For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరికరాలు లేని సిక్స్ ప్యాక్ వ్యాయామాలు!

By B N Sharma
|

ఆరోగ్యం కొరకు వ్యాయామాలు చేయాలంటే...జిమ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటిలోనే ప్రతిరోజూ చేసి ఆరోగ్యం పొందవచ్చు. కాని కొంతమంది వ్యాయామాలు అంటే వివిధ రకాల పరికరాలు ఉండాలని భావిస్తారు. వాటిపై ఎంతో వ్యయం చేస్తారు. కాని ఏ పరికరం లేకుండానే కూడా ఇంటి వద్ద వ్యాయామాలు చేసి బరువు తగ్గవచ్చు. శారీరక ఫిట్ నెస్ తేలికగా పొందవచ్చు. మరి పరికరాలు లేని వ్యాయామం ఎలా?

Exercises Without Using Equipments

పుష్ అప్ లు - సాధారణంగా పుష్ అప్ లను పురుషులు ఇష్టపడతారు. చిన్నవయసు వారు తమ శారీరక సౌష్టత కొరకు వీటిని రెగ్యులర్ గా చేస్తారు. యువతులు సైతం తమ శరీర పై భాగం అంటే వక్షోజాలు బాగా పెరిగి ఆకర్షణీయంగా కనపడాలని వీటిని చేస్తారు. శరీర పై భాగ కండరాలు బలపడి మంచి ఆకారం సంతరించుకోవటానికి ఇంటిలోనే తేలికైన వ్యాయామాలు చేయవచ్చు. పుష్ అప్ లు ఛాతీ, చేతి కండరాలకు బాగా పని చేస్తాయి. పుష్ అప్ లు గోడకు చేతులు ఆనించి కూడా చేయవచ్చు. ఏ సమయంలో అయినా చేయవచ్చు. అయితే మీ పొట్ట ఖాళీగా ఉండే సమయంలో చేయాలి.

బస్కీలు తీయటం - బస్కీలు తీయటం అంత తేలికైన వ్యాయామం మరొకటి లేదు. కూర్చొనటం, పైకి లేవటం వేగంగా చేయాలి. ప్రతిరోజూ చేసే ఈ వ్యాయామాలు మీశరీరంలోని అధిక బరువును తొలగిస్తాయి. కాళ్ళకు, తొడ భాగాలకు, నడుముకు ఎంతో బలం చేకూరుతుంది. ఈ వ్యాయామం చేయటానికి ఏ పరికరాలు అవసరం లేదు. పొట్ట, తొడలు, నడుము మంచి షేప్ లోకి వచ్చేస్తాయి.

కాళ్ళు పైకి ఎత్తుట - వెల్లకిలా పడుకొని నడుము భాగం వరకు మీ కాళ్ళను వర్టికల్ గా గాలిలోకి పైకి లేపండి. మరల కిందకు దించండి. ఈ వ్యాయామం మీ కాళ్ళకు చక్కటి రక్తప్రసరణ కలిగిస్తుంది. నడుము భాగం, పొట్ట బాగా బలపడతాయి.కాళ్ళను తిన్నగా పైకి లేపటం కష్టమనిపిస్తే, మోకాళ్ళ వరకు వంచి పైకి లేపండి. కొద్ది సెకండ్లు దానిని నిలిపి ఉంచండి. మరల క్రిందకు దించి రిలాక్స్ అవండిప ఈ వ్యాయామం పది లేదా పదిహేను నిమిషాలపాటు ప్రతిరోజూ చేస్తే శారీరక ఫిట్ నెస్ చాలా బాగుంటుంది. పొట్ట కండరాలు బలపడి స్లిమ్ అయిపోతారు.

మెట్లు ఎక్కుట - ప్రతిరోజూ మెట్లు ఎక్కటం లేదా దిగటం వంటివి మనం చేసే పనే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మెట్లు ఎక్కండి లేదా దిగండి. మీ జాయింట్ నొప్పులు తగ్గి అవి బలపడతాయి. భవిష్యత్తులో కీళ్ళు అరిగిపోయే సమస్య ఉండదు. రక్త ప్రసరణ బాగా జరిగి గుండె వేగంగా కొట్టుకొని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

పొట్ట వ్యాయామాలు - సిక్స్ ప్యాక్ కొరకు ప్రయత్నిస్తున్నారా? ఏ పరికరం దానికి అవసరం లేదు. వెల్లకిలా పడుకోండి. మీ మోకాళ్ళను తీసుకు వచ్చి ఛాతీ భాగానికి తగిలించి వీలైనంత మేరకు పొట్టను ఒత్తండి. ఈ వ్యాయామంలో మీ పొట్ట, తొడ భాగాలు, వెన్నెముక, చేతులు ఎంతో బలపడతాయి.

జిమ్ కు వెళ్ళి ఎంతో సొమ్ము వ్యయం చేయకుండా, ఇంటిలోనే ఏ పరికరం లేకుండా, ఈ వ్యాయామాలు చేసి మీ శారీరక సౌష్టవం కాపాడుకోండి.

English summary

Exercises Without Using Equipments | పుష్ అప్ ఇచ్చే వక్ష సౌందర్యం!

Ab crunches: This exercise tones and strengthens the abdomen muscles. If you want to get 6 pack abs without lifting heavy weight dumbbells at a gym, try ab crunches. Ab crunches are also done by women to get a flat stomach and also tone their thigh muscles. Ab crunches work on abdomen, thighs, spine and arms.
Story first published: Friday, July 27, 2012, 10:26 [IST]
Desktop Bottom Promotion