Just In
- 18 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- 21 hrs ago
Today Rasi Phalalu : ఈ రోజు అదృష్ట రాశులు ఎవరు? తెలుసుకోవడానికి మీ రోజువారీ జాతకాన్ని చదవండి.
- 1 day ago
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- 1 day ago
రోజుకి ఇంత వాల్నట్ తింటే చాలు అధిక రక్తపోటు తగ్గుతుంది...
Don't Miss
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Movies
పవిత్ర నా భార్య.. సహజీవనం ఏంటి? నరేష్ ఎవరో కూడా తెలియదన్న సుచేంద్ర ప్రసాద్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
బరువును తగ్గించి నాజాగ్గా మార్చే హెల్తీ సూప్స్ ...
బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరికీ ఒకే విధమయిన కామన్ డైట్ పనిచేస్తుందని చెప్పాలేం. అది ఒక్కొక్కరి అవసరాలు, జీవన విధానాలు, శారీరక తీరుపై ఆధారపడి ఉంటుంది.బరువు సమతూకంగా ఉండి, చక్కని ఆరోగ్యం కోసం ఓ ప్రణాళిక కార్యక్రమం ఎంతయినా అవసరం.
కడుపు మాడ్చుకోకుండా క్యాలరీల్ని ఎలా తగ్గించుకోవాలా అని సతమతం అవుతున్నార? అయితే భోజనానికి ముందు సూప్ తాగే యమంటున్నారు నిపుణులు. తక్కువ క్యాలరీల వెజిటేబుల్ సూప్ ను భోజనానికి ముందు తాగడం వల్ల భోజనంలో కాలరీల్ని 20శాతం తగ్గించుకోవచ్చు. ఈ విషయమై అనేక అధ్యయనాలు జరిగాయి. సూప్ తాగకుండా భోజనం చేసే వారిపై, సూప్ తాగి భోజనం చేసే వారిపై జరిగిన విస్త్రుత అధ్యయనంలో సూప్ తీసుకోనివారు ఆహారాన్ని యధేచ్చగా ఆస్వాధించినట్లు గుర్తించారు. సూప్ తాగి భోజనం చేసినట్లయితే కాలరీలు సగటున 135 దాకా పెరిగినట్లు గుర్తించారు.
సూప్ తయారీ విధానం పెద్దగా ప్రభావితం చేయదని, తయారీకి ఏ పదార్థాలు వినియోగించినా ఫలితం ఒకే మాదిరి కనిపించిందని వివరించారు. భారీగా క్రీమ్ లేదా ఛీజ్ ఆధారిత సూప్ లు తాగితే ఆ రూపంలో క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి, వీలైనంత వరకు సాదా వెజిటబుల్ సూప్ లనే ఎంచుకోవాలి.
ఇంట్లో ఫ్రెష్ గా తయారు చేసుకునే టొమోటో, మష్రుమ్, బేబీకార్న్ సూపులు ఎంతో రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్నిస్తాయి. అలాగే క్యాన్డ్ , ప్యాకేజ్ సూప్ లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం రకాల్నిఅంటే ఉప్పు శాతం తక్కువగా ఉండే కేన్డ్ సూపుల్ని ఎంచుకుంటే మంచిది.
బాగా జలుబు చేసినప్పుడు చికెన్ సూప్ తాగి చూడండి. వెంటనే బ్యాక్టీరియా బయటికి పోతుంది. సూప్స్ తయారు చేయడం వల్ల కాయగూరల్లో ఉన్న సహజమైన గుణాలేవీ పోకుండా ఉంటాయి. ప్రత్యేకించి ఈ సూప్స్‌లో క్యాబేజ్, క్యారెట్స్, అల్లం, ఉల్లిగడ్డలు, పుట్టగొడుగులు, ఆకుకూరలు ఉపయోగిస్తే ఆరోగ్యానికి మరీ మంచిది. క్యాబేజ్ శరీరంలోని ఇన్ఫెక్షన్స్ను పోగొడితే.. అల్లం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.
ఇక బీట్రూట్, దోస, కీరదోస, పాలకూర రక్తాన్ని శుద్ధి చేసి అధికకొవ్వును కరిగిస్తాయి. కాలేయ శుద్ధికీ ఉపయోగపడతాయి. సూప్స్‌కి బియ్యపు పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పొడిలాంటివి యాడ్ చేస్తే.. సూప్‌కి చిక్కదనం రావడమే కాదు అండ్ హెల్దీగానూ తయారవుతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా కావాలనుకునేవాళ్లు పప్పుధాన్యాలను యాడ్ చేసుకోవచ్చు. గుడ్డులోని తెల్లసొన కూడా కలపొచ్చు. వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలను చాలా జాగ్రత్తగా కడగాలి.
సూపుల వలన తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు శరీరానికి అందడమే కాకుండా, శారీరక మానసిక వత్తిడులను తగ్గిస్తాయి. తేలికగా జీర్ణం కావడమే ఇందుకు కారణం. అంతేకాక నాడీ వ్యవస్థ మీద నేరుగా ప్రభావం చూపించ గలగడం సూపుల ప్రత్యేకత.