For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి మాత్రమే కాదు.. బరువు తగ్గించే పవర్ ఫుల్ వెజ్ జ్యూసులు

|

సాధారణంగా తరచూ మనం పండ్లతో తయారు చేసే రకరకాల జ్యూసులను త్రాగుతుంటాం. కానీ వెజిటేబుల్ జ్యూసులు త్రాగడం అరుదు. అయితే ఒక గ్లాసు జ్యూసు తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తుంది. పండ్ల, లేదా కూరగాయలతో తయారు చేసిన జ్యూసుల్లో అత్యధిక శాతంలో ప్రోటీనులు మరియు విటమినులు ఉంటాయి. అందువల్ల చాలా మంది సెలబ్రెటీలు, హెల్త్ ఎక్స్ పర్ట్స్ మరియు డైయట్ ఫాలో చేసేవాళ్ళు ఎక్కువగా పండ్లతో, కూరగాయలతో తయారు చేసిన ఫ్రెష్ జ్యూసులను త్రాగుతుంటారు.

పోషకాల విషయానికి వస్తే పండ్ల రసాలు మరియు వెజిటేబుల్ జ్యూస్ డిఫరెంట్ గా ఉంటాయి. పండ్లను ఫ్రూట్స్ జ్యూసర్ లో వేసి తయారు చేస్తారు. అయితే వెజిటేబుల్ జ్యూస్ ను మిక్సీలో వేసి తయారు చేయాలి. వెజిటేబుల్ జ్యూస్ ను మిక్సీలో వేసి తయారు చేయడం వల్ల. కూరగాయల్లో ఉండే ఫైబర్ నష్టపోకుండా ఉంటుంది. ఆరోగ్యానికి సహాయపడే వెజిటేబుల్ జ్యూసులు చాలా రకాలు ఉన్నాయి. కానీ అన్ని వెజిటేబుల్ జ్యూసులను కాకుండా కొన్ని ప్రత్యేకమై గ్రీన్ వెజిటేబుల్స్ కు మాత్రమే ఫ్రివర్ చేస్తే, ఆరోగ్యానికి, లోక్యాలరీలతో, సంపూర్ణ విటమిన్ పోషణను శరీరానికి అంధిస్తుంది.

గ్రీన్ వెజిటేబుల్స్ తో తయారు చేసే జ్యూసులు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్రొకోలి, కేలా, కొత్తిమీర, బిట్టర్ గార్డ్, టమోటో, ఇక పండ్ల విషయంతో కివి, మరియు పచ్చిమామిడికాయ. ఈ గ్రీన్ జ్యూసుల్లో అత్యధికంగా పోషకాలు ఉంటాయి. బరువు. తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి ఈ జ్యూసులను రోజులో ఎప్పుడైనా త్రాగవచ్చు. గ్రీన్ వెజిటేబుల్స్ క్లోరోఫిల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరానికి కావల్సిన ఆక్సిజన్ ను అందిస్తుంది. ఇంకా బ్లడ్ సర్కులేషన్ ను క్రమబద్దం చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న టాక్సిన్స్ (విషాల)ను బయటకు నెట్టివేస్తుంది. ఇందులో ఉండే చాలా రకాల యాంటీఆక్సిడెంట్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, క్యాన్సర్ తో పోరాడుతుంది.

గ్రీన్ వెజిటేబుల్స్ లో మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, జింక్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా డైలీ డైయట్ కు చాలా అవసరం. చాలా వరకూ అన్ని గ్రీన్ వెజిటేబుల్స్ లోనూ, ఫ్రూట్స్ లోనూ విటమిన్ ఎ, సి మరియు డి పుష్కలంగా ఉంటాయి. ఇక ఎందుకు ఆలస్యం?ఆరోగ్యకరమైన శరీర సంరక్షణకు, గ్రీన్ వెజిటెబుల్, ఫ్రూట్ జ్యూసులను త్రాగేయండి. అన్నిరకాల కూరగాయల జ్యూసులు చేదుగా, రుచిలేకుండా, కాకరకాయ జ్యూసులాగేం ఉండవు. కొన్ని రకాల కూరగాయలు సొరకాయ, ఆకుకూరలు మరియు నిమ్మకాయ, క్యారెట్, మొదలగునవి. కాబట్టి ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని హెల్తీ జ్యూసులను మీకోసం... వీటితో తగినన్ని న్యూట్రీషనల్ బెనిఫిట్స్ పొంది. ఎంజాయ్ చేయండి...

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

బిట్టర్ గార్డ్ జ్యూస్: మనం అందరం చాలా వరకూ చేదుగా ఉండే గ్రీన్ వెజిటేబుల్స్ ను, జ్యూసులకు దూరంగా ఉంటాం. అయితే ఇటివంటి ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ కు మరియు శరీరంలో క్రొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతాయి. కాకర జ్యూస్ చాలా చేదుగా అనిపిస్తే అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

స్పినాచ్(ఆకు కూరలతో)జ్యూస్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూసులు బరువు తగ్గాలనుకొనే వారికి చాలా మంచిది. ఇందులో అధిక శాతంలో విటమిన్స్, మరియు ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. ఉడికించిన ఆకుకూరల జ్యూసును ఒక గ్లాస్ త్రాగడం వల్ల ఇటు శరీరం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ, కురుల సంరక్షణతో పాటు. కళ్ళ ఆరోగ్యానికి మంచిది.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

కివి జ్యూస్: కివి ఒక పండు. దీంతో తయారు చేసే జ్యూస్ ఆరోగ్యం మాత్రమే కాదు టేస్టీ కూడా. ఈ కివి జ్యూస్ ను ఒక్క సారి త్రాగితే చాలు అందరికి చాలా ఇష్టం అవుతుంది. దీన్ని పాలతో మిక్స్ చేసి త్రాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీనులు అందుతాయి.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

బ్రొకోలీ జ్యూస్: గ్రీన్ వెజిటేబుల్ జ్యూసులు వల్ల చాలా రకాల ఆరోగ్య, న్యూట్రీషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది తమ చర్మసంరక్షణ కోసం, చర్మం మెరిసేలా చేసుకోవడం కోసం బ్రొకోలీ జ్యూసును రెగ్యులర్ గా తీసుకుంటుంటారు. ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది. బ్రొకోలీ, మెలకెత్తిన విత్తనాల జ్యూసులు చాలా ఫేమస్.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

కొత్తిమీర జ్యూస్: చాలా సన్నటి ఆకులు కలిగిన గ్రీన్ లీఫ్ కొత్తిమీర. దీంతో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మెడిసినల్ ఔషధ గుణాలు ఎక్కువ. క్యాన్సర్ తో పోడటం అటుంచితే, ఈ జ్యూస్ తో డైజషన్, రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బ్లెడ్ ప్రెషర్ లెవల్ కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

పార్స్లే జ్యూస్: గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ ను పచ్చివి గ్రైడ్ చేసి త్రాగవచ్చు. లేదా ఉడికించి ఆ రసం త్రాగవచ్చు. పార్ల్సే జ్యూస్ శరీరంలోని అన్ని జీవక్రియలను క్రమంగా నడిచేలా చేస్తుంది. ఇంకా రక్తహీనత నుండి కాపాడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. నోటి దుర్వసనను దూరం చేస్తుంది.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

మ్యాంగో జ్యూస్: వేసవి కాలంలో మ్యాంగో తినకుండా, మ్యాంగో జ్యూస్ త్రాగకుండా సమ్మర్ పూర్తికాదు. ఈ సీజన్ లో దొరికే పచ్చిమామిడియాలతో జ్యూస్ చేసి త్రాగితే కొద్దికొద్దిగా పులుపు, తీయ్యంగా ఉండే ఈ జ్యూస్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. సన్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

కుకుంబర్(కీర దోసకాయ)తో జ్యూస్: సహజంగా బరువు తగ్గాలనుకొనే వారు, కాంతివంతమైన చర్మ పొందాలనుకొనే వారు ప్రతి రోజూ ఈ కీర దోస జ్యూస్ ను త్రాగడం చాలా అవసరం. ఇది జీర్ణం కావడానికి చాలా సులభం. మరియు శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

బాటిల్ గార్డ్(సొరకాయ): విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్ , సొరకాయలో లబిస్తాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, సులువుగా జీర్ణమవుతుంది. డయూరెటిక్ గా పనిజేస్తుంది. ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది. పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది, అలసటను తగ్గిస్తుంది.

అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

అవొకాడో జ్యూస్: అవొకాడో జ్యూసులో చాలా హెల్త్ మరియు స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి రోజూ అవొకాడో జ్యూస్ ను త్రాగితే మంచి ఆరోగ్యంతో పాటు, కాంతివంతమైన చర్మ ఛాయను పొందుతారు.

English summary

Healthy Green Vegetable Juice To Try | అధిక బరువు తగ్గించే పవర్ ఫుల్ ‘వెజ్’ జ్యూసులు..!

A glass of juice has many health as well as nutritional benefits. Fruit as well as vegetable juice has many proteins and vitamins loaded in them. That is the reason why celebrities, health experts and dieters have a glass of fresh fruit or vegetable juice regularly.
Desktop Bottom Promotion