For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకర జీవనానికి ఆయుర్వేద ఆహారం!

By B N Sharma
|

ఆయుర్వేద ఆహారంలో ప్రాచీన మహర్షుల వేదాల రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఆయుర్వేద అనేది వాస్తవంగా ప్రాచీనకాలంవారు వ్యవహరించిన ఔషధ శాస్త్రాలనే వేదం క్రింద వస్తుంది. ఈ శాస్త్రాన్ని వారు ఎంతో సాధన చేశారు. ఈ ఆహారం ఆయుర్వేద సూత్రాలపై చక్కగా రచించబడింది. ఆయుర్వేద ఆహారంలో అనేక అంశాలున్నాయి. వాటిలో ఒక సులభమైనది మీ ఆహారంలో ఏ రుతువులో వచ్చే ఆహారాలు ఆ రుతువులలో ఆహారంగా చేర్చుకోవడం. మరి ఆరోగ్యకరమైన, చక్కని ఆహారం ఆయుర్వేద సిద్ధాంతాలపై ఏ విధంగా రూపొందించబండిందనేది పరిశీలిద్దాం. ఈ సూత్రాలు, ఆహారం ఎలా తీసుకోవచ్చనేది తెలియజేస్తాయి.

Ayurvedic Diet To Live Healthy

ఆయుర్వేద ఆహార సిద్ధాంతాలు
రుచి ఆధారంగా - ఆయుర్వేద సిద్ధాంతాల మేరకు, ఆహారానికి వివిధ రుచులుంటాయి. అవి తీపి, పులుపు కారం, చేదు, ఉప్పు మొదలైనవి. ప్రతి ఆహారం ఈ రుచులు కలిగి ఉంటాయి. మన ఆధునిక జీవన విధానాలను దృష్టిలో పెట్టుకొని, ఒకే భోజనంలో ఈ రుచులను కలిగి ఉండటం కూడా కష్టమే. కనుక మీరు ఆయుర్వేద ఆహారం ఆచరించాలంటే, మీకు రోజులో ఈ రుచులు తప్పక ఉండాల్సిందే.

సీజనల్ ఆహారం - ప్రతి సీజన్ లోను వచ్చే పండ్లు లేదా కూరలు విశిష్టమైన పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ వాస్తవాన్ని ఆయుర్వేదం గుర్తించింది. ప్రతి సీజన్ కు ఒక ఆయుర్వేద హాహారాన్ని గుర్తించింది. ఈ రకంగా వివిధ సీజనల్ ఆహారాలు దీనిలో చేర్చారు.

పిత్త - వేసవి వేడిలో పొట్టకు కొన్ని వేడి సంబంధిత సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించేందుకు పిత్త గుణం పొట్టలో కావాలి. అందుకని పొట్టను చల్లగా ఉంచేందుకు పెరుగు, మజ్జిగ వంటివి అధికంగా తీసుకోవాలని తెలిపారు.

వాత - చలికాలం వచ్చిందంటే, వాతంకలిగే ఆహారాలు తినాలి. ఈ కాలంలో చర్మం, శరీర భాగాలు పొడిబారుతూంటాయి. కనుక నీటి సంబంధిత ఆహారాలు కావాలి. నూనె మరియు వెచ్చటి ఆహారాలు ఈసీజన్ కు బాగా కావాలి. అపుడే మీరు చలికి తట్టుకోగలరు.

కఫ - వసంత రుతువు కొన్ని అలర్జీలను, శ్వాస సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. ఈ సమయంలో కఫ ఆహారంఅంటే, శ్లేష్మం చేరని ఆహారాలు అంటే తేనె, అల్లం రసం, మొదలైనవి అవసరపడతాయి.

శరీర ధర్మాన్నిబట్టి తిండి - శరీరంలోని దోషాలు లేదా బలహీనతలను బట్టి కూడా ఆయుర్వేద ఆహారం రూపొందించారు. మీ శరీరం ఏ రకమైనదనేది నిర్ణయించారు. మీలో కనుక పిత్త దోషం ఉంటే మీరు సంవత్సరం అంతా పిత్త ఆహారం తీసుకోవాలని, లేదా మీ శరీరం వాత, లేదా కఫ స్వభావ శరీరమైతే, ఆ యా ఆహారాలను సంవత్సరమంతా తీసుకోవాలని తెలిపారు.

ఆహారం తాజా దనాన్ని బట్టి - ఆయుర్వేద శాస్త్రంలో ఆహారాన్ని తాజాదనంతో కూడా తెలిపారు. అపుడే చెట్టునుండి కోసిన పండు తాజాదనం కారణంగా పది గుణాలు కలిగి ఉంటే, ఫ్రిజ్ లో పెట్టిన మాంసానికి జీరో గుణాలని తెలిపారు. కుళ్ళిన, లేదా నిలువ ఉన్న ఆహారాలలో పాజిటివ్ ఎనర్జీ ఉండదని, వాటిని తినరాదని తెలిపారు. కనుక మీరు ఈ సిద్ధాంతాల మేరకు మీ ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టటం తగ్గించి, వాటిని తాజాగా ఎప్పటికపుడు తినేయండి.

మరి ఈ ఆయుర్వేద ఆహారాన్ని మీ ఆహారాలలో చేర్చి, ఆయుర్వేద విధానాలు పాటిస్తూ చక్కని ఆరోగ్యం పొందండి.

English summary

Ayurvedic Diet To Live Healthy | రోజులో తినాల్సిన రుచులు!

Freshness Of Food: In the science of Ayurveda, food is rated on the basis of its freshness. So a fruit just plucked from the tree would score a 10 and frozen meat would score 0. Food that is stale is not infused with the positive energies of nature. Thus, you must try to minimise refrigeration and have fresh foods.
Story first published: Monday, July 30, 2012, 15:18 [IST]
Desktop Bottom Promotion