For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీని బిల్డ్ చేయడానికి ఐదు చక్కటి మార్గాలు..!

|

Allu Arjun
సిక్స్ ప్యాక్ బాడీ ముందు హాలీవుడ్ లో మాత్రమే చూసే వాళ్ళం అయితే తర్వాత తర్వాత బాలీవుడ్ హీరోల్లో భాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో కొత్త ట్రెండ్ ఇది. అందుకే అందరూ ఒక్కసారయినా తమ కండలను ప్రదర్శించాలని అనుకొంటుంటారు. సిక్స్ ప్యాక్ ఉన్న (మంచి శరీర సౌష్టం)కలిగిన పురుషులంటే మహిళలకు కూడా మంచి క్రేజ్ ఉంది. యూత్‌ నేడు ఫిట్‌నెస్‌ మంత్రాన్ని జపిస్తున్నారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేందుకు కొందరు యువకులు ప్రతిరోజు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఎక్సర్‌సైజులు చేస్తూ కేవలం ఫిట్‌గానే ఉండడం కాదు తమ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తున్నారు. ధృడమైన శరీరంతో సిక్స్‌ప్యాక్‌ బాడీని పొందాలని వారు తాపత్రయపడుతున్నారు. నేడు సిక్స్‌ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. మరీ మీరు మీ శరీర సౌష్టవాన్ని కండర పుష్టిని పెంచుకోవాలనుకొంటుంటే ఇక్కడు కొన్ని సులభమైన చిట్కాలు మీకోసం...

1. ముందుగా కండారానలు అభివద్ది చేసుకోవాలి: కఠినమైన ఎక్సర్‌సైజులతో సిక్స్‌ప్యాక్‌.. ఈ బాడీ పొందడం అంత ఈజీ కాదని ఫిట్‌నెస్‌ నిపుణులు సెలవిస్తున్నారు. తీవ్రమైన కసరత్తులే కాదు ఆహార నియమాలు కూడా తప్పనిసరని వారు చెబుతున్నారు. సిక్స్‌ప్యాక్‌ కోసం కడుపులోని మజిల్స్‌ను దృఢపరచి కొవ్వును పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది. ఇందు కోసం కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

2. ఆహారం విషయంలో: సిక్స్‌ప్యాక్‌ కోసం ఎక్సర్‌సైజులతో పాటు ఆహారనియమాలు తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. డైట్‌ కంట్రోల్‌ ద్వారా 80 శాతం కొవ్వును తగ్గిస్తే ఎక్సర్‌ సైజుల ద్వారా 20 శాతం కొవ్వును కరిగించవచ్చని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతు న్నారు. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే డిన్నర్‌ను పూర్తిగా నియంత్రించాల్సి ఉం టుంది. ఇందు కోసం ‘ఈట్‌ క్లీన్‌' ఆహారాన్ని తీసుకోవాలని వారు సెలవిస్తున్నారు. తీసుకునే ఆహారంలో 50 శాతం పండ్లు, కూరగాయలు ఉండేవిధంగా చూసుకో వాల్సి ఉంటుంది. కాలరీ స్నాక్స్‌ను తీసుకుంటే మంచింది. డిన్నర్‌లో ఎక్కువగా అవసరానికి మించి ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

3. సరైన వెయిట్ ట్రైనింగ్: కండరాలను బలపరచాలంటే తప్పనిసరిగా వైయిట్ ట్రైయినింగ్ చేయాల్సి ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలను ధృడ పరిచేందుకు ఈ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ‘వీటిలో అబ్డామినిస్‌, స్క్వాట్స్‌, క్రంచెస్‌, సిటప్స్‌, లెగ్‌ లిఫ్ట్‌‌స, జాక్‌నైఫ్‌ సిటప్స్‌, వి అప్స్‌, డంబుల్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్స్‌, తదితర ఎక్సర్‌ సైజులను చేయాల్సి ఉంటుంది. వెయిట్‌ లిఫ్టింగ్స్‌ ఎక్సర్‌ సైజులను ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్‌ సైజులతో బాడీలోని వివిధ శరీరభాగాలు ధృడమైన ఆకృతిలో చక్కగా తీర్చి దిద్దబడతాయి'

4. శక్తి కోసం: వెయిట్ ట్రైనింగ్ తీసుకొన్న తర్వాత శరీరానికి తగినంత శక్తి కోసం మరో శిక్షణ అవసరం ఉంటుంది. శక్తిని పొదడం ద్వారా కండారలకు బలం చేకూరి వర్క్ అవుట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ కండారాలను బలంగా, ధృడంగా ఉండేట్టు చేస్తాయి.

5. కడుపులోని రెక్టస్‌ అబ్డామినిస్‌ ను ధృడంగా తీర్చిదిద్దేందుకు స్క్వాట్స్‌, అబ్డామినిస్‌ ఎక్సర్‌సైజు లను చేయాల్సి ఉంటుంది. నడుమును సన్నపరిచి వెన్నెముక కు సమాంతరంగా బాడీని ధృడపరచాల్సి ఉంటుంది. స్క్వాట్స్‌ తో పాటు డెడ్‌లిఫ్ట్‌‌స ఎక్సర్‌సైజులు ఇం దుకు తోడ్పడతాయి. ఈ ఎక్సర్‌సైజులతో కడుపు వద్ద ఉన్న ఫ్యాట్‌ పూర్తిగా కరిగిపోతుం ది. ఇక క్రంచెస్‌ ఎక్సర్‌సైజులను చాతి, భుజాలను ధృడపరిచేం దుకు చేస్తారు. నేలపై పడుకొని కాళ్లు, చేతులను వంచుతూ ఈ ఎక్సర్‌సైజులను చేస్తారు. మజిల్స్ కోసం ఇలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సిక్స్ ప్యాక్ తో బాలీవుడ్, టాలీవుడ్ హీరోల్లా మీరు మీ శరీర సౌష్టవాన్ని పెంచుకోవచ్చు.

English summary

Teen Boys-Building Muscle Tips... | టీనేజ్ బాయ్స్ లో ధృడమైన శరీర సౌష్టం ఎలా..!

Rock hard muscles is what drives a woman crazy towards a man. Needless to say that most men want to build muscles that are rock hard and chiseled. But, building muscles is not a very easy task. No trainer in the world will tell you exactly how you can harden your muscles. It is easy to build muscle mass with protein shakes and look all beefed. If those muscles are not hard, then you will look like a puffed up balloon, not a chiseled Greek God.
Story first published:Saturday, August 11, 2012, 12:29 [IST]
Desktop Bottom Promotion