఆహారం. కాబట్టి అతి త్వరగా బరువును తగ్గించే ఆహార పదార్థాలల్లో తప్పనిసరిగా టమోటోలను చేర్చండి. శరీరానికి కావలసిన శక్తిని పొందండి.



Click it and Unblock the Notifications